S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సత్తువ పాఠం

పుట్టినాక ఎవరైనా
ఎప్పుడైనా పోవాల్సిందే
కాకపోతే ఒకరు ముందు
మరొకరు వెనుక

ఏదోనాడు పోతాంలే అని
గుండెను బండ చేసుకుంటే ఎలా?
హృదయాన్ని నదిలా పారించినప్పుడే
జవసత్వాలు నిలబడేది
మరో నలుగురికి ఊపిర్లూదగలిగేది!

ఏదోలా కాలం వెళ్లబుచ్చడానికి
తుప్పలం రప్పలం కాదు కదా
సరైనోళ్ల చేతిలో పడితే
తుప్ప సహితం మండి
నాలుగు మెతుకులు ఉడికిస్తుంది
రప్ప సైతం ఒద్దికై
నడిచే దారికి దన్ను అవుతుంది
ఎప్పుడో చావు తలుపు తడుతుందని
గుండె రెక్కలు బిగించుకుంటే ఎలా?
పోతూ కాసిన్ని మంచి మాటల గింజలు చల్లితేనే
పిల్లగాలిని పోసుకునేది
రేపటి తరం వాక్యాల
వానలో మురిసేది!

అంతా ముగిసిపోనుందని
అనాలోచితంగా
ఆయాసపడిపోతే ఎలా?
కాలం తీరంలో గట్టి అడుగులు
పడితేనే
మస్తిక పొరల్లో మట్టి పరిమళం
జాడలయ్యేది
భావితరాలకు సత్తువ పాఠాలందేది!

-పెంకి విజయకుమార్695533 92949