S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వడ్డీయే ముద్దు (కథ)

రమణయ్య తనకున్న ఆస్తిపాస్తులను అమ్ముకొని కొత్తగా వడ్డీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇరువర్గాల మధ్య నమ్మకమే పత్రమంటూ పత్రాలు రాయించుకోకుండా చాలామందికి అప్పులిచ్చేశాడు.
కొన్ని నెలలపాటు వడ్డీలు క్రమం తప్పకుండా వసూలు చేసుకోగలిగాడు కానీ తరువాత మాత్రం ఎటువంటి పత్రాలు గానీ సాక్ష్యాలు గానీ లేకపోవడండో వడ్డీలు వసూలు చేసుకోవడం చాలా కష్టమై పోయింది రమణయ్యకు.
తన దగ్గర అప్పులు తీసుకొన్న వాళ్లు ఎప్పుడు వడ్డీలు ఎగనామం పెట్టడం ప్రారంభించారో రమణయ్య వెంటనే గ్రహించేశాడు. తన దగ్గర తీసుకున్న అసలుకు ఎసరొచ్చిందని. అయినా తన డబ్బును ఎగ్గొడ్తున్నందుకు ఏమీ భయపడలేదు అతడు. గోల చేసి అడిగితే పూర్తిగా నష్టపోవలసి వస్తుందని అనుకున్నాడు. తన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ల నుండి అణాపైసలతో డబ్బులు రాబట్టుకోవడానికి ఒక పథకం వేశాడు.
‘ఇచ్చట అప్పులు తీసుకున్న వాళ్లు అసలు చెల్లించనక్కర్లేదు.. వడ్డీలు మాత్రం చెల్లిస్తే సరి!’ అంటూ ఇంటి ముందు బోర్డు వ్రాయించి పెట్టుకొన్నాడు రమణయ్య.
ఊళ్లో వాళ్లందరూ రమణయ్య వ్రాయించిన బోర్డును చదివి ‘ఈ రమణయ్య వెర్రిబాగులవాడిలా ఉన్నాడు. క్రమం తప్పకుండా వడ్డీ కడ్తే సరేనట. మరి అసలు చెల్లించనక్కర్లేదట. భలే విచిత్రంగా ఉందంటూ’ నవ్వుకొంటూ వెళ్లిపోయారు.
కానీ కొంతమంది మాత్రం రమణయ్య ఇంటికి రావడం ప్రారంభించారు. వాళ్లెవరో కాదు గతంలో పత్రాలు లేకుండా అతని దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లే! వాళ్లను చూసి రమణయ్య తన పాచిక పారబోతున్నందుకు మనసులో ఎంతో సంబరపడ్డాడు.
గతంలో తన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లు ‘రమణయ్యా! జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈసారి నీవు బోర్డులో వ్రాయించినట్టుగా వడ్డీలని క్రమం తప్పకుండా చెల్లిస్తాం. నీ దగ్గర అసలు తీసుకున్నట్టుగా పత్రాలు కూడా రాసి ఇస్తాం’ అని వాళ్లు పత్రాలు రాయబోతుంటే రమణయ్య వాళ్లకు వడ్డీలు క్రమం తప్పకుండా చెల్లిస్తామంటూ మాత్రమే వ్రాయండి. అసలు మర్చిపొండి’ అని అన్నాడు.
రమణయ్య నిజాయితీ మాటలు వాళ్లకు ఎంతో సంతృప్తి నిచ్చాయి కానీ వాళ్లు తాము క్రమం తప్పకుండా కట్టే వడ్డీలతో తమ దగ్గర మొత్తం డబ్బును వడ్డీల రూపంలో వసూలు చేసి కుబేరుడై పోతాడని ఊహించలేక పోయారు.

-బెలగాం కేశవరావు 9989368430