కవులకు నమోస్తుతి
Published Saturday, 2 November 2019వేయాలి కవి మెడలో
వాస్తవ స్పందనలతో
సువాసనల పూలదండ
అతి పొగడ్తలతో
తగిలించకూడదు
కవికి గుదిబండ
కప్పిన నిరాడంబరపు
శాలువలే కవికి మెరుపుల
శోభాయమాన గండభేరుండ
సంయమన కవిత్వమే
కవికితేనెల నిండుకుండ
కవిని కొనియాడదగు
బంగారుకొండ
కుప్పలు తెప్పలుగ
రాసిన రాశీ కవిత్వం
కవి సాహిత్యానికి
ఓ విమర్శనాస్త్రాల సవతి
ఆత్మస్తుతియన్నది
కవికి అతిశయోక్తి
నియమిత వాసి కవిత్వమే
కవికి అందాలాభరణ విఖ్యాతి
అలాంటి కవులందరికి
నమోస్తుతి నా నమోస్తుతి