S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకాశం నా ఎజెండా

పొద్దునే్న ఆకాశాన్ని చూస్తానా
మనసులో ఏదో చెప్పలేని అనుభూతి
సాయంత్రం ఆకాశం చూస్తానా
గుండెల నిండా ఆనందం
రాత్రి ఆకాశాన్ని చూస్తానా
మనసంతా వెనె్నల జలపాతం
తీరిక దొరికినప్పుడల్లా
అలా ఆకాశం వైపు చూస్తూనే ఉంటాను
నాలో లేనిదేదో అక్కడుందని
కళ్లప్పగించి చూస్తుంటాను
చూపు చూపునకు అందని ఆకాశం
నాలో కొత్త ఆశలు రేపిన ఆకాశం
కళ్లకు గంతలు కట్టిన ఆకాశం
కంటికి అందనంత దూరాన దాక్కున్న ఆకాశం
మనసుకి దూరంగా విసిరేసిన ఆకాశం
కడలికి చేరువైన ఆకాశం
ఆ ఆకాశం నాకు కావాలి
ఆకాశాన్ని చేతులారా అందుకోవాలని
కళ్లారా మనసులో దాచుకోవాలని
అందితే ఆకాశాన్ని గుండెల్లో పెట్టుకోవాలని
ఆకాశాన్ని నిలువెత్తు మనిషిని చేయాలని
మనసు నిండా ఎన్ని ఆలోచనలు
మిన్ను విరిగి నేల మీద పడ్డా
అంబరాన్ని తాకాలని
మేఘాలతో ఆడుకోవాలని
కురిసే జడివానలో తడవాలని
గుండె నిండా కొండగాలి తాకాలని
మనసున వెండి పూలు పూయించాలని
ఇప్పటికీ ప్రయత్నం మానలేదు
ఆకాశం మీద పాదం మోపాలని
ఆకాశం గొడుగు పట్టాలని
నింగికి నిచ్చెన వేసినా అందని ఆకాశాన్ని
అరచేతిలోకి తీసుకోవాలని
నక్షత్రాల్ని నడిచే దారుల్లో పూయించాలని
నేలకు దిగిన నక్షత్రాల్ని నాతోపాటు నడిపించాలని
ఇప్పటికీ కలలు కంటూనే ఉన్నాను
ఊహలు చుట్టు నేను తిరుగుతున్నానో
నా చుట్టూ ఊహలు తిరుగుతున్నాయో
తెలీదుగానీ
ఇప్పటికీ నేను కలల వెంట నడుస్తున్నాను
చిన్నప్పుడు చందమామ కావాలని
అందదని తెలిసి అందుకోవాలని
ఆశ పడడమే కాదు
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని మీద
కాలు పెట్టాడని తెలిసి
నా మనసుకి రెక్కలొచ్చాయి
ఇప్పుడు చంద్రుడు మనిషి ఇరుగు పొరుగు వాళ్లే
కలుసుకోవాలంటే మనసును విశాలం చేసుకోవాలి
అందుకోవాలంటే మనుషులు
దూరాలు దగ్గర చేసుకోవాలి.

చొక్కర తాతారావు 6301192215