S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చర్చిల శిల్పకళ.. భళా !

ప్రపంచంలోని అనేక దేశాలలో ఎన్నో చర్చిలు శిల్ప కళాసంపదతో విరాజిల్లుతున్నాయి. అటు భక్తులను, ఇటు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. క్రైస్తవుల ప్రార్థనా మందిరాన్ని చర్చి అంటారు. చర్చిలలో బెసిలికా, కెతడ్రల్, చాపెల్ ఇత్యాది రకాలు ఉన్నాయి. పవిత్రమైన వ్యక్తులు నివసించే ప్రాంతంలో నిర్మించే చర్చిలను బెసిలికా అంటారు. నిర్ణయించిన ప్రాంతానికి క్రైస్తవ మత గురువుగా వ్యవహరించే బిషప్ చనిపోయినపుడు వారి సమాధిపై నిర్మించే చర్చిలనే కెతడ్రల్ అంటారు. కొంతమంది చిన్న సమూహంగా ఏర్పడి వాళ్లు ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేసుకొన్న ప్రార్థనా స్థలాన్ని చాపెల్ అంటారు. కొంతమంది గృహాలలో సైతం చాపెల్ ఏర్పాటు చేసుకొంటారు. ప్రపంచ క్రైస్తవులు వారి పండుగలకు, పర్వదినాలకే కాక ప్రతి ఆదివారం విధిగా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ప్రపంచవ్యాపితంగా ఇలా ప్రార్థనలు చేసే క్రైస్తవ మందిరాలలో కొన్ని అతి పెద్దవిగా , మరికొన్ని అద్భుత శిల్పకళతో అలరారుతున్నాయి. వాటిలో కొన్ని చర్చిల విశేషాలను తెలుసుకొందాం.
సెయింట్ పీటర్స్ స్క్వేర్ - బెసిలికా
ఈ చర్చి ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో ఉంది. ఇది పోప్ పాలనలో ఉంటుంది. ఇదొక నగర రాజ్యం. ఇక్కడి జనాభా 900 లకు మించదు. వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ బెసిలికా చర్చి లోపలి భాగంలో 693.8 అడుగులు పొడవు 451 అడుగుల వెడల్పు ఉంటుంది. ఏసుక్రీస్తు శిష్యుడైన సెయింట్ పీటర్స్ సమాధిపై ఈ చర్చిని మహాద్భుతంగా నిర్మించారు. సెయింట్ పీటర్స్‌తోపాటు మోజెస్ విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. పాత బెసిలికా ను క్రీ.పూ. 318లో నిర్మంచారు. ఈ భవన స్థానంలో నూతన భవన నిర్మాణాన్ని 18 ఏప్రిల్ 1506లో ప్రారంభించి 18 నవంబర్ 1626లో పూర్తి చేశారు. ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీర్ అయిన మైకెల్ ఏంజిల్ తన 24వ ఏట సెయింట్ పీటర్స్ బెసిలికా భవన నిర్మాణానికి రూపకల్పన చేసి, నిర్మాణ రంగంలో ఒక నూతన మార్గానికి తెరతీశాడు. ముఖ్యంగా దీని పైభాగంలో ఉన్న డోమ్‌ను 132 మీటర్ల వైశాల్యంతో రూపొందించినప్పటికీ తన జీవిత కాలంలో మైకెల్ ఏంజిలో పూర్తి చేయలేకపోయాడు. ఈ క్రీస్తు మందిరమంతా ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారుడైన మైకెల్ ఏంజిలో చిత్రకళతో నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా లోపలిభాం పైకప్పుపై అద్భుత చిత్రాలను చూడవచ్చు. ఈ చిత్రాలు చిత్రించే సమయంలో లోపలి పైకప్పుడై చిత్రించిన చిత్రంలో చిన్న లోపం ఉంది. సరిచేయాలని తనను పైకప్పుపై ఉన్న చిత్రం వరకు తీసుకుని వెళ్లమని మైకెల్ ఏంజిలో కోరారు. అయితే ఆ సమయంలో మైకెల్ ఏంజిలో వయస్సు 85 సంవత్సరాలు. ఈ వయస్సులో అతడిని పైకప్పువరకు తీసుకుని వెళ్లడం ప్రమాదమని గమనించి అధికారులు అంగీకరించలేదు. కళలకు నిలయంగా భాసిల్లుతున్న ఈ చర్చిలో మైకెల్ ఏంజిలో తోపాటు భ్రమంటే గియాకోమో డెల్లా పోర్టా, మడె బెర్నిని ఇత్యాది వారు తయారుచ ఏసిన కళాఖండాలను ఏర్పాటు చేశారు. రాపెల్ . ప్రా. ఆంగెలికో వంటి కళాకారులు వాటికభ్ అంతర్గత అలంకరణ చేశారు. ఫేటా, డెవిడ్ అనే శిల్పాలను మైకెల్ ఏంజిలో తన 30వ ఏట సృజించాడు. ఇతను సృష్టి క్రమంలో విశదీకరించే కథను సైతం చిత్రీకరించాడు. చర్చిలో అద్భుతమైన 36 గాజు కిటికీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అనేక చర్చిలలో ఉన్న ఇటువంటి గాజు అద్దాలను జర్మనీ దేశం నుండి తెస్తుంటారు. జర్మనీలో తయారయ్యే ఈ గాజు అద్దాలపై కోరిన చిత్రాన్ని పరమాద్భుతంగా చిత్రీకరించి ఇస్తున్నారు. వాటిని ప్రపంచవ్యాపితంగా చర్చిల నిర్వాహకులు తెప్పించుకుంటున్నారు. ఇవి సూర్యకాంతికి మెరిసిపోతూ చూసేవారికి నయనానందం చేస్తుంటాయి. చర్చిలోనే కేథలిక్ మతాధిపతి అయిన పోప్‌కు ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు అన్ని ఆధునిక సదుపాయాలతోను, నవీన హంగులతో దీన్ని నిర్మించారు. ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. 16వ శతాబ్దంలో ఇక్కడ పోప్ నివాస భవనాన్ని నిర్మించారు. అక్కడే ఉండి పోప్ వాటికన్ నగరాన్ని పాలిస్తుంటారు. ఆరోజుల్లో పోప్ జూలియస్ -2 ఎక్కడి నుండో అనేక కళాఖండాలను సేకరించి ఇక్కడ ప్రదర్శించడం ప్రారంభించారు. ఇటువంటి కళాఖండాలన్నీ ఒక ప్రదర్శన శాలను ఏర్పాటు చేసి సందర్శకులు తిలకించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడే 50 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు తో అతి పెద్ద ముఖ్మల్ వస్త్రంపై బైబిలుకు సంబంధించిన చిత్రాలను చేనేతతో చిత్రీకరించారు. ఈ మ్యూజియం చూడాలంటే దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. వాటికన్ కళానిలయానికి ఆద్యుడు జూలియస్ -2 అని ఇప్పటికీ ప్రశంసలందుకుంటున్నాడు. దాదాపు 15 వందల చదరపు మీటర్లు ఉండే సెయింట్ పీటర్ స్క్వేర్ రమారమి 60 వేలమంది పట్టేందుకు వీలుగా నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా, పరమాద్భుత నిర్మాణంగా ఇది ప్రశంసలందుకుంటుంది. ఆకాలంలోని మహాకళాకారుల్లో ప్రముఖుడైన బెర్నినో చర్చి ఆవరణలో ఎన్నో స్తంభాలపై అనేకమంది మత బోధకుల విగ్రహాలను నిలబెట్టారు.
సెయింట్ బెసిల్ కెతడ్రల్
ఇది మాస్కోలోని రెడ్‌స్క్వేర్ లో ఉంది. సోవియట్ రష్యా పతనమైన తరువాత అక్కడి ప్రజలు క్రెమ్లిన్ భవనం, రెడ్ స్క్వేర్ ప్రాంతాన్ని పునరుద్ధరించారు. స్టాలిన్ నాయకత్వంలో 1932 లో క్రైస్తవ ప్రార్థనా మందిరాలు కనుమరుగైనాయి. సోవియట్ పతనానంతరం మతానుయాయులకు, రాజ్యాంగానికి మధ్య జరిగిన పోరులో ప్రార్థనామందిరాలు పునరుద్దరించారు. నిజానికి సెయింట్ బెసిల్ చర్చి నిర్మాణం ఇవాన్ టెరిబుల్ అనే అతని ఆదేశాల మేరకు క్రీ.శ. 1555 లో ప్రారంభిం చి 1561 లో పూర్తిచేశారు. మాస్కో నడిబొడ్డులో ఉన్న ఈ చర్చిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఇవాన్ -3 పాలనా కాలంలో క్రెమ్లిన్ భవనసముదాయం ప్రస్తుతమున్న నిర్మాణ రూపాన్ని సంతరించుకున్నాయి. ఇవాన్- 3 ఇటలీ నుండి శిల్పులను రప్పించి ఇక్కడి భవనాలతో పాటు చర్చిని నిర్మించారు. క్రెమ్లిన్ గోడ లోపలే చిన్న ప్రార్థనా మందిరాలు, మఠాలు, పెద్ద ప్రార్థనామందిరాలు, నాటకవాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇత్యాది అనేక అనేకం నిర్మించారు. 1812 లో నెపోలియన్ చేసిన 39 రోజుల యుద్ధంలో ఈ నగరం రూపురేఖలు మారిపోయాయి. వందల ఏళ్ల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ నగరం సోవియట్ సోషలిస్ట్ ప్రభుత్వ పతనం అనంతరం తిరిగి కొన్ని ప్రార్థనా మందిరాలు, భవంతులు పునరుద్ధరించి పూర్వ కళావైభవం తేవడంతో నయనానందంగా విరాజిల్లుతుంది.
వెస్ట్ మినిస్ట్రీ చర్చి
ఈ చర్చి లండన్ నగరంలో ఉంది. క్రైస్తవ మతశాఖ అయిన ప్రొటెస్టెంట్ మతానుయాయులు నిర్మించిన మధ్యయుగాల చారిత్రక నిర్మాణం వెస్ట్ మినిస్ట్రీ చర్చి. దీనే్న వెస్ట్ మినిస్ట్రీ అబే అని కూడా పిలుస్తారు. ఈ చర్చిని క్రీ.శ.7వ శతాబ్దంలో ఆంగ్లో శ్యాక్సన్ రాజు సెబర్ట్ ప్రారంభించాడు. ఈ నిర్మాణం క్రీ.శ. 960 నిర్మించారు. క్రీ.శ. 1065 లో ఎడ్వర్ట్ అనే అతను దీనికి ఆధునిక హంగులతో నవీన రూపం ఇచ్చాడు. చర్చి ప్రారంభమైన ఎనిమిది రోజులకే ఎడ్వర్ట్ మరణించగా ఈ చర్చిలోనే సమాధి చేవారు. 13వ శతాబ్దంలో హ్నెన్రీ -3 ఈ మందిరం ద్వారా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. గోతిక్ శిల్పశైలిలో దీన్ని పునర్నిర్మించారు. ఆ మీదట వందేళ్లకు రిచర్డ్-2 భవన నిర్మాణ నిపుణుడు హ్నెనీయెకాల్ ఆధ్వర్యంలో కాంటెర్‌బరీ అనే మఠాన్ని నిర్మించాడు. అతడే లండన్ నగరాన్ని సైతం 1666లో పునర్నిర్మించాడు. ఆ తరువాత 1517లో కూడా జరిగిన పునర్నిర్మాణ కార్యక్రమంలో అనేక మార్పులు చేశారు. 18 వశతాబ్దంలో ఈ చర్చికి 225 అడుగుల ఎత్తులో రెండు టవర్స్ నిర్మించారు. మూడు వేల మీటర్ల విస్తీర్ణంలో 85 అడుగులు వెడల్పుతో దీన్ని నిర్మించారు. వెస్ట్ మినిస్ట్రీ లండన్ నగరానికి పశ్చిమ దిశగా ఉంది.
వెస్ట్ మిస్ట్రీ మందిరం లోపల 156మీటర్ల పొడవు, 61 మీటర్ల వెడల్పు , 35 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. గ్రేట్ బ్రిటన్ లో దీనికిదే సాటి అన్నరీతిలో సెస్ట్‌మినిస్ట్రీని నిర్మించారు. బ్రిటన్ రాచరికపు కుటుంబాల వారు అధికారం చేపట్టే సమయంలో విధిగా ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు జరుపుతారు. ఈ చర్చిలో కొన్ని వందల సంవత్సరాల అకితం బైబుల్ అపం ఉంది. రాచకుటింబీకులు ఇక్కడికి వచ్చిన విశేషమైన కారణం ఉంది. ఇంగ్లండు రాచరికపు వ్యక్తులు, ప్రముఖ పరిపాలకులు కళాకారులు, కవులు, పండితులు ఇత్యాదివారి400 సమాధులు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూడటానికి సైతం అనేకమంది వస్తుంటారు. సర్ విలియమ్ ను 1066లో ఇక్కడే సమాధి చేశారు. ఆ సమయం నండి 1760 వరకు అనేకమంది రాజులు, రాంలు చనిపోయిన పిదప ఇక్కడే సమాధి చేశారు. లండన్ కే ప్రధాన ఆకర్షణగా భావిస్తున్న వెస్ట్‌మినిస్ట్రీ ని ఒక ప్రార్థనా స్థలంగానే కాకుండా చారిత్రక నిర్మాణం కూడా దీన్ని పరిగణిస్తారు. యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.
హోలి సోఫియా కెతడ్రల్ చర్చి
ఐరోపాలో ఉక్రెయిన్ రాజధాని నగరం కివ్‌లో హోలీ సోఫియా కెతడ్రల్ చర్చి నెలకొని ఉంది. కివ్ యూరప్‌లో అతి ప్రాచీన నగరం. యూరప్‌లో ఏడవ అతిపెద్ద జనాభాకల ప్రాంతం. ఓల్బోన్ నది పశ్చిమ తీరంలో ఉల్లిపాయ ఆకరాంలో ఉండే తొలి రాతిప్రార్థనా మందిరం. ఈ నిర్మాణం పొడవు 29.5 మీటర్లు, వెడల్పు 29.3 మీటర్లు. గుమ్మటాల వరకు ఎత్తు 28.6 మీటర్ల ఎత్తుతో నిర్మింరు. జైజాయింటెన్ కళాకారుడు ధియో పేన్య దీన్ని రూపొందించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నిర్మాణానికి నష్టం వాటిల్లింది. అనంతరం దీన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఉక్రెయిన్ చెందిన వ్యాపారులు ప్రజాసంస్థలు విదేశీ క్రైస్తవ సంస్థలు ఇత్యాది వారికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతుంది.
వౌంట్ సెయింట్ మైఖేల్ ప్రార్థనా మందిరం
ఐరోపాలోనే అపురూప కట్టడం గా విరాజిల్లుతుంది. వౌంట్ సెయింట్ ప్రార్థనా మందిరం. ఫ్రాన్స్ లోని ప్యారిస్ నగరం నుండి నాలుగు గంటల పాటు ప్రయాణం చేస్తే ఈ అద్భుత ప్రార్థనా మందిరాన్ని చేరుకోవచ్చు. ఇది ఒక చారిత్రాత్మక నిర్మాణం యునెస్కో వారు ప్రపంచ వారసత్వం కట్టడంగా ప్రకటించిన ఈ చర్చిని ప్రతి ఏడాది పాతిక లక్షల మంది ప్రపంచం నలుమూలల నుండి సందర్శిస్తుంటారు. దాదాపు ఒక కిలోమీటర్ దూరానికి కనపడేలా 160 మీటర్ల ఎతె్తైన చిన్న కొండపై ఈ భవ్య నిర్మాణం నెలకొని ఉంది. ఐరోపా శిల్పకళా చాతుర్యానికి ఇదో మచ్చుతునక. ఇది రోమన్ క్యాథలిక్ చర్చి. 10వ శతాబ్దంలో లభించిన కొన్న రాత ప్రతుల వల్ల ఈ చర్చికి ఒక కథ ఉంది. దీని ప్రకారం అవ్రాంచెస్ రాబర్ట్ అనే బిషఫ్ కు క్రీ.శ. 708లో ఒక రాత్రి కలలో మైఖేల్ దేవత కనిపించి సమీపాన ఉన్న వౌంట్ శిఖరం పై క్రీస్తు మందిరాన్ని నిర్మించమని ఆదేశించింది. అలా ఈ చర్చి నిర్మాణానికి బీజాలు పడ్డాయి. అనుకున్నదే తడవు ఈచర్చి నిర్మాణం జరగలేదు. ఆ తరువాత క్రీ.శ. 966 లో నార్మండి రాజు రిచర్ట్-1 కొంతమందిని చర్చి నిర్మాణానికై ఈ ప్రాంతానికి పంపాడు. వారంతా ఈ ప్రాంతాన్ని బాగా పరిశీలించారు. చర్చి నిర్మాణం కోసం ఈ కొండపై నిలబడేందుకు వీలుగా పరంజాలు కూడా నిర్మించారు. ఇక్కడే ఒక మఠం కూడా కట్టారు. సంఘ కాపరులతో పాటు మేథావులు కూడా ఇక్కడ బసచేస్తూ వచ్చారు. రాబర్ట్. డి. తుర్గిని ఈ మఠంలోని గ్రంథాలయాన్ని తన రాత ప్రతులతో నింపాడు. ఈ కారణంగా ఈ మఠాన్ని టౌన్ ఆఫ్ బుక్స్ అని కూడా పిలుస్తూ వచ్చారు. చర్చి క్రింది నాగంలో ఈ మఠాన్ని నిర్మించారు. మఠాన్ని పరిశీలించినట్లైతే క్రైస్తవ మత ప్రచారకుల జీవన విధానం, యాత్రికుల నివాస విధానం కూడా అవగతం అవుతుంది.. క్రీ.శ. 1204 లో ఈ మఠం జీర్ణదశకు చేరుకుంది. ఫ్రెంచ్ రాజైన ఫిలిప్ దీన్ని పునర్నిర్మించాడు. గోతిక్ శిల్ప శైలిలో పునర్నిర్మించిన ఈ మఠం క్రీ.శ. 1228 లో పూర్తి కావించారు. ఈ పర్వత ప్రాంతాన్ని 1873 లో ప్రకృతి సంపదగా గుర్తించారు. ఒకప్పుడు తుపాకులు వచ్చినపుడు ఉవ్వెత్తున ఎగసిపడే అలల వల్ల నీటి తాకిడి అధికంగా ఉండేది. కానీ ఇక్కడ ఒక గట్టు నిర్మించడంతో ఈ కొండ వరద తాకిడి నుండి బయటపడింది.
చార్ట్రెన్ కెతడ్రల్
ఇది రోమన్ కాథలిక్ చర్చి. దీనే్న నాట్రెడామ్ అని కూడా పిలుస్తారు. చార్ట్రెన్ కెతడ్రల్ ప్రాన్స్ ప్యారిస్ నగరానికి నైరుతిన 80 కి.మీ. దూరాన నెలకొని ఉంది. ఈ చర్చి నిర్మాణం క్రీ.శ.1194 ప్రారంభించి క్రీ.శ. 1220 పూర్తిచేశారు. దేవుని ప్రతిరూపంగా కనిపించే ఈ క్రైస్తవ మందిరం స్వర్గతుల్యంగా విరాజిల్లుతుంది. ఇందులో 13 అడుగుల ఎత్తులో మూడు అతి పెద్ద కిటికీలు ఉన్నాయి. దీని గోడలకు, కిటికీలకు అద్దాలను అమర్చారు. చార్ట్రెస్ క్రైస్తవ మందిరంలో పలు కాలాలకు చెందిన చారిత్రక పవిత్ర మత పెద్దల చిత్రాలతో అలంకరించడం వల్ల ఒక ప్రత్యేక వాతావరణం అక్కడ కనిపిస్తుంది. అద్దాల నండి ప్రసరించే కాంతి చర్చిలో పడి దేవుని వెలుగు కనుల ముందు సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతుంది. గోతిక్, రోమన్ శిల్పకళా వైభవం ఇక్కడ కనిపిస్తుంది. క్రీస్తు జన్మించినపుడు మేరీ ధరించిన పవిత్ర వస్త్రం ఇక్కడ
ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఒక పర్యాయం ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ చర్చికి కొంతమేరకు నష్టం వాటిల్లింది. తరువాత దీన్ని ఆధ్యాత్మిక వాదులు దాతల సహకారంతో పునర్నర్మించారు. చార్ట్రెస్ మఠాధిపతి అబిట్. ఈ చర్చి భవనం పైభాగంలోకాని, కిటికీల పై గాని మొత్తం 173 మరియ చిత్రాలు, విగ్రహాలు,చిహ్నాలు కనిపిస్తాయి.
వంద చర్చిల నగరం క్రకోవ్
పోలెండ్ దేశ రాజధాని నగరం క్రకోవ్. దీన్ని రాళ్లు మాట్లాడే నగరం అని పిలుస్తారు. ఐరోపాలోనే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక తొలి నగరంగా 1978లో నే యునెస్కో వారు గుర్తించారు. క్రకోవ్ నగరంలో వందకు పైగా చర్చిలు ఉన్నాయి. క్రీ.శ.965 వరకు ఈ నగరం రూపుదిద్దుకోలేదు. వీచ్ సెల్ నదీతీరాన ఇది ఒక వ్యాపార కేంద్రంగా భాసిల్లింది. పియాహ్ట్ వంశప్రభువులు క్రీ.శ.1039 లో క్రకోవ్ నగరాన్ని పోలెండ్ రాజధానిగా చేసుకుని పాలించే సమయంలో అద్భుతమైన చర్చిని చనిపోయిన ప్రభువులకోసం ఒక స్మశాన వాటికను నిర్మించారు. మంగోలియాన్ తార్తర్ క్రీ.శ.1241లో ఈనగరాన్ని ధ్వంసంచేశాడు. ఆ తరువాత తార్తర్ చక్మర్ -3 ఈ నగరాన్ని త్వరిత గతిన అభివృద్ధి పరిచాడు. ఇక్కడే 1364లో ఒక చక్కటి విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. పోలెండ్ ప్రాంతంలో ఇదే తొలి విశ్వవిద్యాలయంగా ప్రశంసలందుకుంటుంది. ఖగోళ శాస్తవ్రేత్త కొపర్నికస్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి క్రకోవ్ లో ప్రధాన కూడలి వద్ద నిర్మింతమైన సెయింట్ మేరీస్ బెసిలికా చర్చి 80 మీటర్ల ఎత్తులో గంభీరంగా కనిపిస్తుంది. దీన్ని పోలిష్, గోతిక్ శిల్పకళా శైలిలో నిర్మించారు. శిల్పకళతో అలరారుతున్న ఇటువంటి అనేక చర్చిలను క్రకోవ్ నగరంలో చూడవచ్చు. పోలిష్ , ఐరోపాలోనే అతి పెద్దదైన మేరీ విగ్రహాన్ని గోధిక్ శిల్ప కళారీతిలో తయారు చేసి ఇక్కడ నెలకొల్పారు. పోలీష్ రాజులు 1566లో తమ రాజధానిన్ని ఇక్కడి నుండి మార్చినప్పటికీ ఈ నగరం చాలాకాం తన ప్రాభవాన్ని కోల్పోలేదు. నేడు అత్యాధునిక చర్చిలతో అకకోవ్ అలరారుతోంది.
నగ్రడ ఫామిలియా చర్చి
దీన్ని స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్మించారు. ఇది రోమన్ కాథలిక్ చర్చి. 19 మార్చి 1882లో దీని నిర్మాణం ప్రారంభమైంది. దీన్ని 90 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 170 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ ప్రదేశంలో 9 వేలమంది కూర్చోవడానికి అనువుగా నిర్మించారు. నగ్రడ ఫామిలియా చర్చిని 1852-1926 మధ్యకాలంలో జీవించిన అంటోనీ గౌడి నిర్మించారు. అయితే ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ చర్చికి మరమ్మత్తులు జరుగుతూనే ఉన్నాయి. యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు.
చర్చ్ ఆఫ్ నేటివిటి
పవిత్ర చర్చిలకు నెలవు జెరూసలెం
ఇజ్రాయిల్ దేశ రాజధాని నగరం జెరూసలెం. ఏసుక్రీసు జీవిత ఘట్టాలతో పెనవేసుకున్న పవిత్ర క్షేత్రం. జెరూసలెం పాత కొత్త నగరాల కలయిక. జెరూసలెం అంటే శాంతి నిలయం అని అర్థం. ఇక్కడిప్రధాన పుణ్యస్థలం పేరు సెయింట్ జేమ్స్ కెతడ్రల్. ఈ ప్రదేశంలోనే ఏసుక్రీస్తు మరణానికి ముందు తన శిష్యులతో కలసి భోజనం చేవారు. దిలాస్ట్ సప్పర్ గా ఈ ప్రదేశం చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఏసుప్రభువును శిలువ వేయడం, ముళ్లకిరీటం పెట్టడం, వస్త్రాలను మార్చడం, కొరడాలతో కొడుతూ ముందుకు నడిపించడం ఇత్యాది 14 ప్రదేశాలను కలిపి 6వయోడొలొరోసా’ అని పిలుస్తారు. రక్తంతో తడిసి పోయిన ఏసుక్రీస్తు ను వెరోనికా అనే మహిల ఒక వస్త్రంతో ప్రభువు ముఖాన్ని తుడుస్తుంది. అపుడు ఏసుక్రీస్తు ముఖార విందం రేఖాచిత్రంగా ఆ వస్త్రంపై ముద్రితమైందని క్రైస్తవుల విశ్వాసం. ఇటువంటి ఘటనలకు సంబంధించిన ప్రదేశాలన్నీ ఇక్కడ తిలకించవచ్చు. సమీపానే ఏసుప్రభువును శిలువ వేసిన కల్వరి కొండ ఉంది. ఈబాటలోనే నడచి వెళితే హోలీ సెపల్‌కర్ చర్చిని చేరవచ్చు. హోలీ సెపల్‌కర్ చర్చిలోకి మెట్లెక్కి వెళితే ఒక ప్రార్థనాలయం కనిపిస్తుంది. దీనిలో రెండు భాగాలున్నాయి. ఒకటి గ్రీకులకు చెందినది కాగా వేరొకటి లాటిన్ చర్చికి సంబంధించినది. మెట్లు దిగి క్రిందకు వస్తే ఏసుప్రభువును పడుకోబెట్టిన రాతి బండ కనిపిస్తుంది. ఇక్కడే ఏసుక్రీస్తు సమాధి చేసిన ప్రదేశం కూడా ఉంది. ఈ సమాధినే గార్టెన్ టూంబ్ అంటారు. దీన్ని చూడటానికి ఇద్దరిని మించి వెళ్లిడానికి తగిన ప్రదేశం లేదు. అందువల్ల ఒకేసారి ఇద్దరు మాత్రమే లోనికి వెళతారు. ఏసును సమాధి చేసిన ప్రదేశాన్ని చూసిన వాళ్లు తిరిగి వచ్చాక మరో ఇద్దరు వెళతారు. ఈ ప్రదేశాన్ని క్రైస్తవులు పవిత్రమైనదిగా భావిస్తారు. కింగ్ డేవిడ్ యెహోనా దేవుని పేరుతో ఇక్కడే ఒక క్రైస్తవ మందిరాన్ని నిర్మించాడు. చీకటిగా ఉంటే గర్భగుడిలో ‘ఆర్క్ ఆఫ్ ది కాపనెంట్’ ఏర్పాడు చేశాడు. ఇజ్రాయిల్ ఒకప్పుడు పాలస్తీనా భూభాగంలో ఉండేది. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు అందరూ జెరూసలెంను పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలో అనేక యుదాధలు కూడా జరిగాయి. ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాన్ని తిరిగి అప్పగించాలనేది పాలస్తీనియన్ల డిమాండ్. ఇటువంటి అనేక గొడవలను పట్టించుకోకుండా అనునిత్యం పర్యాటకులు, భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. ఈ తరువాత అతని కుమారుడైన సాలమన్ ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచాడు. ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇజ్రాయిల్ వాసులకు అతి పవిత్ర క్షేత్రం. జెరూసలెం సమీపాన గల నజరేత్ నగరంలో మదర్ మేరీ చర్చి అతి ప్రాచీనమైంది. దీన్ని 384 లో నిర్మించారు. క్రీ.శ.570 లోను, 7 వశతాబ్దంలో మరోసారి, 1969లో ఇంకోసారి అనేకమార్పులు చేశారు. క్రీ.శ.638 , 1625 సంవత్సరాలతో పాటు పలుమార్లు జరిగిన దాడుల్లో ఈ నిర్మాణానికి నష్టం వాటిల్లింది. 1977 లో ఈ నిర్మాణాన్ని ఆధునీకరించారు.
సెయింట్ పాల్స్ కెతడ్రల్
ఇది లండన్‌లో ఉంది. దీనే్న చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ కెతడ్రల్ అని కూడా పిలుస్తారు. ఇది లండన్ బిషప్ యొక్క పీఠం. లండన్ లో ని ఎతె్తైన కట్టడంగా ఇది విరాజిల్లుతుంది. ఇదే ప్రదేశంలో క్రీ.శ.664లో ఒక చర్చి ఉండేది. అదే ప్రదేశంలో ఆధునీకరిస్తూ క్రీ.శ. 1675లో చర్చిని నిర్మించారు. అయితే చర్చి పేరు మాత్రం మార్చలేదు. అప్పుడూ ఇప్పుడు కూడాసెయింట్ పాల్స్ కెతడ్రల్ పేరుతోనే పిలుస్తున్నారు. ఈ చర్చి 365 అడుగుల ఎత్తులో గంభీరంగా కనిపిస్తుంది. దీనిపైన ఉన్న గుమ్మటం 278 అడుగుల వైశాలాన్ని కలిగి ఉంటుంది. ఈ చర్చికి ఒక్కొక్క టవర్ 221 అడుగుల ఎత్తులో ఇరువైపులా రెండు టవర్లు ఉన్నాయి. ఏసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉండేవారు. వారిలో ఒకడైన అపోస్తలుడైన పౌలుకి ఈ నిర్మాణాన్ని అంకితం చేశారు.
నోట్రెడామ్ డి ప్యారిస్ చర్చి
ఈ చర్చి ప్యారిస్ నగరంలో ఉంది. ఫ్రాన్స్ బిషప్ నేతృత్వంలో ఈ చర్చి నడుస్తుంది. క్రీ.శ. 116 3లో దీని నిర్మాణం ప్రారంభమై 1345 లో పూర్తయింది. సుదీర్ఘకాలం నిర్మించిన ఈ దివ్య, భవ్య క్రీస్తు మందిరం అద్భుత చిత్రాలతో అలరారుతుంది. ఈ భవనం పొడవు 420 అడుగులు, వెడల్పు 157 అడుగులు. ఈ చర్చికి ఒక్కొక్కటి 226 అడుగుల ఎత్తులో రెండు టవర్లను కూడా నిర్మించారు. దాదాపు పది గంటలు కూడా ఏర్పాటు చేశారు. 15 ఏప్రిల్ 2019 2019 స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ఈ చర్చిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ కారణంగా శిఖర భాగానికి కొంత నష్టం వాటిల్లింది. ఆ తరువాత ఈ నిర్మాణ మరమ్మత్తులు గావించారు. నోట్రె డామ్ డి ప్యారిస్ చర్చిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారు గుర్తించారు.
సెయింట్ మార్క్స్ బెసిలికా చర్చి
ఇది ఇటలీ దేశ ఉత్తర వెనిస్ నగరంలో నెలకొని ఉంది. దీని పొడవు. 251 అడుగులు, వెడల్పు 205 అడుగులు. ఈ చర్చి పైభాగాన అయిదు గుమ్మటాలు ఉన్నాయి. ఈ గుమ్మటాలు లోపలి భాగం 92 అడుగులు, బయట భాగం 141 అడుగు ఎత్తును కలిగి ఉన్నాయి. ఇటాలియన్ బైజాయింటైన్ శిల్పశైలిలో అద్భుతంగా దీన్ని నిర్మించారు. సెయింట్ మార్క్స్ బెసిలికా నిర్మాణాన్ని క్రీ.శ. 978లో ప్రారంభించి 1092 పూర్తి చేశారు. దీని లోపలి భాగం బంగారు వర్ణంతో ధగధగ లాడుతుంది. గోడలపై ఏసుప్రభువు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు అద్భుతంగా చిత్రించారు. ఇలా ఇంకా అనేక క్రీస్తు మందిరాలు అద్భుత శిల్పకళతో అలరారుతూ భక్తజనులతో పాటు పర్యాటకుల్ని కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదే రీతిలో మన దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక చర్చీలు తమ శిల్పశైలితో నయనానందం చేస్తున్నాయి.
భారతదేశంలో ప్రముఖ చర్చిలు
మన దేశంలో అనేక రాష్ట్రాలలో చర్చిలు ఉన్నాయి. ముఖ్యంగా గోవాలో అతి ప్రాచీన చర్చిలు ఉన్నాయి. గోవాలో యునెస్కో వారు ప్రకటించిన రెండు ప్రపంచ వారసత్వ సంపదలు ఉన్నాయి. మొదటిది బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చి కాగా రెండవది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహము. ఈ దేహాన్ని పదేళ్లకొక సారి పూజకోసం వెలికి తీసి ప్రజలు చూసేందుకు అనుమతిస్తారు. బెసిలికా ఆఫ్ బొమ్మే జీసస్ చర్చి పాత గోవాలో ఉంది. దీని నిర్మాణం 1594లో ప్రారంభించి 1605లో పూర్తిగావించారు. ఇంకా గోవాలోని సే కాథరిన్ చర్చి కూడా దర్శనీయమైంది. మనదేశంలోనే కేరళలోని శాంతా క్రుజ్ బెసిలికా కడమట్టోమ్ చర్చి, వల్లాడ చర్చి, సెయింట్ ప్రాన్సిస్ చర్చి తమిళనాడులోని వేళాంగిణి మాత చర్చి, సాన్ థోమ్ బెసిలిక, పశ్చిమ బెంగాల్ లోని సెయింట్ పాల్ కెతడ్రాల్ ప్రముఖమైన చర్చిలుగా విరాజిల్లుతున్నాయి.
మెదక్ చర్చి
ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిగా విరాజిల్లుతోంది తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ చర్చి. ఇంగ్లండ్‌కు చెందిన చార్లెస్ వాకర్ పొనె్నట్ క్రీ.శ. 1895 లో భారతదేవానికి వచ్చాడు. ఆయన పాస్టర్‌గా బాధ్యతలు స్వీకరించి మద్రాసు, సికింద్రాబాదు ప్రాంతాలలో పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న అతను ప్రక్కనే ఉన్న రెండంతస్తుల భవనంలో నివసించారు. ఒకరోజు ఆ భవనం పైనుండి తాను పనిచేస్తున్న చాపెల్‌ను చూశాడు. క్రీస్తు మందిరం కంటే తన ఇల్లు చాలా ఎత్తులో ఉండడం అతనికి నచ్చలేదు. దీన్ని అతి పెద్ద చర్చిగా నిర్మించాలని పూనుకొన్నాడు. ఆ కాలంలోనే మెదక్‌లో కరువు తాండవిస్తుంది. ప్రజలంతా పనిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచం గర్వించదగ్గ క్రీస్తు మందిరాన్ని నిర్మిస్తూ ఈ ప్రాంతం వారికి పనికల్పించాలని ఆయన సంకల్పించారు. పనికి ఆహార పథకం క్రింద చర్చి నిర్మాణం ప్రారంభించారు. అప్పటి వరకు అన్నం మెతుకులు కూడా లేని పేదలకు చక్కటి భోజనం ఏర్పాటు చేశారు. మెతుకులు అన్న పదం నుండే మెదక్ అనేది వచ్చిందని చెబుతుంటారు.
అనుకున్నదే తడవు బర్మానుండి బియ్యం, ఆహారపదార్థాలు తెప్పించారు. విరాళాలు ఇంగ్లండు నుండి సేకరించారు. మేస్ర్తిలు ముంబై నుండి వచ్చారు. ఈ చర్చి నిర్మాణానికి క్రీ.శ.1910లో పునాది వేశారు. ఇంగ్లండు కు చెందిన వాస్తు శిల్పి ఎడ్వర్ట్ హార్డింగ్ ఇంగ్లండ్ నుండి తెల్లరాతి పలకలను కూడా తెప్పించారు. చర్చిని ఏ నమూనాలో నిర్మించాలనే సమస్య ఉత్పన్నమైంది. ఆ సమయంలో ఇంగ్లండుకు చెందిన బ్రాడ్ షా దాదాపు 200 నమూనాలను చిత్రించి చార్లెస్ వాకర్‌కు ఇచ్చాడు. వాటిలో దేన్ని ఎంచుకోవాలో ఆయనకు అర్థం కాక అన్నింటినీ ఒకచోట ఉంచారు. అపుడే శరవేగంతో గాలి రావడంవల్ల అన్ని చిత్రాలు ఎగిరిపోయి ఒక నమూనా చిత్రం మాత్రమే అక్కడ నిలిచింది. ఇది దైవ సంకల్పంగా భావించిన చార్లెస్ వాకర్ ఆ నమూనాతోనే ఆ చర్చిని నిర్మించారు.
1914 నుండి 1924 వరకు పదేళ్లపాటు 12 వందలమంది కార్మికులు అహర్నిశలు కష్టపడి మెదక్ చర్చిని నిర్మించారు. తొలుత ఈ చర్చిని 180 అడుగుల ఎత్తులో నిర్మించాలని నిజాం ప్రభు అనుమతి కోరారు. అయితే చార్మినార్ ఎత్తు 175 అడుగులు. ఆ కారణంగా 173 అడుగుల ఎత్తులో నిర్మించుకోవడానికి అనుమతి లభించింది. ప్రాచీన రోమ్ గోతిక్ శైలిలో దీన్ని నిర్మించారు. చర్చిలోని అద్దాలపై 1927, 1947, 1958 సంవత్సరాలలో మూడు దశలలో క్రీస్తు జీవిత చరిత్ర చిత్రాలను హాలులో చిత్రించారు. ఇటలీ నుండి పాలరాళ్లు, రంగూన్ నుండి కలప ఇలా అనేక దేశాల నండి ఇతర సామాగ్రి తెప్పించారు. ప్రధాన హాలులో ఐదు వేలమంది ఒకేసారి ప్రార్థన చేయవచ్చు. వాటికన్ తరువాత అంతే పెద్దదిగా ప్రశంసలందుకుంటున్న మెదక్ చర్చికి అనునిత్యం భక్తులు, పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఇంకా అనేక వేల చర్చిలు ప్రపంచ వ్యాపితంగా భక్తజనులను విశేషంగా ఆకర్షిస్త్తున్నాయి.

''చిత్రాలు..సెయింట్ బెసిల్ కెతడ్రల్ చర్చి
'వౌంట్ సెయింట్ మైఖేల్ ప్రార్థనా మందిరం
'మార్క్స్ బెసిలికా - వెనిస్
*మెదక్ చర్చి
**
*సగ్రాడా ఫామిలియా చర్చి
*ఛార్ట్రెస్ కేథడ్రెల్
*లండన్ చర్చి
*చర్చ్ ఆఫ్ నేటివిటి
- జెరూసలెం
*సెయింట్ పాల్స్ కెతడ్రల్

- షేక్ అబ్దుల్ హకీం జాని 9949429827