S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరంతరం( సండేగీత)

ఈ పద బంధం చాలా బాగుంది. పద బంధం కాకపోవచ్చు. పదమే కావొచ్చు.
అదే నిరంతరం.
మన వృత్తిలో నైపుణ్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించకూడదు.
మన లక్ష్యం వైపు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
వైఫల్యాలు ఎదురవుతున్నా
అపజయాలు ఎదురొస్తున్నా
నిరంతరం మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి.
క్రింద పడిన బంతి పైకి ఎగురుతుంది. ఎంత శక్తితో క్రింద పడితే అంత శక్తితో పైకి లేస్తుంది.
మన ప్రయత్నాలు అలాగే ఉండాలి.
అవి నిరంతరం కొనసాగుతూ ఉండాలి.
మన మనస్సు ఆపేయమని చెబుతున్నా
మన మిత్రులు నిరుత్సాహపరుస్తున్నా
మన ప్రయత్నం నిరంతరం కొనసాగాలి.
ఇష్టంగా- ఎంతో ప్రేమతో
మన ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001