S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభువా! వినవా!

ఏ సువార్తను చదివినా - ఏసయ్యా
నీ రూపమే మా కనుల మెదిలేను

పరలోక మార్గము చూపే కావ్యమై
ప్రతి మనసునూ కదిలించేను- ఈ
మారుమనసు స్వస్థతను కూర్చేను

పరిపరి విధముల యోచన చేసి
పాప కార్యమునకు పరుగులు తీసి
మురికి కూపమైన మనసుల నిండా
పరిశుద్ధ వాక్యమై పరిమళించేను
పరలోక మార్గమై నిలిచేను

నీ బోధనలోని ప్రతి అక్షరమూ
సువాసనాభరిత సుమగంధమై
ప్రతి మనిషిని కరుణించేను
ప్రతి మనసును కదిలించేను

ప్రభువా! వినవా! నా మొరను
విభుడా! కనవా! నా వ్యథను
మాలోని పాపాలను పోగొట్టి
పరలోకమునకు దారి చూపించి
అటువైపే మమ్ముల నడిపించి
స్వస్థత నీయుము తండ్రీ
పరిశుద్ధుల గావించుము తండ్రీ

*

-బి.విజయలక్ష్మి