S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావృక్షం

ఈ సృష్టిని మించిన మహత్తుని చూపించేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో.
వ్యక్తులు చూపించే మహిమలు, మహత్తులు చాలా చిన్నవి.
ఈ సృష్టిని మించిన కమ్యూనిస్ట్ కూడా ఎవరూ లేరు ఈ ప్రపంచంలో.
ఈ సృష్టి అందరినీ ఒకేలా చూస్తుంది.
డబ్బున్న వాడిని, బీదవాడిని, అనామకుడిని, బాగా పేరున్నవాడిని, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని, ఏ రంగంలో ప్రవేశం లేని వ్యక్తిని ఒకేలా చూస్తుంది.
అందరికీ ఒకే వెలుగుని ఇస్తుంది.
అందరికీ ఒకే గాలిని ప్రసాదిస్తుంది.
అందరికీ ఒకే ఉపద్రవాన్ని కలిగిస్తుంది.
అన్నీ ఉచితంగా ఇస్తుంది.
ఈ సృష్టిని మించిన మహత్తులు మహిమలు చూపించే వ్యక్తులు ఎవరూ లేరు.
ఒక చిన్న ఎత్తుని మహావృక్షంగా మారుస్తుంది. అయితే అది ఒక్కరోజులో జరగదు. చాలాకాలం పడుతుంది. అందుకు ఎన్నో అవసరం ఏర్పడతాయి. సారవంతమైన భూమి. సూర్యరశ్మి నీరు ఇట్లా ఎన్నో అవసరం.
విత్తు ఒకటే.
అది సారవంతమైన భూమిలో వేస్తే మహావృక్షం అవుతుంది. మామూలు నేలలో విత్తితే కొంత పెరగవచ్చు. పెరగకుండానే చనిపోవచ్చు.
ఈ సృష్టి చేసే మహత్తు ఇదే - ఓ చిన్న ఎత్తుని మహావృక్షం చేయడం. కాలాన్నిబట్టి జంతుజాలం కన్పిస్తుంది. చూసే దృష్టి వుంటే ఇదంతా మహిమలాగా కన్పిస్తుంది.
విత్తులాంటి వాడే మనిషి.
చిన్నగా, గుర్తింపు లేనట్టుగా కన్పించవచ్చు.
మంచి ఆలోచనలో వుండి, మంచి అడుగులు వేస్తే అతనే మహావృక్షంలాగా ఎదగవచ్చు. ఎంతో మందిని ప్రభావితం చేసే విధంగా ఎదగవచ్చు.
మనం ఎదగాలంటే మంచి స్నేహితులు వుండాలి. మంచి పుస్తకాలు చదవాలి. మన గోల్స్ వైపు మన ప్రయాణం కొనసాగాలి.
ప్రతి విత్తులో ఓ మహావృక్షం ఉంది.
ప్రతి వ్యక్తిలో ఓ మహానుభావుడు వున్నాడు.
విత్తుకి మనిషికీ ఒక భేదం ఉంది. అది తనంత తానుగా సారవంతమైన భూమిని ఎంపిక చేసుకోలేదు. మనిషి అన్నింటిని ఎంపిక చేసుకోగలడు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001