పండుగ నేర్పిన పాఠం
Published Tuesday, 26 November 2019దీపం వెలిగించి దిగులు మరిచే
నిరుపేదల గుమ్మం చూడని
ఇనే్నసి దివ్వెల వెలుగులు
నాకెందుకని కన్నులు అమావాస్య
మసకలు మూకుమ్మడిగా కమ్మేసాయి
పట్టెడు అన్నం మింగని వాయిలు
వేల సంఖ్యలో వీధులపై ఉంటే
పరమాన్నపు అరిటాకులు నాకెందుకని
నోరు వౌన వ్రతం పాటించింది.
టపాకుల వెలుగుల మిరిమిట్ల
మధ్యన తాటాకుల గుడిసెల
గుండె మంటలు చూడలేక టప్పున
తలుపేసుకున్నాయి నా గుండె గదులు
బువ్వ పెట్టడానికి బుద్ధి పుట్టని మా రాజు
ఒకరు బురుసులు కొని పంచారు
బీదలకు బిచ్చం పెట్టని దేవుడొకరు
బండ పటాకుల పొట్లాలు
పంచి పెడుతున్నారు
పండుగ పదిలంగా నేర్పిందొక పాఠం
జీవితాంతం గుర్తుంచుకునే గుణపాఠం.