చిన్న విజయం( సండేగీత)
Published Saturday, 2 November 2019ఓ చిన్న విజయం సాధించినా సంతోషపడాల్సిందే! ఎవరన్నా అభినందిస్తే స్వీకరించాల్సిందే!
కొంతమంది ఏదో చిన్న విజయం.. దీనికి అభినందనలూ ఎందుకూ అని అనుకుంటూ వుంటారు. కానీ అది సరైంది కాదు. ప్రతి అభినందనని సంతోషంగా స్వీకరించాలి.
ఏదీ పోగొట్టుకోకూడదు.
ప్రతిదీ దాచుకోవాలి.
వర్షం పడితే ప్రతి చుక్కని దాచుకోవాలి అంటారు. జీవితంలోనూ కూడా అంతే!
మంచి వాక్యాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. మంచి సందర్భాలని తరచూ గుర్తుకు తెచ్చుకోవాలి.
వాటిని మన హృదయంలో కాపాడుకోవాలి.
మన మనస్సులో దాచుకోవాలి.
అవి ఎప్పుడూ మన హృదయంలో ఆడుతూ ఉండాలి.
చిన్న విజయమైనా విజయమే.
చిన్న అభినందన అయినా అభినందనే.
వాటిని దాచుకోవాలి.
తరచూ గుర్తుకు తెచ్చుకోవాలి.
అవి ఎప్పుడూ మన వెంటే ఉండాలి.