S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంఘం

ఒకడు
ఒక్కో సంఘాన్ని
ఉసిగొల్పాడు
ఒకే నినాదం

నమ్మింది సంఘం
నినాదం మాటున
మర్మమెరుగక

ప్రజాపక్షమో
తప్పదనో
నేతలంతా హోరెత్తించిన
నినాదం

కులమూ
మతమూ కానక
ఉరిమింపజేసిన నినాదం

ఒక్కటై
నినాదాన్ని
ఫలింపజేసి
ఒక్కడిని గద్దె నెక్కించిన సమాజం

తొలినాళ్లల్లో
నినాద భ్రాంతిలో
సేద తీరిన సమాజం

ఒక్కో భ్రాంతి
వీడుతుంటే
ఒక్కో సంఘం
సంఘటితమై
బిగిస్తున్న పిడికిలి

అణచివేత ఆయుధం
అహంకారం విదిలించిన జూలు
నినాదమెనుక మర్మం
నగ్న నర్తింపు

సంఘం వద్దని హుంకరింపు
వాడు పుట్టక ముందే సంఘం
వాడు సచ్చినంక సంఘం సజీవం
గద్దెనెక్కించినది సంఘమే
కూలదోసేది సంఘమే

మనిషికి మరణం తథ్యం
మరణం లేనిది సంఘం
చిదిమేత ఎవడి తరం
నియంతలెందరినో సాగనంపిన
చరిత్ర సంఘానిది

సంఘం నిత్యం
పొద్దువోలే
కొత్త.. కొత్తగా
పదునెక్కిన కిరణాలతో.
*

-సిహెచ్.గిరిప్రసాద్.. 9493388201