S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ కృష్ణశిల.. నీకెంతటి భాగ్యం?

ఓ కృష్ణశిల.. నీకెంతటి భాగ్యం?
మాలోని తృష్ణను తీర్చడానికే
నువ్వు ఎన్ని ఉలిదెబ్బలు తింటావు?

హృదయ స్థానంలో ప్రాణ వాయువును
దృష్టిస్థాపన సమయాన ఉదానవాయువు
కళాన్యాసం చేసే సమయంలో వ్యానవాయువు
అపాన వాయువు చేరగానే బింబంలో మార్పు
సమానవాయువు ప్రవేశంతో శిల్పానికి తేజస్సు
ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసలు, జ్ఞానం వెల్గుతాయి
నిన్ను (శిలను) శిల్పంగా మార్చడం
అంత సులువు కాదు
వేదమంత్రాల ఉచ్ఛారణ జరగాలి
మంగళవాద్యాలు మ్రోగాలి
పంచబ్రహ్మర్షులను ఆవాహనం చెయ్యాలి
కంకణధారణ బంగారు సూత్రంతో చెయ్యాలి
పంచవింశతి వాస్తుదేవతలుగా
ఆహ్వానించాలి.
నిన్ను చెక్కడం మొదలుపెట్టిన
ఏడు మాసాలకు గాని ఆపానవాయువు
ప్రవేశించడం మొదలుకాదు
పంచవాయువులు ప్రవేశించిన చోట
నవరంధ్రాలకు శిల్పాచార్యులు
రంధ్రాలు చెయ్యాలి
రాగి ఉలితో మధుమంత్రం జపిస్తూ
ఒక కనుబొమ్మను లిఖిస్తూ
రెండవదయిన పక్ష్మరేఖను
వెండి ఉలితో లిఖించాలి
ఆప్యాయస్వ అనే మంత్రంతో
నల్లటి గ్రుడ్డును
శుక్రమసి అనే మంత్రంతో
తెల్లటి గ్రుడ్డును
మధ్యలో జ్యోతిమండలం
దిద్దే ఆ శిల్పాచార్యునికి వందనం
శిలకు ఎంత ఓపిక
శిల్పాచార్యుడు తనను ఒక
దేవతారూపాన్ని
ఇస్తున్నాడని..
అందుకే అన్ని దెబ్బలు తట్టుకుని
భక్తుల కోర్కెలు తీర్చే శిల్పమయ్యావు.

-శ్రీనివాస్ పర్వతాల 9014916532