S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బుద్ధిః కర్మానుసారిణి

ఎప్పుడు చూసినా అలజడి
ఏమిటో తెలియదు జనం నాడి
ఎందుకో వాళ్లకంత వేడి
ఏమన్నా అంటే అర్థంలేని దాడి
తడిలో ఏముందంటూ మడిని
బోడి బొమ్మ దేవుడేమిటంటూ గుడిని
పంతులా గింతులా అంటూ బడిని
గేలిచేస్తూ గోలచేస్తూ గందరగోళం
తల్లి, తండ్రి, గురువు, దైవంకన్నా
పదవి, పెదవి, పైకం, మైకమే మిన్న
అన్న ధ్యాసలో కాలరెత్తుకొని
అనుక్షణం కాలక్షేపం
ఉన్నతాశయాలు కలగాలంటే
ఉన్నత వ్యక్తుల జీవితాల్ని చదవాలి
ఏం చదువుతారు? ఏం తెలుసుకుంటారు?
ఏ పుస్తకాన్ని చూసినా పస్తులున్న ముఖాలవుతాయి
టీవీలన్నా సినిమాలన్నా, పాప్ గీతాలన్నా
గాజులోళ్లమంటూ గెంతులేస్తారు

- ములుగు కుమారస్వామి (షణ్ముఖశ్రీ) 88978 53339