రిమైండర్
Published Saturday, 16 November 2019మనకు చాలా విషయాలు తెలుసు.
కానీ వాటిని మరిచిపోతూ ఉంటాం.
నేను క్రింద చెప్పే విషయాలు అలాంటివే.
కానీ మనం మరిచిపోయాం. అవి ఇలా వుంటాయి.
ఒక తప్పు చేస్తే మళ్లీ మళ్లీ చేయాలని లేదు.
ఒకసారి నష్టం వస్తే మళ్లీ మళ్లీ నష్టపోవాలని లేదు
ఒకసారి అపజయం లభిస్తే మళ్లీ
అపజయం లభించాలని లేదు
ఇవి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన రిమైండర్ షెడ్యూలులో ఇవీ రాసుకోవాలి.
రోజూ ఒకసారి చదువుకోవాలి దాన్ని.
మన మీద మనకి విశ్వాసం పెరుగుతుంది.
జీవితంలో పురోగతి ఉంటుంది.
మన వైఫల్యాల పట్ల మనం జాగ్రత్తగా ఉండే అవకాశం ఏర్పడుతుంది.
ఒకసారి నష్టపోతే
అన్నిసార్లూ నష్టపోవాల్సిన పరిస్థితి వుండదు.