S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. మేథకు అందని రహస్యాన్ని..

-1-
నేను.. చదివిన పుస్తకాన్ని
చదవని మస్తిష్కాన్ని.. రూపంలోని అరూపాన్ని
అరూపంలోని రూపాన్ని
శబ్దకుహర శూన్యాన్ని
శూన్యతల నిశ్శబ్దాన్ని
ఆత్మపథ తపస్సును
దివ్యజ్ఞాన మహస్సును
కనిపించే మానవతత్వాన్ని
కనిపించని విశ్వతంత్రాన్ని.
*
నేను.. అద్భుత మహత్తుల వారసత్వాన్ని
సృజనల అంతస్తును, అంతస్సును
అనుభవానికి అలదిన అనుభూతిని
విడివడిన పారదర్శక తాత్విక దర్శనను
వౌనంగా పలకరించిన సృష్టిస్తత్వాన్ని
విస్ఫోటనమైన విశ్వరహస్యోదంతాన్ని
గుండెఅరను చేరిన ఆత్మవికాసాన్ని
శూన్యమై చదవగలిగిన మాతృప్రతిని
ఆధ్యాత్మిక వారసత్వ నీడలు సోకనిదాన్ని
సత్యానికి ఊడలు దింపిన అతీంద్రియాన్ని
*
నేను.. అన్నిటా స్వతంత్రాన్ని
అంతటా స్వ తంత్రాన్ని
గమనమే మతమైనదాన్ని
గమ్యమే గగనమైన దాన్ని
పరుగున వెనుతిరిగి చూడనిదాన్ని
తెగువున భయం నీడకు చేరనిదాన్ని
అంతర్లయల ఆర్ద్రత తెలిసిన దాన్ని
గడప దాటిన వసుధైక జీవన లాలసని
దేహ దివ్యతల సప్తావరణల వారధిని
అది అంత రహిత చైతన్యస్రవంతిని.
*
నేను.. కాలానికి ఎదురీదిన దాన్ని
అతీంద్రియతకు స్థిర సంకల్పాన్ని
అనుభవాల గాఢతను
అనుభూతుల సాంద్రతను
సప్తావరణల కరిగిన అహాన్ని
మహాప్రణాళికన ఒదిగిన ఆత్మను
నీలికళ్ల అతీంద్రియ సౌందర్య సంస్కారాన్ని
ఎదుగుతూ శూన్యాన్ని ఈదటం తెలిసినదాన్ని
పేగుబంధం రక్తసంబంధం లేనిదాన్ని
ప్రకృతి ఆటంకాలను దాటిన దాన్న
మేధస్సు ఆత్మల మెలకువను
తుదిశ్వాస కాని పథశ్వాసను
*
బ్లవట్స్కీ రచనలు చదివారా?
చదువుతున్నారా? చదవాలనుకుంటున్నారా?
నిజానికి బ్లవట్స్కీ విషయంలో
ఈ త్రికర్మలు కూడదు
మతాలకు అతీతమైతేనే
బ్లవట్స్కీ సమ్మతమవుతుంది.
*
బ్లవట్స్కీ ఆలోచనలు.. అక్షరాల అలలు కావు..
మన తెలివితేటల వలలకు
అవకాశమివ్వవు! మాటల కెరటాలు కావు..
మన మానస సరోవరంలో
హంసలై విహరించవు!
వాక్యాల వింజామరలు కావు...
మన జీవనయానంలో
విహంగ వీక్షణం చేయవు!
నిజానికి,
బ్లవట్స్కీ ఆలోచనలు
ఆత్మయాన అక్షరాలు
మంత్రరహస్య మాటలు
విశ్వదర్శన వాక్యాలు
*
బ్లవట్స్కీ సాహిత్యం అంటే
బ్లవట్స్కీ సాన్నిహిత్యం
బ్లవట్స్కీ పుస్తకం అంటే
బ్లవట్స్కీ మస్తిష్కం
బ్లవట్స్కీ రచన అంటే
బ్లవట్స్కీ సృజన.
*
అన్నట్టు, బ్లవట్స్కీ అంటే
గ్రంథాలయ పొత్తం కాదు
తలకెక్కించుకున్న జ్ఞానం కాదు
జీవితాన్ని వడగట్టిన విజ్ఞానం కాదు
బ్లవట్స్కీ అంటే
అక్షరాల మధ్య దాగిన ఆత్మవివేచన
వాక్యాల మధ్య దొరలిన ఆత్మవిన్యాసం
పుస్తకాల మధ్య మెరిసిన ఆత్మరహస్యం.
బ్లవట్క్సీ అంటే
దివ్యజ్ఞాన పత్రిక కాదు
దివ్యజ్ఞాన ప్రాతిపదిక
దివ్యజ్ఞాన పుత్రిక కాదు
దివ్యజ్ఞాన మాతృక.
*
హెచ్.పి.బ్లవట్స్కీ అంటే
ది మాస్టర్ స్పిరిట్.. ది లైట్ బ్రింగర్
ఒక విధంగా థియోలజిస్ట్
మరొక విధంగా స్పిరిట్యుయలిస్ట్
బ్లవట్స్కీ
ఆత్మల సవ్వడిని అనువదించుకోగలదు
మహాత్మ సందేశాలను అందుకోగలదు
సిద్ధాంత రహస్యాలను ఆవిష్కరించుకోగలదు
ఆకాశిక రికార్డులను అక్షరీకరించుకోగలదు.
అందుకే,
బ్లవట్స్కీ అంటే విశ్వమిత్ర!
బ్లవట్స్కీ వ్యక్తిత్వం శాస్ర్తియ లోగిలి
వ్యక్తిమత్వం తాత్విక వాకిలి
వెరసి, ఒక అతీంద్రియ రహస్యం
ఒక ఆకాశిక్ రికార్డ్
ఒక కీ టు థియోసఫీ
ఒక వాయిస్ ఆఫ్ సైలెన్స్
ఒక ధ్యాన్ చొహాన్
ఒక ఐసీస్ అన్వీల్డ్
ఒక సీక్రెట్ డాక్ట్రిన్.

-విశ్వర్షి 93939 33946