S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్నేహంస్నేహం

నెలరాజులా వెలుగులు చిందుతూ
ముద్దబంతిలా మురిపా లొలకబోస్తూ
మదిలో నిత్యం పారే
వెలుగు ఉదయాల సెలయేరై
చూపు మాత్రంతోనే
ఎడారై ఎండిన ఎదలో సుధలూరించే
కష్టం ఇష్టమయ్యే
భావసారూప్యత కలిగి
ఎక్కువ తక్కువల భేదం తెలియక
నిన్నటి నైరాశ్యాల నింగిలో
రేపటి ఆశయై పొద్దుపొడుస్తూ
ఒంటరితనాల ఎదల్లో తోడుగా
నేనున్నానంటూ స్థైర్యాన్నిచ్చేదై
సంతోషాల నక్షత్రాలను పోగేసేందుకు
ఆనందాల సంచై వెంట వచ్చేదే స్నేహం
అదొక అద్భుతమైన అనుభూతి
అందమైన ప్రపంచం.

- వేమూరి శ్రీనివాస్.. 9912128967