S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాణసంచా కాల్చడం ఈనాటిది కాదు!

ఇప్పుడు దేశంలో దీపావళి సీజన్ నడుస్తోంది. ఎప్పుడు దీపావళి వచ్చినా మన దేశంలో మేధావితనం వొలకబోసేవాళ్లు సామాజిక బాధ్యత అంతా తామే నెత్తికెత్తుకున్నట్లు ఉపదేశాలిస్తారు. దీపావళికి బాణసంచా కాల్చడం వల్ల ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం కలుగుతుందనీ, టపాసుల పేలుళ్లకు పశుపక్ష్యాదులు భయపడిపోతాయని ఎక్కడ లేని ప్రేమా వొలకబోస్తూ హిందువులపై ఏడ్చిపోతారు వీళ్లంతా. హిందువుల పండుగలు వస్తున్నాయంటే చాలు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టడం మన దేశంలోని కుహనా మేధావులకి ఒక అలవాటై పోయింది. అసలు హిందూ పండుగల వల్లే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందన్నట్లు ఉంటుంది వీరి గోల. ఒక్క దీపావళికే కాదు.. హోలీ, వినాయక చవితి, దసరా ఏ పండుగ వచ్చినా సరే ప్రతి ఏటా తమకు ఇష్టమొచ్చిన రీతిలో హిందువుల మనోభావాలను కుళ్లబొడుస్తూ మాటల తూటాలు వదులుతారు.
హిందువులు ప్రకృతిని తల్లిగా ఆరాధిస్తారు. తరతరాలుగా వస్తున్న హిందువుల పండుగలు, ఆచారాలన్నీ ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి. హిందూ సంస్కృతీ సంప్రదాయాలలో ప్రకృతి పట్ల గల ఆరాధన, అంతరార్థాన్ని తెలుసుకోకుండానే అసలు తమ పండుగలంటేనే హిందువులు సిగ్గుతో కుంచించుకు పోయేలా కుహనా మేధావులు తమ మాటల ఈటెలతో కుళ్ళబొడుస్తారు. ఈ మేధావులు నిరంతరం చేసే దుష్ప్రచారం వల్ల ఇప్పటికే యువతరం హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు దూరంగా ఉంటోంది. వేల సంవత్సరాలుగా వస్తున్న సుసంపన్నమైన మన సాంస్కృతిక విలువలను గురించి ఆలోచించడానికి కూడా సిగ్గుపడుతోంది నేటి యువతరం. మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసి, మన దేశాన్ని ముక్కలు చెయ్యాలన్న శక్తుల పన్నాగం కాదా ఇది?
హిందువులలోని ఐక్యత భారతదేశంలో క్రైస్తవ మత మార్పిడులకు పెద్ద అవరోధంగా మారిందని ‘స్పిరిట్యువల్ కాంఫ్లిక్ట్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్’ అన్న వ్యాసంలో వి.ఎజేకియా ఫ్రాన్సిస్ అంటాడు. ఈయన ఒక క్రైస్తవ మిషనరీ. ‘మేము భారతీయులం అన్న భావనయే భారతీయులందరినీ కలిపి ఉంచుతోంది.
వివిధతలోని ఏకతయే భారతదేశము యొక్క గొప్ప విశేషంగా చెప్పబడుతోంది. దురదృష్టవశాత్తూ ఈ ఐకమత్యమే భారత్‌లో క్రైస్తవ మత వ్యాప్తిని నిరోధిస్తోంది’ అని ఫ్రాన్సిస్ అంటాడు. ఫ్రాన్సిస్ మాటలనిబట్టి ఏం తెలుస్తోంది? తరతరాలుగా ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలే హిందువులని కలిపి ఉంచుతున్నాయి. అవే ఈ దేశంతో వారిలో అనుబంధాన్ని కలిపి ఉంచుతున్నాయి. తమ పండుగలు, సంప్రదాయాల పట్ల హిందువులలో గల శ్రద్ధ్భాక్తులను దెబ్బ కొట్టినట్లయితే ఈ దేశంలో అనాదిగా వస్తూన్న వివిధతలోని ఏకత్వానికి దెబ్బ కొట్టినట్లవుతుంది. అప్పుడు ఈ దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి ఎలాంటి అవరోధాలూ ఉండవు.
ఇటీవలి సంవత్సరాలలో సుప్రీంకోర్టు, ముంబై, హర్యానా, పంజాబ్ హైకోర్టులు దీపావళి బాణసంచా కాల్చరాదని ఆదేశాలు ఇస్తూ వచ్చాయి. బాణసంచా కాల్చడం వల్ల వాతావరణం కలుషితమవుతుందని కోర్టులు పేర్కొనడమే పెద్ద తప్పు. 2017లో కాన్పూర్ ఐఐటి వారు జరిపిన అధ్యయనం దీపావళి జరుపుకోవడమే పెద్ద అపరాధమన్నట్లుగా పేర్కొంది. ఇక టీవీ ఛానెళ్లలో దీపావళినాడు బాణసంచా కాల్చడంపై చిర్రుబుర్రులాడే సెలబ్రిటీల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ప్రతి ఏటా దీపావళికి బాణసంచా కాల్చకుండా హిందువులను నిరోధించడానికి మన దేశంలోని సోకాల్డ్ అభ్యుదయ వాదులు హడావిడి చేస్తుంటారు.
బాణసంచా కాల్చడం భారత్‌లో ఎప్పుడు మొదలయ్యింది?
చైనా దేశస్థులు తుపాకి మందు కనిపెట్టడానికి చాలా పూర్వమే భారత్‌లో దానిని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. చాణక్కుని ‘అర్థశాస్త్రం’లోను, శుక్రాచార్యుని ‘శుక్రనీతి’లోన దీని గురించిన ప్రస్తావనలున్నాయి.
‘అరబ్బులు తుపాకి మందు తయారుచెయ్యడం ఎలాగో భారత్ నుంచి నేర్చుకున్నారు. అంతకు ముందు నాఫ్తా అనే ద్రవరూప రసాయనం పోసిన బాణాలను ఉపయోగించేవారు. పర్షియన్లు కూడా తుపాకి మందు తయారుచెయ్యడం భారత్ నుంచే నేర్చుకున్నారు. అంతకుముందు వారు ఆయుధ ప్రయోగంలో పెద్ద మొత్తంలో సూరేకారం వాడేవారు’ అని జోసెఫ్ చంద్ర రే అంటారు. (ఫైర్ ఆర్మ్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, జోగేష్ చంద్ర రే, ఐ.హెచ్.క్యు 8వ సంపుటం, పుటలు 586-88)
పొలిటికల్ మాగ్జిమ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ హిందూస్ పుస్తకంలో గుస్తవ్ ఒప్పెర్ట్ (1836-1908) ఇలా అంటాడు, ‘తుపాకి మందును, అది ఉపయోగించు ఆయుధాలను తయారుచెయ్యడంలో ఆద్యులు భారతీయులే. భారతీయులకు సూరేకారం గురించీ, దాని వాడకం గురించీ తెలుసనీ, సైనిక వేడుకలలోనే కాకుండా ఇతర సమయాలలో కూడా భారతదేశంలో బాణసంచా కాల్చేవారనీ క్రీ.శ.7వ శతాబ్దం నాటి చైనా సాహిత్యం పేర్కొంటోంది’ (హిందూ కల్చర్ అండ్ ది మాడరన్ ఏజ్, దేవన్ బహదూర్, కే.ఎస్. రామస్వామి శాస్ర్తీ, అన్నామలై యూనివర్సిటీ, 1956. పు.127)
బాణసంచా తయారీలో ప్రధానమైనది తుపాకి మందు. ఇది సూరేకారం, గంధకం, బొగ్గుల మిశ్రమం, గంధకం, బొగ్గు మందుగుండు ఎక్కువసేపు కాలడానికి దోహదం చేస్తే, సూరేకారం మిరుమిట్లు గొలిపే ఎర్రటి కాంతులు విరజిమ్మడానికి కారకమవుతుంది. ఈ కారణంగానే సైనికపరమైన వేడుకలలోనే కాకుండా పండుగలలో కూడా బాణసంచా కాలుస్తారు మన దేశంలో.
భారత్‌లో బాణసంచా ఎందుకు కాల్చేవారు?
రావణ వధానంతరం వనవాసాన్ని ముగించుకుని శ్రీసీతారాములు అయోధ్యలో అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి జరపుకోవడం తరతరాలుగా భారతీయులకు ఒక వేడుక.
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాలలో వారి ప్రధానమైన ఆహారం. శీతాకాలం మొదలయ్యేటప్పుడు దీపావళి పండుగ వస్తుంది. ఈ కాలంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాలు ఇంకా ఎక్కువైతే ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.
పంట దిగుబడిని తగ్గించే, ప్రజారోగ్యానికి చేటుచేసే కీటకాలను నివారించడానికి మన పూర్వీకులు గంధకాన్ని వాడేవారు. ఆధునిక పరిశోధకులు కూడా కీటకాల సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారమని అంటున్నారు. బాణసంచా తయారీలో ప్రధానంగా గంధకం ఉపయోగిస్తారు. దీపావళి నాడు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపిస్తుంది. ఇది కీటకాల వృద్ధిని నివారిస్తుంది. కీటకాల నివారణకి ఇది తక్కువ శ్రమ, ఖర్చుతో కూడుకున్న పద్ధతి కూడా. అందుకే దీపావళి నాడు భారతదేశమంతటా బాణసంచా కాల్చడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
తరతరాల సంప్రదాయ వేడుక
బాణసంచా కాల్చడం భారతీయ సంస్కృతిలోనే కాదు కాబట్టి ఇప్పుడు కొత్తగా బాణసంచా అవసరమేముందన్నది కొందరు మేధావుల వాదన. కానీ మన దేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళి నాడు బాణసంచా కాల్చడం తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయ వేడుక. కొన్ని ఉదాహరణలు -
1.‘తుర్బీ’ పోటీలు
పశ్చిమ బెంగాల్‌లో మకర్దా గ్రామంలో నివసించే పుర్బన్నపర వర్గానికి చెందిన ప్రజలు ‘తుర్బీ’ పోటీలు నిర్వహిస్తారు. తుర్బీ అంటే చిచ్చుబుడ్డి. చుట్టుపక్కల 24 పరగణాలకు చెందిన ప్రజలు ఈ పోటీలలో పాల్గొంటారు. ఎవరి ‘తుర్బీ’ ఎక్కువ కాంతులు వెదజల్లుతూ బాగా పైకి ఎగజిమ్ముతుందో వారు గెలిచినట్లు. దీపావళి సందర్భంగా పశ్చిమబెంగాల్, ఒడిషాలలో కాళీమాతని ఆరాధిస్తారు. ఆ సందర్భంలో తుర్బీలతోపాటు, వివిధ రకాల బాణసంచా కాలుస్తారు. కుటుంబంలోని పెద్దలు తుర్బీలు ఎలా చెయ్యాలో తమ పిల్లలకి నేర్పిస్తారు. ఇది తరతరాలుగా ఇక్కడ వస్తోంది.
తుర్బీల తయారీకి గంధకం, సూరేకారం, బొగ్గుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఇనుపరజను కూడా కలుపుతారు. బాగా కాల్చిన గోళాకారం కుండల్లో ఈ మిశ్రమాన్ని దట్టిస్తారు. ఈ కుండకి పైన ఉన్న చిన్న రంధ్రం వద్ద దీనిని వెలిగిస్తారు. పోటీలలో పాల్గొనే ప్రతి జట్టుకూ తుర్బీలను తయారుచేయడంలో వారి మెళకువలు ఉంటాయి.
2.బాణసంచాతో యుద్ధం
‘సవర్’ ‘కుండ్ల’ అనే గ్రామాలు కలిసి జంట నగరంగా ఏర్పడిన ‘సవర్కుండ్ల’ గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఉంది. ఈ రెండు గ్రామాల ప్రజలు దీపావళినాడు అక్కడ ప్రవహిస్తున్న నదీ తీరంలో చేరి ఒకరిపై ఒకరు మండుతున్న బాణసంచా విసురుకుంటారు. ఈ వేడుక ఇరు వర్గాల మధ్య ఒక యుద్ధంలాగే సాగుతుంది. ఈనాటికీ ఈ గ్రామాలలో ఎవ్వరూ బజారుకెళ్లి బాణసంచా కొనరు. ప్రతి ఒక్కరూ వారి ఇండ్లలోనే బాణసంచా తయారుచేసుకుని వస్తారు. ఇలా ఇళ్లలోనే తయారుచేసిన బాణసంచాని ‘ఇంగోరియా’ ‘కొక్డీ’ అని పిలుస్తారు. ఇవి చిచ్చుబుడ్లలా ఉంటాయి. వీటిని వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకుంటారు.
‘ఇంగోరియా’ అడవులలో దొరికే ఒక పండు. దీని పెంకు గట్టిగా ఉంటుంది. దీనికి పైన చిన్న రంధ్రం పెట్టి, లోపలి భాగాన్ని తొలిచేసి, ఎండబెట్టిన తరువాత దాంట్లో మందుగుండు బాగా దట్టిస్తారు. ‘కొక్డీ’లని చుట్టుపక్కల అడవులలో దొరికే వెదురును ఉపయోగించి చేస్తారు.
3.్భజ్ పట్టణంలో...
మన దేశంలో దీపావళి హడావిడి ధనత్రయోదశితో (ఆశ్వీయుజ బహుళ త్రయోదశి) మొదలవుతుంది. ఆ రోజు తెల్లవారుజామున గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో హామీర్సర్ సరస్సు వద్ద గల హఠకేశ్వర్ మందిరంలో జరిగే హారతి కార్యక్రమంతో దీపావళి వేడుకలు మొదలవుతాయి. సంత్ నరసీ మెహతా వారసులుగా చెప్పబడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఈ హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. హారతి కార్యక్రమం పూర్తి కాగానే ‘మహాదేవ్ నక’ ప్రాంతంలో అందరూ చేరి బాణసంచా కాలుస్తారు.
‘ఈ సంప్రదాయం చాలా పాతది. దీనిని ముందు ‘నాగరి’ వర్గం వారు మొదలుపెట్టారు. ఇప్పుడు అన్ని వర్గాల వారూ ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. హామీర్సర్ వద్ద బాణసంచా కాల్చడం ఇప్పుడు అందరికీ ఒక సంప్రదాయ వేడుక అయిపోయింది. ఉదయం ఐదు గంటలకే పెద్ద సంఖ్యలో వృద్ధులు, యువకులు, పిల్లలు హామీర్సర్ వద్ద చేరుతారు. ఈ మూడు రోజులూ అంటే ధన త్రయోదశి, కాళీ చౌదస్ (చతుర్దశి), దీపావళి, వారంతా బాణసంచా కాలుస్తారు’ అని అతుల్ మెహతా అంటారు. ఈయన వాద్‌నగర్ వ్యవస్థాపక మండల్ అధ్యక్షుడు.
దీపావళితో ముడిపడి ఉన్న సంప్రదాయార్థము, ఆ రోజు బాణసంచా కాల్చడానికి గల ప్రాధాన్యత చాలామందికి తెలియదు. అలా తెలియకుండా బాణసంచా కాల్చడం వల్ల ప్రకృతికి హాని కలుగుతుందని విమర్శించడం సరికాదు.

-ప్రొ.దుగ్గిరాల రాజకిశోర్ 8008264690