S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మృత్యుఘోష

భూగర్భ జలాలను విషంతో నింపేస్తున్నావు
జలావరణాన్ని విషావరణం చేసుకుంటున్నావు
పచ్చటి పొలాల్ని ఎడార్లుగా మార్చేస్తున్నావు
గరళంతో గొంతు నింపడానికి నీవేమైనా గరళకంఠుడివా
మబ్బులకు రసాయనాల పూత పూస్తున్నావు
గాలికి వ్యర్థాల అత్తరును పులిమేస్తున్నావు
సముద్రపు అలలను విషపు నురగలతో బుసలు కొట్టిస్తున్నావు
ఈ గరళాన్నంతా గొంతులో దాచేయడానికి
నీవేమైనా గరళకంఠుడివా
ప్రకృతి రమణీయతను వికృతం చేస్తున్నావు
నీలిమేఘాలలో కాలకూట విషాన్ని నింపుతున్నావు
గిరులను తరువులను కాల్చి బూడిద చేస్తున్నావు
భూమాత పచ్చని మేను అంతా విషపు కాటులే,
వొళ్ళంతా కాలకూట విషమే
పక్షులు జంతువుల మృత్యుఘోషలు ఆలకిస్తున్నావా?
జీవకోటి నీటి చుక్కకై మృత్యునాదం వినిపించలేదా?
ఎవరాలకిస్తారు నీ బతుకు రోదన
నీదంతా అరణ్యరోదనని కాదంటావా?
నీ అనాలోచిత చర్యలతో
సుందర మనోహర దృశ్యాలకు కాలుష్యపు పరదాలు కడుతున్నావు
ప్రకృతికాంతకు గర్భశోకం మిగులుస్తున్నావు
జీవ వైవిధ్యానికి వెన్నుపోటు పొడిచేసావు
ఇప్పటికైనా కనులు తెరువు
జీవ వైవిధ్యాన్ని కాపాడు
మానవ మనుగడను ఉరిపీఠం ఎక్కించక ముందే
మానవ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మారకముందే
కళ్లు తెరిచి జీవ వైవిధ్యాన్ని కాపాడే సమయం వచ్చింది
ఆకలిదునిపే మన రైతన్నకు సాయమందించే
తరుణం ఆసన్నమైంది

-వెలగా శేఖర్ 7981376195