S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన దగ్గర.. (సండేగీత )

ఇతరుల గురించి మన అంచనాలు ఎక్కువగా వుంటాయి.
అవి స్నేహితుల గురించి కావొచ్చు.
బంధువుల గురించి కావొచ్చు.
ఇంట్లో వాళ్ల దగ్గర నుంచి కావొచ్చు.
ప్రభుత్వం నుంచి కావొచ్చు.
నాయకుల దగ్గర నుంచి కావొచ్చు.
ఇలా మన అంచనాలు ఎక్కువగా వుంటాయి. అందరి దగ్గర నుంచి మనం ఎక్కువగా ఆశిస్తాం. ఆ విధంగా లేకపోవడం వల్ల నిరాశ చెందుతాం.
ఎదుటి వ్యక్తుల మీద మన నియంత్రణ వుండదు. అయినా వారి దగ్గర నుంచి మనం ఎక్కువ ఆశిస్తాం.
మన నియంత్రణ వున్నది మన మీద.
కానీ మనం మన గురించి ఏమీ ఆశించం.
మనం ఏమీ చేయకుండా మనం చాలా విషయాలను ఆశిస్తాం.
మన దగ్గర నుంచి మనం ఎక్కువ ఆశించాలి.
ఇతరులు మన గురించి ఆశిస్తున్న దానికన్నా ఎక్కువగా మన పనులు వుండాలి.
ఎందుకంటే మన మీద మన నియంత్రణ వుంటుంది. మనం అనుకుంటే ఎక్కువ పనులని చేయగలం.
చిన్నచిన్న పనులే పెద్దవవుతాయి.
ఇతరుల దగ్గర నుంచి ఆశించి భంగపడటం కంటే మన దగ్గర మనం ఆశించి పొందడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001