S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చర్య( సండేగీత)

మనం ఏదో ఊహిస్తాం.
కానీ అలా జరగదు.
ఎక్కువసార్లు ఇదే మాదిరిగా జరుగుతుంది.
మన ప్రయత్నం మానకూడదు.
ఎందరో విమర్శిస్తారు.
మరెందరో మనల్ని చూస్తూ నవ్వుతారు.
మన అంచనాలను తలకిందులు చేస్తూ
మన ప్రయత్నం విఫలం అవుతాయి.
మనం కుంచించుకు పోకూడదు.
ఈ లోకం
మన చర్యలని, ప్రయాసలని కాదు.
ఫలితాన్ని ప్రేమిస్తారు.
గౌరవిస్తారు.
అయినా మన ప్రయాణం కొనసాగాల్సిందే!
సున్నా నుంచి అయినా మొదలు పెట్టాల్సిందే
అనుభవం నుంచి మరో అనుభవం వైపు
ప్రయాణం కొనసాగాల్సిందే..!
మన లక్ష్యం దిశగా.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001