నా ప్రేమ
Published Saturday, 5 October 2019తూరుపు వెలుతురులో
మెరిసే.. లేత హరితం
నా ప్రేమ
తరువు ఒడిలో
రాలిపడే.. పూలసడి
నా ప్రేమ
నింగి కరిగి
నేలను మురిపించే
చినుకుల జడి
నా ప్రేమ
వేణువులో ప్రవహించి
గాలి వినిపించే..
తీయని స్వరం
నా ప్రేమ
విరిసే వెనె్నల
కురిసే మల్లెల రాశి
నా ప్రేమ
తీరాన్ని తడిపే
కడలి అలల పరుగు
నా ప్రేమ
నీ పాదముద్రలను
కళ్లల్లో ఒంపుకుని
నీ కోసమే నిరీక్షించే
సైకత శిల్పం
నా ప్రేమ