S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జ్ఞాపకాల్ని పూసే కొమ్మ

ఎన్నో ఏకాంత వనాలను
నీ చిర్నవ్వు పూలతో నింపాను
ఎనె్నన్నో అక్షరాల తోటల్ని
నీ కోసమని పెంచాను
నేనొక జ్ఞాపకాల్ని పూసే కొమ్మలా
ఎన్నో వసంతాలుగా
నీ కోసం పూస్తూనే ఉన్నాను
ఒక్క పలకరింపు
శీతల పవన స్పర్శకై
మేఘాల చూరు పట్టుకు వేలాడే
వానచినుకులా వేచి ఉన్నాను
హృదయపు వాకిలిలో
నువ్వు వదిలెళ్లిన
రంగు రంగుల ముగ్గుల్ని చూస్తూ
లిపిలేని ప్రేమలేఖొకటి రాస్తున్నాను
ఏదో రోజు
సవ్వడి చేయకుండా వచ్చి
నీ గుండెల మీద
నా ప్రేమలేఖను వదిలి వెళ్లిపోతాను
మనసులో ఎగసిపడే సముద్ర కెరటాల్ని
నేను మాత్రం ఎన్నాళ్లని దాస్తాను?
ప్రతి ఉదయం
గుప్పెడు జ్ఞాపకాల్ని జేబులో వేసుకుని
ఎంత దూరమైనా నడిచిపోతాను
ఒక పసినవ్వులోనో
ఒక అమృత స్పర్శలోనో
దిగంతాల్ని వెలిగించే
ఆఖరి వెలుగు కిరణంలోనో
ఒక వీరుడి చివరి నినాదంలోనో
పైరు వెన్నుతట్టే వానజల్లులోనో
ఎక్కడో చోట
నిన్ను శ్వాసిస్తూనే ఉంటాను
ప్రపంచం నన్ను కీర్తించినప్పుడల్లా
నవ్వుతూ నీ వైపు చూస్తాను! *

-సాంబమూర్తి.. 9642732008