S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాలుతున్న మొగ్గలు

పుట్టక ముందే వాళ్ల
భవిష్యత్తుని కార్పొరేట్ చదువు కార్ఖానాల్లో
బందీ వొడంబడిక రాసాక
రేపటి భవిష్యత్తుకి
బాలాన్నీ యవ్వనాన్నీ ధారపోసి
అంకెల్లో
ఆకాశాన్ని చూసి సంతోషపడే సందర్భాల్లో
వాళ్ల దిగులు ఏ కన్న గుండెకు వినపడదు
మార్కులే జీవితాన్ని శాసించాలన్న మూర్ఖంలో పడి
అసలు జీవిక ఉనికిని
మాయం చేసిన
తప్పు ఎవరిది?
సంసాదనకై అత్యాశకి పోయే స్కూల్స్
అమెరికానో లండన్‌కో
కొడుకు/ కూతురు
పంపిద్దామన్న దుగ్ధలో
వాళ్ల ఇష్టం కాలిపోయింది
కష్టమైన కోర్సు చదువలేక
అయిష్టంగా రుద్దబడినవి
మెదళ్లలోకి ఎక్కించలేక
పుస్తకాలకి
ద్వేషానికీ మధ్య చిత్రవధ
అనుభవించిన వాళ్ల
సంఘర్షణకి సమాధానమేది?
విద్యావ్యవస్థ లోపం
రేపటి తరానికి శాపమై
వెంటాడుతుంది
అయినా వాళ్లకి
ఇప్పుడు నిలువెత్తు ధైర్యం కావాలి
వోటమి ఎదురైన ప్రతీసారి
రాలిపోయే మొగ్గలా కాక
మోడుపై చిగురించే వసంతంగా మారాలి...
అప్పటివరకు రాలే మొగ్గలని చూసి వగచాల్సిందే!
*

-పుష్యమీసాగర్ 9010350317