S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాచీన ఉక్కు తయారీ కేంద్రం.. రణంకోట

భారతీయ ప్రాచీన లోహ పరిశ్రమకు కలికి తురాయిగా నిలిచిన తెలంగాణ ఇనుము ఉక్కు కుటీర పరిశ్రమపై ఒకవైపు ప్రపంచ శాస్తజ్ఞ్రుల దృష్టి కేంద్రీకృతం కాగా, ఈప్రాంత ప్రజలకు దాని విలువ తెలియక, ప్రాచీనత్వ ప్రాధాన్యత అర్థంకాని స్థితిలో సంబంధిత అపురూప ఆనవాళ్ళు కనుమరుగవుతున్నాయి. 2500 సంవత్సరాల క్రితం ఉక్కు - ఇనుము తయారీ కేంద్రంగా భాసిల్లిన అవిభక్త ధర్మపురి మండలం ప్రస్తుతం నూతన బుగ్గారం మండల కేంద్ర సమీపస్థ రణంకోట గుట్ట ఇటీవలి కాలంలో మొరం కొరకు తవ్వకాలకు గురవుతున్నది. మధ్య భారతంలో కర్నాటక, సేలం తదితర ప్రదేశాలలో క్రీస్తు పూర్వం నుండే ఇనుము - ఉక్కు తయారుకాగా, కోనసీమ ఉక్కుగా, అయస్కాంత తత్వం కలిగిన పదును తరగని, వనె్న చెరగని ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రత్యేక ఉక్కు - ఇనుము ప్రపంచంలోని అన్ని వృత్తుల వారికి అవసరమైన పనిముట్ల తయారీకి వినియోగించబడి, క్రీ.పూ.300 సంవత్సరాలనుండి క్రీ.శ.1850 వరకు ప్రపంచ వాణిజ్య విపణికి సరఫరా చేయబడినాయి. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానంతరం దేశీయ ఉక్కు పరిశ్రమ సంక్షోభంలో పడి, యాంత్రిక స్టీలు వినియోగం పెరిగి, స్థానీయ తయారీ వాడకం క్రమేపీ తగ్గుముఖం పట్టి, కొంతకాలానికి కనుమరుగైంది. తెలంగాణ ప్రజల కుటీర పరిశ్రమలో ఉక్కు, ఇనుము తయారీ ప్రధాన పాత్ర పోషించగా, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇనుము - ఉక్కు పేరున ఇందూరు, ఇందుర్తి, ఇందారం, ఇనుగుర్తి, ఇనుగురాల, కొలిమికుంట, కమ్మరిపెల్లి, చిట్టాపూర్, చిట్యాల, చెక్కల, ముద్దపల్లి తదితర గ్రామాలు వ్యవహరించ బడుతున్నాయి. తెలంగాణాలో 90 ఇనుము ఉత్పత్తి మరియు 15 ఉక్కు ఉత్పత్తి కేంద్రాలు అలనాడు ఉండేవని డచ్ లోహశాస్త్ర పరిశోధకురాలు థెల్మాలో తన పరిశోధనా గ్రంథంలో పేర్కొనడం జరగగా, ఇనుము తెలంగాణ లోని 400పైగా గ్రామాలలో మరియు ఉక్కు అధిక కేంద్రాలలో తయారైనట్లు ఆధారాలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, ఇబ్రహీం పట్నం, కల్లెడ ఉక్కు ఉత్పత్తి కేంద్రాలు అలాగే మల్లాపూర్, ఇబ్రహీం పట్నం, వర్షకొండ, కిషన్ రావుపేటలు ఆదిగా దాదాపు 400 పైచిలుకు ఇనుము ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ధర్మపురి మండలంలోని గత నియోజకవర్గ కేంద్రమైన, ప్రస్తుత మండల కేంద్రమైన బుగ్గారం సమీపస్థ రణంకోట గుట్ట అన్నింటిలోకి అత్యంత ప్రాచీన తయారీ కేంద్రంగా పేరెన్నిక గన్నదని పరిశోధనల వల్ల తేలింది. ఈ ప్రాంతాలలో తయారైన ఇనుము - ఉక్కు ఇందూరు (నిజామాబాద్) నుండి విదేశ విపణులకు ఎగుమతి చేయబడినట్లు విదేశీ వాణిజ్య ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. చారిత్రక పరిశోధకులు చెపుతున్నట్టుగా ‘‘ఇందూరు’’ ‘‘ఇంద్ర పురం’’గా కాక, ‘‘ఇనుమూరు’’గా పేర్కొనవచ్చునని ప్రాచీన లోహ శాస్త్ర పరిశోధకుల భావన. ఇంతటి ప్రాధాన్యత, ప్రాచీనత్వం కలిగిన ఈ ప్రాంత ఇనుము - ఉక్కు తయారీపై దేశ, విదేశీ ప్రాచీన లోహ శాస్త్ర పరిశోధకులు విశేష ఆసక్తిని కనబరుస్తున్నారు. డచ్‌కు చెందిన థెల్మాలో, లండన్‌కు చెందిన జేమ్స్ ఆలెన్, జోన్ జూలిఫ్, జేక్ కేన్, బెంగుళూరుకు చెందిన శారదా శ్రీనివాస్, బెంగళూరు ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైనె్సస్‌కు చెందిన ప్రొఫెసర్ రంగనాథన్, కాన్పూర్ ఐఐటి లోహశాస్త్ర శాఖాధిపతిగా దివంగతులైన ప్రొఫెసర్ బాల సుబ్రమణ్యంలు చేసిన విశేష పరిశోధనలు ప్రాధాన్యతను సంతరించు కుంటున్నాయి. ఉక్కుతో తయారైన ప్రాచీన వస్తువులు ప్రపంచంలోని ఏమ్యూజియంలోనూ ఉంచుటకు నోచుకోని స్థితిలో, ధర్మపురి ఓరియంటల్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు చారిత్రక పరిశోధకులు డాక్టర్ ఎస్.జైకిషన్ పలు అపురూప, విలువైన, ప్రాచీనత్వానికి సాక్ష్యాలైన వస్తువులను శ్రమకోర్చి సేకరించి, కాన్పూర్ ఐఐటి లోహ పరిశోధన శాఖలో ఉంచారు. పలువురు విదేశీ లోహ శాస్త్ర పరిశోధకులు ధర్మపురికి విచ్చేసి, తద్వారా బుగ్గారం వెళ్ళి, ఇక్కడి వేల ఏళ్ళకు పూర్వం మన దేశంలో తయారు చేసిన ఇనుము - ఉక్కు తయారీ పద్దతిని స్వయంగా పరిశీలించి, జైకిషన్ చేసిన అపురూప పరిశోధనను అభినందించడం జరిగింది. రణంకోట గుట్టపై ప్రదేశంలో సహస్రాబ్దుల కాలంనాటి సరాలు, బట్టీలు, చిట్టెం (ఇనుము తయారీలో మిగిలిన వ్యర్థ పదార్థం)ల శిథిల, అవశేషాలను డాక్టర్ జైకిషన్ 2005లో కనుగొని, వాటిపై పరిశోధనలను కొనసాగించారు. వాస్తవానికి క్రీ.పూ 300నుండి క్రీ.శ.150 ఏళ్ళ క్రితం వరకు అప్రతిహతంగా శస్త్ర చికిత్సకు అవసరమైన పరికరాల తయారీకై ఇక్కడ తయారైన ఉక్కు - ఇనుము పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు సరఫరా చేయబడిందని సదరు స్థలాన్ని పరిశోధనార్థం సందర్శింని, నమూనాలను సేకరించిన పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవానికి మనదేశంలో టిఎల్ (్ధర్మో లుమినిసెంట్ ) ల్యాబొరేటరీ టెస్ట్ సౌకర్యం లేదని, దానితో ఈకేంద్ర ఖచ్చిత ప్రాచీనత్వం స్పష్టమయ్యేదన్నారు. ఇంత వరకూ భారతదేశంలో ఉక్కు - ఇనుము ప్రాచీనతలపై పరిశోధనలు, ముఖ్యంగా ప్రాచీనత్వ పరీక్షలు జరపక పోవడం గమన్హామన్నారు. ప్రాచీనత్వానికి నిదర్శనమైన ఈగుట్ట ప్రాంతంనుండి రోడ్ల నిర్మాణాలకై గట్టిగా ఉండగలదనే నెపంతో మొరం బదులుగా ఈచిట్టెపురాయిని తీసి, వాడుతుండడం తీవ్ర ఆవేదన కలిగించిన అంశమన్నారు. ప్రపంచ ప్రాచీన లోహ పరిశ్రమకు ఆధారభూతమైన ఈస్థలాన్ని కనుమరుగు చేస్తే చరిత్ర క్షమించదన్నారు. ప్రాచీన చారిత్రిక సాక్ష్యంగా రణంకోట ప్రాంతాన్ని పరిరక్షించే తక్షణ చర్యలు గైకొనాల్సిన అవసరాన్ని పలువురు విదేశీ చారిత్రిక పరిశోధకులు నొక్కి చెప్పారు.

-సంగనభట్ల రామకిష్టయ్య