S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఊగిసలాట

ఒక్క అడుగే కదాని నీరసించి
నిష్క్రమించకు
అడుగు వెనుక అడుగుతో
ఖగోళమంతా
కౌగిలించుకోవచ్చు.

ఒక్క నీటి చుక్కే కదా అని
చులకనగా చూడకు
ఆ వర్షపు బిందువులే అఖండ
సింధువవును ఆవిష్కరిస్తాయి

వెలగించాలనుకునే దీపం
ఒక్కటే అని వెనకడుగు
వేయకు
అది లక్షల చీకటి జీవితాల్లో వెలుగు
నింపే జీవనజ్యోతి

నా ఒక్క చెయ్యే చేయూత
నేమిస్తుందని అనుకోకు
నీ చేయి వెంట వేల చేతులు
చైతన్య దివిటీలై వెలుగులు
నింపుతాయి.

సమాజం పట్ల...
నాకేం పట్టిందని నిస్పృహతో
నిర్లక్ష్యం వహిస్తే
పుచ్చిన సమాజం నిన్ను
నిలువునా దహించివేస్తుంది.
జాగ్రత్త!!

-కొప్పోలు యాదయ్య