S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మా మామ నీవు...

నీపై పడిన వేడి వేడి సూర్యకిరణాలను
చల్లని వెనె్నల కిరణాలుగా మార్చి
మా భూమిపై ప్రసరింపజేస్తావు!
ఆ వెనె్నల కిరణాలనే ప్రేమికులపై వెచ్చగానూ
విరహపీడితుపై మంటలుగానూ కురిపిస్తావు!
చీకట్లలో లోకానికి వెలుగులు పంచుతూ
పేదల, నిరుపేదల రాత్రి దీపంగా రాణిస్తూంటావు!
ఆధునిక విజ్ఞానశాస్త్రం
నీవు మా భూగ్రహం చుట్టూ తిరిగే
ఉపగ్రహం మాత్రమేననీ నీ గుట్టు రట్టుచేసింది!
మేము ‘చంద్రయాన్ రెండు’ పేరుతో
నీ దగ్గరకు యాత్రను చేపట్టి ఫొటోలు తీస్తూ
ఇంకా నీ రహస్యాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూన్నాం!
అయినా ఇప్పటికీ
మాకు నెలరాజువు, వెనె్నలరాజువు,
శీతాంశుడవు, శిశిరధరువుడ, మృగాంకుడవు,
ఓషధీశుడవు, తారాపతివి, నిశాపతివి,
కళానిధివి, వేలుపుల బువ్వవు
అమృతకరుడవు నీవే!
మాసంలో పక్షం రోజులు పెరుగుతూ
మరో పక్షం రోజులు తరుగుతూ కూడా
సుందరహర్మ్యాలపైనా, పూరిగుడిసెలపైనా
జనావాసాల్లోనూ, అరణ్యాల్లోనూ,
ఎడారుల్లోనూ సమానంగానే నీ వెనె్నలలను
ఆధునిక విజ్ఞానశాస్త్రం- నీవు
పాలకడలి పుత్రుడవు, లక్ష్మీదేవి సోదరుడవు,
మాకు మేనమామవు కాదని తేల్చి తెగేసి చెప్పినా
ఆధునిక పండితులే కొందరు..
ఒకప్పుడు మాభూగోళం నుండీ
విడిపోయిన పెద్దముక్కవు నీవనీ..
అందువలననే నీవు విడివడిపోయిన
ఆ స్థలంలోనే ఇప్పటి అతిలోతైన
ఫసిఫిక్ మహాసముద్రం ఏర్పడి వుండొచ్చనే
అభిప్రాయాన్ని వ్యక్తం చేసినవారు!
ఆ మార్గంలో ఆలోచిస్తే.. ఓ చంద్రుడా!
నీవు మాకు మళ్ళీ దగ్గర చుట్టానివే!
పురాణాల్లో చెప్పినట్లుగా..
నీవు మాకు మామమే.. చందమామవే నీవు!!

-రఘువర్మ 92900 93933