S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క(జీ)వనరాగం

జీవమున్న పాటంటే
శ్రావ్యంగా వినిపించాలి
కర్ణపేయంగా శృతిచేయబడాలి
మంచి పదాలు - ఔచిత్యాల్నివ్వాలి
సమానార్థకంగా పండు వెనె్నలల్ని, గండు కోయిలల్ని
తరులతల అలరింపులు చేయాలి!
అది అనుభవేకవేద్యమవ్వాలి.
అప్పుడే ఎదలోతుల్లోంచి
మంత్రముగ్ధతలు - అమంత్రితవౌతుంటాయి.
జీవమున్న పాటంటే
సజీవ చేతనకు ప్రతీక కదా!
సమాజగతంగా, సాంస్కృతికంగా
వర్తమానంలో ఇప్పుడు ఏ పిట్ట పాటల్లోనూ
శ్రావ్యతలు విన్పించటం లేదు.
అమానవీయ సంఘటనలు
అపస్వరాలే మంద్రస్థాయిలో
మరీ సంక్షుభిత సమయ గాత్రాలౌతున్నాయి.
మనం నుంచి జనం భావనలు కొరవడుతున్నాయి.
మనిషితనం తోటలోకి
పల్లవీ స్వరాలు మచ్చుకైనా మిగలటంలేదు.
తహతహలాడే పెదాల పలకరింపులు,
చిలకరించిన దరహాసాల కోసం
అనే్వషణలు అనివార్యవౌతున్నాయి.
అసలు ప్రాకృతిక జీవనుడైన మనిషి కంటే
అటు మండుటెండల్లో మట్టి తట్ట లెత్తుకుంటున్నా,
ఇటు వడ్డించిన విస్తరిల్లా వెండి చెంచాలతో పుట్టినా
మనిషిగా తన్ను తాను తెలుసుకున్నప్పుడే
సమాజంలోకి సమూహమై ప్రవహించగలుగుతాడు.
నిజం నిస్పృహల మోళ్ల నుంచి
నిరాశల గుండె లోతుల్నించి
విడివడినప్పుడు
ప్రేమ మార్దవాల మద్దెల దరువులకు
తోడైన వాయులీన కమానులు విన్పించే
విశ్వజీవన రాగాలు శృతిపేయమవ్వాలి.
ఆ చల్లని స్నేహ హస్తం స్పర్శానుభవం
మెరుస్తున్న కళ్లల్లో మధురిమలు
పిల్లనగ్రోవిలో పొదగబడ్డ
గాలి నైపుణ్యమివ్వాలి.
అవే సేదతీరే క్షణాలు
అనునిత్యం పాటలో - మాటలో
చేతల్లో కన్పడాలి.
ఆ సాంస్కృతిక జీవనం
కవన జీవన రాగానికి
ఆలంబనగా నిలుస్తుంది.

-వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.. 9441148158