S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాయాల వేణువులు

‘‘సోమరి చీకటిని బద్దలుచేసిన
వేకువ కరాలు!..
వేళ్ళ కొసల్ని బాకులు చేసి
ఆకలికి ఆశల్ని జతకూర్చి అందమైన ‘మేదరి’ బుట్టలల్లుతాయి!

శ్రమని చువ్వలుగా చీలుస్తూ
బతుకు పొద్దును
చిక్కని తాటాకు చాపగా విస్తరిస్తాయి!

స్వేదాన్ని వర్ణంగా పూస్తూ
ఆరిన పేగుల్ని కళాఖండాలుగా
దండేలకు వేలాడేస్తాయి!

జీవన వెదురును వంచుతూ
బడుగు భవితను గంపల గుంపునకు
ముడేస్తాయి!
చూపుల చేటల్ని పేర్చుతూ
గుప్పెడు మెతుకులు చెరగాలని
ఆరాటపడతాయి!

అతుకుల ఉపాధిని
గతుకు ధరల రహదారిపొడవునా నేస్తూ ఖాళీ కడుపులు తట్టలు ఆరేసుకుంటాయి!

అమ్మకాలన్నీ ప్లాసిటక్ వాసనకొడుతూ..
వృత్తికి అల్లిన జీవతాడును తెంచుతున్నా..
నైపుణ్యంలోని జీవపు తడిని స్పృశించే
‘చేయూతకోసం’
ఆ నమ్మకపు చేతులు శ్రమిస్తూనే ఉన్నాయి!

చితికిన బతుకుల వేదికపై ఖాయిలాపడ్డ
కళాదేహ కొనఊపిరిని
గాయాల వెదురు వేణువులో
నింపుతూనేన్నాయి!’’

-డి.నాగజ్యోతి