S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శతాబ్దం గడుస్తున్నా.. సజీవమే..

‘నాకు ఒక్క నిముషం విశ్రాంతి నివ్వక మహా ప్రణయమారుత వేగం పైనో అగాథవియోగ భారం కిందనో చీల్చి, నలిపి, ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్ర్తి లోకానికి నివేదితము’ ఇది చలంగారు ‘స్ర్తి’కి రాసిన అంకిత వాక్యం. దీనిలో చలం వ్యక్తిత్వం, శైలి, నైతిక తృష్ణ, ఆదర్శం, ప్రతిభ గోచరిస్తాయని.. ప్రతి వాక్యంలోనూ.. ఇంకా చెప్పాలంటే ప్రతి అక్షరంలోనూ స్వేచ్ఛను రంగరించుకుని ఉండేదే చలం సాహిత్యం. అలాంటి స్వేచ్ఛను నిలబెట్టేది నిజాయితీ.. నిజాయితీ వెనుక ఉండేది నిబద్ధత.. నిబద్ధతకి కొలమానం ఆచరణ.. ఈ లక్షణాలన్నింటినీ పుష్కలంగా.. తన ఆలోచనలతో నింపి.. సమాజ పురోభివృద్ధికి.. ఆరోగ్యకర మానవ సంబంధాలతో.. ప్రత్యేకించి స్ర్తి, పురుష సంబంధాల గురించి మొదటగా చెప్పడమే కాకుండా నిష్టూరంగానే అయినా స్పష్టంగా చెప్పారు చలం. అలాగే పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలో తల్లిదండ్రులకు సూటిగా చెప్పారు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకంలో.. దాదాపు 95 సంవత్సరాల క్రితం రాసిన ఈ పుస్తకం.. నేటి తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆదర్శణీయం. దీనిని పుస్తకం అనడం కూడా తప్పేమో.. ఈ పుస్తకంలో 23 అంశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు, శరీరం, ఏడుపు, అలవాట్లు, శిక్ష, ఆట, పెద్దవాళ్ళు, సేవా- ఆర్డరా, భయం, నీతి, వ్యక్తిత్వం, స్వార్థం, అబద్ధం, సానుభూతి, విద్య, సృష్టిజ్ఞానం, పసిపిల్ల, ఆఖరిమాట, దొంగలున్నారు జాగ్రత్త, పెళ్ళి ముస్తాబు, పుట్టిన పండుగ, వినాయక చవితి, డబ్బు.. ఇవీ అంశాలు. ఇందులో ఒక్కో అంశంలో పిల్లలకు పాలు పట్టడం దగ్గరి నుంచి వారిని పెంచి పెద్దచేసేవరకు ఏం చేయాలో చాలా చక్కగా వివరించారు చలం. వీటన్నింటితో పాటు చలం తల్లిదండ్రులకు ఎలాంటి నిబంధనలను వివరించారో చూద్దాం..
* పిల్లలకు ఆయాల్ని పెట్టకూడదు. పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎవరినీ నియమించకూడదు. నౌకర్లు ఉన్నా పిల్లల పని అంతా తల్లి పైన చూస్తూ ఉండాలి.
* పిల్లలకు పెట్టే ఆహారంపై ఈగలు వాలకుండా, దుమ్ము పడకుండా ఉండాలి. ఆహారంపై ఒకవేళ ఏదైనా వాలితే దాన్ని వెంటనే పడేయాలి.
* పిల్లలకు పెట్టే ఆహారం బజారులో, షాపుల్లో కొనకూడదు. స్వయంగా తల్లే తయారుచేసి పిల్లలకు పెట్టాలి.
* రాత్రి వండిన ఆహారం ఉదయానే్న పిల్లలకు పెట్టకూడదు.
* పిల్లలకు పళ్లను తినిపించేటప్పుడు వాటిని బాగా కడగాలి.
* పిల్లలకు తాపే మంచినీళ్లను మరగ కాచి, చల్లార్చి మూతపెట్టి ఉంచాలి.
* బిడ్డకు వీలైనన్ని ఎక్కువ నీళ్లను పట్టాలి.
* పిల్లలకు గాలి బాగా తగిలే ప్రదేశంలోనే పడుకోబెట్టాలి.
* పిల్లలను పడుకోబెట్టే పక్క బట్టలు వారానికి ఒకసారైనా ఎండలో వెయ్యాలి.
* పిల్లలను తాకే ముందు చేతులను బాగా కడుక్కోవాలి.
* పిల్లలకు మందులు తల్లి తప్ప వేరెవ్వరూ వేయకూడదు.
* మురికిపట్టిన ఆటవస్తువులు, బొచ్చు ఉన్న వస్తువులు పిల్లలకు ఇవ్వకూడదు.
* పిల్లలకు ఆహారమిచ్చిన గంటలోపు స్నానం చేయించకూడదు.
* చలికాలంలో పిల్లలకు ఉన్ని బట్టలను తప్పకుండా తొడగాలి. పిల్లలను ఈకాలంలో ఎప్పుడూ వెచ్చగా ఉంచాలి.
* పిల్లల్ని ఎప్పుడూ ఎత్తుకోకూడదు. కొంతమంది పిల్లల్ని ఎత్తుకోవడానికి నౌకర్లను పెడతారు. ఇది చాలా తప్పు. పిల్లలు స్వేచ్ఛగా ఆడి దొర్లడానికి, పాకడానికి కింద చాప వేసి వదలాలి. బిడ్డకి తెలీకుండా వారిపై ఓ కనే్నసి ఉంచాలి.
* పిల్లలకు ప్రతిరోజూ ఓ గంట ఎండ తగలాలి. ఎండంటే గట్టి ఎండ కాదు.. నీరెండ..
* పిల్లలు వీలైనంత వరకు ఆరుబయట, వరండాల్లో గడపాలి.
* పిల్లలకు నగలు పెట్టకూడదు. వీరి ఒంటికి వేటినీ కట్టకూడదు.
* బిడ్డలను బడాయిలుగా నలుగురిలో చూపకూడదు.
* చివాట్లు, కోపం, దెబ్బలు వంటివేమీ పనికిరావు. వారిని అవరకూడదు.
* పిల్లలను అది చెయ్యి, ఇది చెయ్యి.. అది తిను, ఇది తిను.. అని బలవంతం చేయకూడదు.
* పిల్లలను ఎప్పుడూ సంతోషంగా, దయగా, ప్రేమగా ఉండాలి.
* పిల్లలను వెక్కిరించడం, ఖండించడం, వారిపై నిరసన, అసహ్యం కూడదు. పిల్లలను ఏవిధంగానూ అవమానించకూడదు.
* పిల్లలను ఎప్పుడూ బుజ్జగిస్తూ గొప్పచెయ్యనూ కూడదు.
* బిడ్డ పాలుగానీ, భోజనంగానీ నిరాకరిస్తే ఎన్నడూ బలవంతం చేయకూడదు. అలాగని వారికి తిండి పెట్టకూడదు అని కాదు.. వారికి చిన్నగా మాటలు చెబుతూనో, కథలు చెబుతూనో తినేలా చేయాలి.
* డాక్టరు చెప్పని ఏ మందులూ పిల్లలకు ఇవ్వకూడదు.
* పిల్లల ఒంటిపై ఎలాంటి పిన్నులూ ఉపయోగించకూడదు.
ఇలా పిల్లల శిక్షణకు కొత్త అర్థాలను చెప్పారు చలం. బిడ్డని బిడ్డ స్వభావానికి వదలడం చాలా వివేకవమైన శిక్షణ. ఇతరులు వాళ్ళ జోలికి వచ్చి వంకర్లు తిప్పకుండా వీలైనంతవరకు చూడటమే తల్లిదండ్రులు అందించే గొప్ప రక్షణ అంటారు చలం.