S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ ప్రేమా.. నీ పరిచయం

సెలయేటి ఒడ్డున కూర్చొని
పాదాలను నీటిలోకి వదిలి
చేప పిల్లలతో చెలిమి చేస్తూ
ఏటిలోని గులక రాళ్లను ఏరుకుంటూ
ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టుకుంటూ
పక్షుల కూతలకు ప్రతి కూతలిస్తూ
లేగదూడలతో పరుగులిడుతూ
దోర దోర జామ కాయలు దొంగిలిస్తూ
దొరికిన నెమలీకలను దాచుకుంటూ
పువ్వు పువ్వు కడకు సీతాకోక చిలుకల్లే
ఎగురుకుంటూ వెళ్లి కోసుకుంటూ
కొమ్మల్లో కోయిలమ్మలా పాడుకుంటూ
వెనె్నల్లో ఆడపిల్లలా ఆడుకుంటూ
స్వప్నాలకు సప్తవర్ణాలు అద్దుతూ
చిరునవ్వే చేమంతిలా చిందులేస్తూ
ఎంతటి ఆనందమైన జీవితం నాది
నీవు కనిపించనంత వరకు
ఒక్క క్షణం నిన్ను చూసిన నేరానికి
నా జీవితంలో మిగిలిన
క్షణాలన్నింటినీ దోచుకుని
ననే్న నాకు కొత్తగా
పరిచయం చేశావే ఓ ప్రేమ!
*

-సురేంద్ర రొడ్డ 94915 23570