S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. జీవనదిని..

నేను.. సాక్షిని
ఆదికి అంతానికి
మూర్తానికి మూలకానికి
అమూర్తానికి అమర్త్యానికి
దేవకణానికి దైవికానికి
పదార్థానికి పరమార్థానికి.
*
కళ్లు మూసుకున్న చీకటి
కనురెప్పల మాటున
ద్యానమగ్నమవుతోంది
కదలని కనుపాప
కరగుతున్న రేపటికి వర్తమాన
దృశ్యమవుతోంది
తాపసిక ధ్యాస
నిన్నటిని నేటిమట్టం చేసి
అసదృశమవుతోంది
-2-
నేను.. జీవగోళ సాక్షిని
నాలుగు దిక్కుల నీలాంబరిని
నింగీ నేలల నీలిమను
చూడ రాయిరప్పల గోళాన్ని
జీవజవంతో ఏకాకిని.
*
కేంద్రాన వాయు ఇంధనాన్ని
ధూళి దూసరిత పదార్థాన్ని
రాలిపడ్డ ఖగోళ శకలాన్ని
ప్రజ్వరిల్లిన అగ్ని కణాన్ని
పైకి చల్లబడ్డ భూక్షేత్రాన్ని
లోన ఎర్రటి శిలాద్రవాన్ని.
-3-
నేను.. కాల సాక్షిని
ఉత్తర దక్షిణాయనల యానాన్ని
చలికాలానికి చిన్ననాటి చెలికాడిని
మండుటెండకు ఆర్నెల్ల సహచరిని
మట్టివాసనతో చిగురించిన పచ్చనాకుని
నీటి తుంపరతో రెప్పవేయని
పుష్పనేత్రాన్ని.
*
సంయమనం కలిగిన భౌగోళికతత్వాన్ని
ఐనా, అష్ట దిక్కుల నేను
సౌరకుటుంబ అష్టగ్రహ భాగస్వామిని
ఎనిమిది నిమిషాల కాంతిదూరంతో
సూర్యుడితో సంవదిస్తూ
శక్తిని పుంజుకుంటున్న జీవవైవిధ్యాన్ని.
-4-
నేను.. రాతిగ్రహాన్ని
అంగారక బుధ శుక్రుల సహోదరత్వాన్ని
చంద్ర శని గురు ప్రభావిత
జీవన గమనాన్ని
ఉల్కలు, ధూమకేతువుల స్నేహితాన్ని
మేఘాల రాళ్ల క్షాత్రానికి
తలవొగ్గవలసిన క్షేత్రాన్ని.
*
నేను.. అయస్కాంత గర్భను
గురుత్వాకర్షణ వేదికను
నా చుట్టూ నేను తిరుగుతూ
సూర్యుని చుట్టూ తిరుగుతున్న వ్యవస్థను
భౌతిక నెలవుకు అగుపించని రక్షణను
-5-
నేను.. ప్రవహించిన అగ్నిపర్వత శ్రేణిని
పాలపుంత కాంతిసంయోగాన్ని
అవనిన నెలకొన్న ఋతుసోయగాన్ని
ఆవిరిన ఆవిర్భవించిన వాతావరణాన్ని
మేఘవలయ వర్షిత వర్ణ ధర్మాన్ని
చుట్టుముట్టిన సాంద్ర సముద్రాన్ని
*
నేను.. సతత హిమలాస్యాన్ని
శోభ తరగని శీతలారణ్యాన్ని
నీటిబిందువు ముద్దిడని ఎడదని
నడిమివేళ సలసలకాగే ఎడారి ఇసుకను
చుక్కలు చూసిన రేతిరిన
వణికే రాతిసీమను
-6-
నేను..
అభయారణ్యాన్ని
జనారణ్య అభిమతాన్ని
జీవజాల అభినవహితాన్ని
పచ్చికబయళ్ల నిత్య తోరణాన్ని
వెలుతురు తెరల ధృవ ఆరోరాని
అస్తమించని నడిరేతిరి సూరీడ్ని.
*
నేను.. అంతశ్శక్తిని
అగ్నిపర్వతంలా విస్ఫోటనాన్ని
భూకంపంలా మృత్యుద్వారాన్ని
కడలి కెరటాలలా సునామీని
పాయగా పుట్టిన జీవనదిని

-విశ్వర్షి 93939 33946