S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఊపిరి

ఇన్నాళ్లూ
సన్నగా సనసన్నగా
మెత్తగా నాలో ప్రవహించే
నాడులే నాకు జవసత్వాలనిచ్చి
నా ఊపిరి వాటి ఊపిరి కలగలసి
ప్రకృతిలో హేమం
పిండుకుంటూ
మురుస్తూ మురిపిస్తూ
మెరుస్తూ కురిసే మేఘంతో
సరసాలాడుతూ
నాలో నాటుకుపోయిన నాడులన్నీ
మొక్కలై చెట్లై మహావృక్షాలై
రమణీయత పర్యావరణ సమతుల్యత
వన్యమృగ సంరక్షణ నాతో నాలో నాపై
నాలో తరాలుగా దాగిన దాచబడిన
నిక్షేపాల కబళించే వేటలో
ఎవడెవ్వడో ఎటునుంచో జొరబడుతుంటే
నా నీడన సేదతీరుతూ
నన్ను నన్నుగా బతకనిచ్చిన
నా అణువణువూ గూగుల్‌కే
అందనంత దొరకబుచ్చిన
నా బిడ్డలని తరిమేత
భావికి నా అవసరం
వర్తమానంలో నా చిదిమేత
చరిత్ర నెరుగని పెట్టుబడి
దోపిడే ఎరిగే రాజకీయం
దొరికినంత దండుకునే నేత
నాగరిక సమాజ వొరవడి
దూరంగా ఉన్న నాపై ముప్పేట దాడి
అనవసరమనుకుంటూ
నేనేంటో
నేనెంత మధనపడుతున్నానో
తరాలుగా సంపాదించుకున్న
సంపదంతా
రూపాయి ముందు మోకరిల్లింప జేస్తున్న కుట్ర
నా జనం మొదల్లో
మొలుస్తున్న ప్రశ్నలు
విల్లంబులై వేటగాళ్ల
గుండెలు చీల్చేదాకా
నేను నిద్రపోను
నిద్రపోనివ్వను
నల్లమల్ల నా నామధేయం

-గిరిప్రసాద్ చెలమల్లు.. 9493388201