S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనుషులు వాలిన

అవును
కలవడమే రావాలి
సాటి మనుషుల్ని ఏ క్షణంలోనైనా
తియ్యగా తలవడమే తెలియాలి..!
*
ఏం పట్టుకుపోతామనీ కుట్రలు
ఒకడిని ఏడిపించీ
సాధించిన ప్రగతి కూడా ఏడుపుగొట్టుదే!
శిఖరంపై కూర్చుంటాం సరే
మాటలతో మాట కలపడానికీ
ఓ హృదయం మన పక్కన లేనపుడు
ఎత్తులో ఎక్కడున్నట్టూ..?!
ఎత్తులో వుండటమంటే..
మనుషుల మనస్సుల్లో చోటు సంపాదించడమే..!
*
మన ఖాతాలో
పైసలుండటం లేదు
మన జీవిత ప్రయాణం ఖాతాలో
తలచుకునే మనుషులుండాలి..
ఆదరణ గుణముంది కనుకే
చెట్టు మీదకి అన్ని పిట్టలు చేరుతుంటాయి
మనలోనైనా మమత తడి వుంటే
మనమూ మనుషులు వాలిన చెట్లవుతామూ..!
*
అవును
అవతలి వారికి
వెలుతురివ్వగలిగితేనే సూర్యుడు
మనమైనా
అవతలి వారి చేయిని పట్టి
చిక్కుల చీకటిని దాటించినపుడే మనుషులం!
*
ఇద్దరి మధ్యలో
వంచన కత్తులు వేలాడకూడదు
అసమానతకు ఆశ్రయమివ్వకూడదు
ఇద్దరి మధ్యలో
ఆత్మీయతా జిగురు తయారుకావాలి!
భౌతిక దూరం లెక్క గాదు
మనసుల దగ్గరితనమే కొలమానం..!
*
నేనైతే..
ఊపిరిచిలుకకి చెప్పుకున్నాను..
తోటి మనిషిని కష్టపెట్టినపుడు
గుండె కొమ్మ మీద నుంచి శాశ్వతంగా ఎగిరిపొమ్మనీ..!
*

-మెట్టా నాగేశ్వరరావు