S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (1-9-2019 నుంచి 7-9-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు అధికం. అన్ని పనుల్లోనూ వ్యతిరేక ప్రభావాలుంటాయి. శ్రమతో విజయం సాధిస్తారు. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. విశ్రాంతి లోపం ఉంటుంది. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న ఆలోచనలు. ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సామాజిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వారాంతంలో అనుకోని సమస్యలు. గౌరవ లోపాలు. ఇబ్బందులకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనారోగ్య భావనలు. నూతన కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేసుకోవాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు చర్చకు రావచ్చు. ఆర్థిక నిల్వలు సంతోషాన్నిస్తాయి. మాటతీరులో చమత్కారం. మాట విలువ పెరుగుతుంది. నిర్ణయాదులు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. మనస్సు పరిపరి విధాల పోయే అవకాశం. వ్యాపార వ్యవహారాలపై దృష్టి. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత మేలు కలుగుతుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. కాంట్రాక్టు వ్యవహారాలలో శ్రేయస్సు. వారాంతంలో ఆహార విహారాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రమ ఉన్నా అన్ని పనుల్లోనూ అనుకూలత.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో సానుకూలత. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాల్లో కొంత అప్రమత్తం. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలపై దృష్టి. సంతానవర్గంతో సంతోషం. లాభాపేక్ష పెరుగుతుంది. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. సుదూర ప్రయాణ దృష్టి ఉంటుంది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ధార్మికమైన ప్రయాణాలుంటాయి. దానధర్మాలు చేయడం అత్యుత్తమం. గౌరవం కోసం కాలం ధనం వెచ్చించాల్సి వస్తుంది. వ్యతిరేకతలున్నా అధిగమిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. క్రియేటివిటీతో కార్యక్రమాల నిర్వహణ. ప్రణాళికలు సంతోషాన్నిస్తాయి. స్పెక్యులేషన్‌కు అనుకూలత. సౌకర్యాల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశం. అయినా శ్రమతో విజయం సాధించే ప్రయత్నం. నూతన కార్యక్రమాలపై దృష్టి సారించాలి. శత్రువులు, రుణాలకు సంబంధించిన సమస్యలుంటాయి. పోటీ రంగంలో అనుకూలత. రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. విశ్రాంతి లోపం కనిపిస్తుంది. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. గౌరవం పెరుగుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో అత్యంత సంతృప్తి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు విస్తరిస్తాయి. వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెట్టుబడుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. దానధర్మాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో కుటుంబ నిర్వహణలో సంతోషంగా ఉంటుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. బంధువర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. మాట విలువ పెరుగుతుంది. చమత్కారపూరితమైన సంభాషణ. ఆకస్మిక ప్రయోజనాలకు దూరంగా మెలగడం మంచిది. వారాంతంలో పెద్దలతో సంప్రదింపులు అధికవౌతాయి. మంచి వార్తలు వింటారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలత.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత కార్యక్రమాల రూపకల్పన. సుదూర ప్రయాణ భావనలు. ఆధ్యాత్మిక రంగంలో అనుకూలత. వైజ్ఞానిక రంగంలోని వారికి అనుకూల ఫలితాలు. వ్యాపార వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అన్నింటిలోనూ చికాకులకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో సామాజిక గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో పదోన్నతులకు, గుర్తింపునకు అవకాశం కలుగుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. కాంటాక్టు వ్యవహారాలు ఇబ్బంది పెట్టవచ్చు. వారాంతంలో అన్ని పనుల్లో చక్కని ప్రయోజనాలుంటాయి. గురువులు, గౌరవనీయమైన వ్యక్తులను కలుస్తారు. ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహం, వాహనాది విషయాలు చర్చలోకి వస్తాయి. ఆహార విహారాల్లో కొత్త మార్పులకు అవకాశం. సంతోషంగా గడిపే ప్రయత్నం. శ్రమ ఉన్నా సంతృప్తి కలుగుతుంది. విద్యారంగంలోని వారికి అనుకూలత. సౌఖ్యంగా గడిపేందుకు శ్రమిస్తారు. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. మనోభీష్టాలు నెరవేరుతాయి. కొత్త పనులపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రణాళికలు రచిస్తారు. సంతాన వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు. వారితో సంతోషంగా గడుపుతారు. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. పోటీలు ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. అయినప్పటికీ అన్ని పనుల్లోనూ గెలుపు సాధిస్తారు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. కొత్త వ్యాపారాలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. విందులు వినోదాలు, విహారాలపై దృష్టి ఉంటుంది. కొంత కాలం, ధనం వ్యర్థం కావచ్చు. లాభాలున్నా ఆశించిన సంతృప్తి లభించకపోవచ్చు. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో అన్ని పనుల్లోనూ పాల్గొంటారు. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అధికవౌతాయి. కార్యక్రమాలు విస్తరించే అవకాశం ఉంది. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సంతోషంగా గడుపుతారు. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. బంధువర్గంతో గడపాల్సి వస్తుంది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఆకస్మిక నష్టాలు. వ్యాపార వ్యవహారాల్లో లోపాలకు అవకాశం ఉంటుంది. తొందరపాటు కూడదు. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాల వల్ల సమస్యలకు కూడా అవకాశం. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. సాంకేతిక రంగంలో శుభ పరిణామాలు. క్రియేటివిటీ పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం. ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపారాంశాలు చర్చలోకి వస్తాయి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. సామాజిక వ్యవహారాల్లో సంతృప్తి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సుదూర లక్ష్యాలను సాధించే ప్రయత్నం. విద్యా, విజ్ఞాన రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం. కొంత కృషి, శ్రమ తప్పకపోవచ్చు. గృహ వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. విద్యా వ్యవహారాల్లో కృషి శీలత పెంచుకుంటారు. వ్యవహారాల్లో శ్రమతో అనుకూలత. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. అనేక కార్యక్రమాలకు సంబంధించిన ప్లానింగ్ ఉంటుంది. సంతానంతో అత్యంత సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనలు విస్తరిస్తాయి. గౌరవాదులు పెంచుకుంటారు. ప్రయోజనాల వల్ల కొత్త ఆలోచనలకు, ప్లానింగ్‌కు అవకాశం కలుగుతుంది. సంతానవర్గంతో సంతోషం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. ప్రయాణాలు ఉంటాయి. పరామర్శలకు కూడా అవకాశం ఉంది. విహారాలలో అప్రమత్తంగా మెలగాలి. వ్యతిరేకతలు, పోటీలు రాకుండా చూసుకోవాలి. వారాంతంలో కార్యనిర్వహణ దక్షత. శారీరక మానసిక బలం పెంచుకుంటారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శరీరంపై దృష్టి పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. అన్ని పనులు సానుకూలం అవుతాయి. కొన్ని వ్యవహారాల్లో పోటీలు తప్పకపోవచ్చు. వారం మధ్యమంలో జాగ్రత్తగా మెలగాలి. లోపాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఊహించని సంఘటనలు. సమస్యలు రాకుండా చూసుకోవాలి. శక్తిని పెంచుకోవాలి. అనారోగ్య భావనలుంటాయి. చికాకులను అధిగమించాలి. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. వారాంతంలో లక్ష్యాలను సాధించాలి. ఉన్నత వ్యవహారాలను నిర్వహిస్తారు. ప్రణాళికలు అధికవౌతాయి. ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో సంతోషం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744