దేహపు బొట్టు
Published Saturday, 9 November 2019స్వేదపు బొట్టు చెమ్మటి వాసన
పరిమళమవుతూ
ఇష్టాయిష్టంగా ఉబికి జారుతూ ఆవిరవుతూ
జీవితం చిన్నదని చెప్పకనే చెప్పి
ఇమిడిపోయింది
రక్తపు బొట్టు గాయమై నొప్పించి
కమ్ముతూ బాధించి
రుధిరమే జీవమని జారుతూ
అందరం సమానమని
అందరిలో ప్రవహించేది ఒక్కటేనని చెప్పి ఆవిరయ్యింది.
కన్నీటి బొట్టు మనసుకు పడిన
మాటల గాయానికి
భావోద్వేగాలతో ఆనంద కన్నీటి
బాష్పాలుగా మెరిసి
ఒకింత సాంత్వననిస్తూ గౌరవప్రదంగా
జారిపోయింది
వాన నీటిబొట్టు నిలువెత్తు మట్టి దేహాన్ని
శుద్ధిచేసి
పిడికెడు మనసులోని కల్మషం తొలచి
నిర్మలత్వం చేసి
స్వచ్ఛంగా మలచి పవిత్రంగా బ్రతకమని సూచించింది
స్పేదపు బొట్టును మాపే వాన
నీటిబొట్టు గోప్యం
రక్తపు బొట్టుకంటే గొప్పదైన
కన్నీటి బొట్టు సాక్ష్యం
వెన్నంటే ఉంటాయి జీవిత
విలువలకు నిదర్శనం.