S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

తెలంగాణలో విద్య పరిమితమైనా, స్కూళ్లు తక్కువ సంఖ్యలో ఉన్నా ఆదర్శవంతమైన వ్యవస్థ ఉంది. అంకిత స్వభావం గల ఉపాధ్యాయులు జ్ఞానసముపార్జన చేసిన విద్యార్థులు తరగతి గదిలో నిజాం ప్రభుత్వంలో తరగతి గది సమత్వంగా కనపడేది కానీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. ఆనాడు ఉపాధ్యాయుడు (మెట్రిక్ నిసైన్ అన్‌ట్రైన్డ్)లుగా తీసుకుని, మూడు నాలుగేళ్లు వాళ్ల ప్రవర్తన చూశాక, ప్రభుత్వ ఖర్చుపైన శిక్షణ నిప్పించేవారు. అన్‌ట్రైన్డ్ టీచర్లు కూడా ఒక స్కేల్ ఇవ్వబడేది. శిక్షణ పూర్తయిన తర్వాత పై స్కేల్‌కు ప్రమోషన్ ఇచ్చింది. అన్‌ట్రైన్డ్ మెట్రిక్యులేషన్‌కు 54 టూ 901/2 అయితే, ట్రైనింగ్ పూర్తయితే 81 టూ 130 స్కేల్ ఇచ్చేది. అదే ఆంధ్రా ఏరియా లోపల 45 టూ 120 ఇచ్చేది. తెలంగాణలో అన్‌ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అయితే 13 టూ 190 స్కేల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‌కు 154 టూ 275 ఇచ్చేది. అదే ఆంధ్రాలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‌కు 90 టూ 130 ఇచ్చారు. పాత హైదరాబాద్ రాష్ట్రంలో ఆకర్షణీయమైన స్కేళ్లు ఉద్యోగ భద్రత ఉండేది తెలంగాణకు సమర్థులైన ఉపాధ్యాయులొచ్చారు. చాలామంది ఆంధ్రా నుంచి వలస వచ్చి తెలంగాణలో ఉద్యోగం చేశారు. చివరకు తమిళనాడు నుంచి కొంతమంది వచ్చారు. ఉద్యోగ భద్రత ఉంటే ఆకర్షణీయమైన స్కేళ్లు ఉంటే పటిష్టమైన విద్య కూడా పిల్లలకు అందుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోకి తెలంగాణ విలీనమయ్యాక ఇక్కడి విద్యా వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది. దీని వలన విద్యారంగంలో అసమానతలు ఏర్పడ్డాయి. ఇక్కడి విద్యా వ్యవస్థను బలహీనపర్చడమే కాదు, స్థానిక ఉపాధ్యాయులో నిరాశా నిస్పృహలకు గురి చేశారు. బలహీనమైన విద్యా వ్యవస్థ వలన సర్కారీ స్కూళ్లు బలహీనమై పోయాయి. ప్రైవేటు స్కూళ్లు అవతరించాయి. దీనికి తోడు మార్కెట్ కూడా కొంత ఆజ్యం పోసింది. క్రమంగా సర్కారీ స్కూళ్లు తగ్గుముఖం పట్టాయి. చదువులోకి లాభాల వ్యవస్థ వచ్చింది. సమాజంలోని అసమానతలన్నీ చదువులోకి వచ్చాయి. దీన్నిప్పుడు సరిచేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై పడింది. ఇది బృహత్తరమైన కార్యక్రమం. పబ్లిక్ స్కూల్స్ ఎక్కడ బాగుంటాయో మానవ సంపద కూడా పటిష్టంగా ఉండి సమర్థులైన వ్యక్తులు పబ్లిక్ రంగంలోకి వస్తారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక, సామాజిక రంగాలను సరి చేసుకున్నట్లుగానే విద్యారంగాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంది. పూర్వపు తెలంగాణ విద్యా వ్యవస్థను పునరుద్ధరించ గలిగితేనే బంగారు తెలంగాణకు రూపురేఖలు ఏర్పడుతాయి. గురుకుల వ్యవస్థ దీనికి ప్రత్యామ్నాయం కాదు. పబ్లిక్ స్కూల్స్‌కు పూర్వపు వైభవం తెస్తేనే ఇక్కడ ప్రతిభ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది. ఇది కష్టతరమైన పని. సింగపూర్ దేశాలు ప్రపంచ పటంలో ప్రాముఖ్యత సంపాదించిన ఈ కాలంలో తెలంగాణ ప్రభుత్వం అటువైపు అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

-చుక్కా రామయ్య