S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవితంలో బిగ్‌బాస్ హౌస్

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్లే ఇక్కడ
ఈ విశాల ప్రపంచంలో కూడా...
అలకలు, కన్నీళ్లు ఉంటాయి.
ఆవేశాలు, ఆరోపణలు ఉంటాయి
ఓటములు, ఓదార్పులు ఉంటాయి
అది మనం ఏరి కోరి వెళ్లిన ఇల్లు
ఇది మనకు తెలియకుండానే వచ్చి పడ్డ ప్రపంచం
ఆ ఇంట్లో గెలవాలంటే అందరితో నడవాలి,
అందరిలో ఒక్కరిగా నిలవాలి
క్షమించే మనసుండాలి, మరచిపోగల స్థైర్యముండాలి
ప్రపంచమనే ఈ ఇంట్లో గెలవాలన్నా అదే మంత్రం
తేడా ఒక్కటే
అక్కడ ఆ నలుగురూ ముందే కలుస్తారు
ఇక్కడ ఈ విశాల ప్రపంచంలో మన అడుగులతో కలుస్తారు, మనతో నడుస్తారు
మన నడవడితో తోడై నిలుస్తారు
అక్కడ జ్ఞాపకాలు సెల్ఫీల రూపంలో నిలుస్తాయి
ఇక్కడ జ్ఞాపకాలు అనుభూతుల రూపంలో
మిగిలిపోతాయి
ఆ జీవిత కాలం వంద రోజులు.. ఈ జీవిత కాలం వంద సంవత్సరాలు
అక్కడ ఇక్కడ ఎక్కడైనా...
సంబరాలు చేసుకునే
ఆత్మీయులుంటేనే..
గెలుపునకు అర్థం
ఆత్మీయులను
సంపాదించుకోవడమే జీవిత పరమార్థం.
*

-చందుపట్ల రమణకుమార్ రెడ్డి 9440449392