S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విప్పేద్దాం

విప్పేద్దాం
నిస్సిగ్గుగా
దేహాలన్నీ
బజార్లలో
సంచారం

ఎందుకురా
మనకి విలువల సంకెళ్లు
వలువలూడిన
మానవత్వం
కన్నా తప్పేం కాదు

పసికూన మొదలు
కాటికి కాళ్లు చాపిన
ముసలిదాకా
మొసళ్ల కాటుకి బలౌతుంటే
ఇంకెందుకీ దాపరికం

వలువల వెనుక
దాగిన అవయవాల
బహిర్గతం చేసేద్దాం
ఏ మతవయవాల సౌష్టవం ఎంతో
తేటతెల్లం చేసేద్దాం
చూసేద్దాం లోతుపాతులన్నీ

దాచిన కొద్దీ
రభస నానా రభస
తెల్సుకుంటారో
తేల్చుకుంటారో
మతాన్ని అడుగుతారో
కులాన్ని అడుగుతారో
రంగురంగుల జెండాల
కుమ్ములాటల్లో
అవయవాల అంగళ్లు బార్లా

దృశ్యకావ్యాలు
వ్రాసుకుంటారో
దృశ్య వీక్షణంలో
తబ్బిబ్బవుతారో
నవనాగరిక సమాజంలో
ఊరేగుతారో

-గిరిప్రసాద్ చెలమల్లు 9493388201