S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్నేహగీతం

ఒక శీతాకాలపు ఉదయాన
మంచు తెరలు తెరలుగా కురుస్తున్నప్పుడు
అంత చలిలోనూ గుండె చేతపట్టుకుని
నీ కోసం వచ్చాడంటే వాడు తప్పకుండా స్నేహితుడే
ఒక దుఃఖం రెండు కన్నీటి చుక్కలు
ఒక గమ్యం రెండు దారులు
మనిషి జీవితం ఎడారిలో ఒయాసిస్సే
లోకం నిన్ను ఒంటరిని చేసినప్పుడు
ఆ శూన్యంలోంచి నిన్ను మనిషిని చేసింది స్నేహమే
ఒంటరితనంలోంచి సమూహంలోకి
అడుగుపెట్టినప్పుడు
నిన్ను నీడలా వెంటాడేది స్నేహమే
ఒక ఆనందం కొన్ని జ్ఞాపకాలు
ఒక శూన్యం రెండు కరచాలనాలు
రాత్రి వచ్చిన వానలా స్నేహం మనల్ని వీడిపోదు
సమూహంలోంచి ఒంటరైన మనిషి
ఇప్పుడిప్పుడే స్నేహం వైపు అడుగులు వేస్తున్నాడు
ఒక అనుభవం కొన్ని ఆలింగనాలుల
ఒక దృశ్యం కొన్ని ఊహాచిత్రాలు
మనిషిలో మరో మనిషి ఇక్కడే కనిపిస్తాడు
మనసులోకి మనిషి ప్రవహించడం చూశాం గానీ
మనిషిలోకి మనిషి ప్రవహించడం ఇప్పుడే చూస్తున్నాం
జీవితపు కాగితం మీద కొత్తగా స్నేహగీతం రాస్తున్నాను
మనిషికి మనిషికి మధ్య నిలువెత్తు సంతకం స్నేహం
ఎవరూ లేని చోట ఏమీ కాని చోట
నిన్ను నువ్వు వెతుక్కోవటమే స్నేహం.

-చొక్కర తాతారావు 63011 92215