S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖగోళ శక్తే యోగ శక్తి

మాస్టరిజమ్
Primitive people have disappeared
But primitive wisdom survives
And is attainable by those
Who "will', "dare' and can "keep silent'.
-H.P.Blavatsky
మాస్టర్ యోగం అన్న వెంటనే అందరిలో స్ఫురించేది ‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’. భౌతిక అమరత్వ సాధనే మాస్టర్ యోగ లక్ష్యం.
‘ఇమ్మోర్టాలిటీ’ అన్న వెంటనే గుర్తొచ్చేది ‘్ఫనిక్స్’ అనే ఒక అరేబియన్ పక్షి. ఈ పక్షి అయిదు వందల సంవత్సరాల నుండి కొన్ని వేల సంవత్సరాల వరకు బ్రతికే ఉంటుంది. అయిదు వందల సంవత్సరాల పైబడ్డ తర్వాత ఈ పక్షి తనకు తానుగా అగ్నికి ఆహుతి అయి, అదే బూడిద నుండి ఒక క్రిమిగా పుట్టుకొచ్చి, అందమైన పక్షిగా మళ్లీ మరో అయిదు వందల సంవత్సరాలో అంతకంటే ఎక్కువ కాలమో జీవిస్తూ మళ్లీ అలాగే అగ్నికి ఆహుతి అయి మరుక్షణమే మరుజన్మకు అదే రూపంలో వస్తుంటుంది. మనకు తెలిసిన సృష్టిలో ఇలా ఫిజికల్ ఇమ్మోర్టారిటీ సాధ్యమైంది. ఫీనిక్స్ పక్షికి, మానవ పరంగా ఈ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యం కావాలన్నది మాస్టర్ సి.వి.వి. ‘్భృక్తరహిత తారక రాజయోగ’ సాధనా లక్ష్యం.
ఇలా భౌతిక అమరత్వ సాధనా పరిణామంలో మనపై ఖగోళ ప్రభావాలు, ఖగోళంపై మన ప్రభావాల ఆదాన ప్రాదాన ప్రభావాల నుండి వైదొలగి యోగ సాధనతో భౌతికంగా అమరత్వం సాధించటం ఎలాగో చూద్దాం.
Evolution begins from the rays of involution.
But involution begins from itself owning power.

నేఫథ్యం
మన తెలివితేటలతో ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమాన్ని తెలుసుకోగలం.. ఈ పరిణామ క్రమానికి ఆధారం అంతర్ణామ క్రమం అంటే ఇన్‌వల్యూష్. దీనే్న వ్యావర్తనం అనీ, అంతర్పరిణామం అనీ అంటుంటాం. ఎవల్యూషన్‌ని పరిణామం అంటున్నాం కాబట్టి ఇన్‌వల్యూషన్‌ని అంతర్ణామం అని అందాం. ఈ అంతర్ణామం స్వశక్తి కేంద్రం. పరిణామ క్రమానికి ఆధారాలు కంటికి కనిపిస్తుంటాయి. అంతర్ణామ క్రమానికి ఆధారాలన్నీ అదృశ్యాలే.. బహిర్ముఖీనమైతే పరిణామ రహస్యాలు వెల్లడి అవుతుంటాయి.. అంతర్ముఖీనమైతే తప్ప అంతర్ణామ రహస్యాలు అందవు. దీనికి ఆధారం మన అంతరంగం మాత్రమే.
From the evolution, the involution begins to ray.
The involution is the evolution of the original oath.

అంటే ఫరిణామ క్రమం నుండే అంతర్ణామ క్రమం వెలుగులు చిమ్మేది. ఈ రెండింటికీ మూలం మనకందని ఒక రహస్యం ఒప్పందం.
పరిణామ ప్రక్రియకు ఈ విశ్వం వేదిక అవుతుంటే అంతర్ణామ ప్రక్రియకు మనమే మూలం. మానవ ఆచ్ఛాదనతో ఉన్న మన పరిణామం అంతా అంతర్గత ప్రక్రియా ఫలితమే.. అంతర్ణామ ప్రక్రియ ప్రారంభమైంది మన పుట్టుకతో. మన జన్మ రహస్యం, మానవ వికసన రహస్యం ఖగోళ ప్రభావమే.
అటు ఎవల్యూషన్‌ను ఇటు ఇన్‌వల్యూషన్‌ను అర్థం చేసుకుంటూ ఈ జన్మలోనే మన పరిణామం సంపూర్ణం కావాలి. అంటే మరోజన్మకు అవకాశమివ్వని ఆత్మసాధన సాగాలి. మానవ మనుగడ అంటే మన అస్తిత్వం దేహం, ఆత్మ, జీవం, ప్రాణం - అవినాభావ సంబంధంగా సాగుతోంది. కాబట్టి, మనం పరిపూర్ణం కావటానికి ఎనిమిది విధాల సాధన కొనసాగిస్తూ స్వయంప్రకాశం కావాలి.
యోగసాధన
మనం సాధనను ఫిజికల్ ట్రైనింగ్‌తో ప్రారంభించి యాస్ట్రల్ ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్, బుద్ధిక్ ట్రైనింగ్‌లను సంతృప్తిగా పూర్తి చేస్తాం.. ఈ నాలుగు దశలను దాటిన తర్వాత ఆత్మ రంగప్రవేశం చేయటంతో అనేక కట్టడులు ఏర్పడతాయి. అంటే బియాండ్ బాడీ అండ్ మైండ్ ‘సోల్ జర్నీ’ ప్రారంభమవుతుంది. నిర్వాణిక్ ట్రైనింగ్, పరనిర్వాణిక్ ట్రైనింగ్, మహాపర నిర్వాణిక్ ట్రైనింగ్‌లతో ఆత్మ అధిభౌతికంగాను హయ్యర్ ప్లేన్స్‌ను చేరుకోవాలి. ఇక్కడ చెప్పుకుంటున్న ట్రైనింగ్ అంటే శిక్షణ అని కాదు. యోగసాధన. ఈ ఏడు దశలను దాటిన ఎనిమిదివ దశ ఇంతకు ముందు మనం చెప్పుకున్న మానవ జన్మకు ఆధారభూతమైన రహస్య ఒప్పందం. భృక్తంగా ఉన్నది రహితం కావటానికి మాస్టర్ సి.వి.వి. తారక రాజ యోగ సాధనకు పూనుకున్నారు. అదే ‘మాస్టర్ యోగం’గా ప్రఖ్యాతమవుతున్న ‘్భృక్తరహిత తారక రాజయోగం’.
‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’ అంటే భౌతికంగా అమరత్వం సాధ్యం కావాలన్నది మాస్టర్ సి.వి.వి. యోగ సాధనా లక్ష్యం. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యం కాకపోవటానికి సృష్టిలోని లోపాలే కారణమని మాస్టర్ సి.వి.వి. గ్రహించారు. అందుకే దేహాంతర లోపాలను సవరించటానికి కొన్ని కోర్సులను సాధన చేయించారు. గ్రహాల, నక్షత్రాల ప్రభావాల నుండి మానవ జీవన క్రమం సంపూర్ణం కావటానికి ప్లానెటరీ రెగ్యులేషన్స్, నక్షత్రాల రెగ్యులేషన్స్ సాధన చేయించారు.
మనం మాస్టర్ యోగా ‘వర్కింగ్’ గురించి తెలుసుకోవటానికి పూర్వం మన దేహ నిర్మాణం గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో గ్రహాల, నక్షత్రాల ప్రభావాల గురించి తెలుసుకోవటమూ అంతే ముఖ్యం. ఎవల్యూషనరీ థియరీస్ ద్వారా మనకు ఖగోళ పరిజ్ఞానం అందుతూనే ఉంది. జ్యోతిష శాస్త్రం ద్వారా మానవ జీవితంపై నక్షత్ర, గ్రహ ప్రభావాలు ఎలా ఉంటున్నాయన్నది తెలుస్తోంది. ధ్యాన, యోగ సాధన ద్వారా ఈ ప్రభావాల నుండి ఎలా బయటపడగలమన్నది తెలుసుకోవాలి. ఖగోళ శాస్త్రం చూపే ఆధారాలు నమ్మశక్యంగా ఉంటాయి. ఆ బాటలోనే జ్యోతిష శాస్తమ్రూ సాగుతూ మనకు కనువిప్పు కలుగజేస్తుంటుంది. అదే ధ్యానం, యోగం విషయంలో మనకు మనమే ఆధారం. సాధనకు ఉపక్రమించిన స్థితిలో మనం ఒకరిని ఒకరం విశ్వసించగలిగితే అదే మన సంపూర్ణ పరిణామానికి ఆధారం.
"Original cosmos kinds of weather calculation
Guidance spread up spiritual bright balance rings.'

అని ‘బుధ రెగ్యులేషన్స్’ సాధనలో ఒకచోట వస్తుంది. ఇంతకీ ఈ కాస్మిక్ వెదర్స్, కాస్మిక్ ఎనర్జీస్ అంటే ఏమిటో చూద్దాం.

-విశ్వర్షి 93939 33946