S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్దిష్టంగా...

కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త ఆలోచనలు ప్రణాళికలు మొదలవుతాయి.
అందరూ తమ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మొదలుపెడతారు.
ఈ లక్ష్యాలు నిర్దిష్టంగా వుండవు. ఇవి అస్పష్టంగా వుంటాయి. ఇలా వుండటం సులువుగా, సౌలభ్యంగా అన్పిస్తుంది.
కానీ ఫలితం ఉండదు.
మంచి ఉద్యోగం సంపాదించాలి. నేను బరువు తగ్గాలి. రోజూ రాయాలి. రోజూ నడవాలి. ఇలా ఎన్నో...
ఇవన్నీ అస్పష్టమే.
మంచి ఉద్యోగం సంపాదించాలి. ఏ ఉద్యోగం. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి. ఎన్ని గంటలు చదవాలి. ఈ విషయాల మీద అవగాహన ఉండాలి. అందుకోసం ఎలా కష్టపడాలి. ఈ విషయం మీద చాలా నిర్దిష్టమైన ప్రణాళిక వుండాలి.
బరువు తగ్గాలి. ఆరోగ్యంగా ఉండాలి. అనుకుంటే ఎంత బరువు తగ్గాలి. అందుకోసం ఏం చేయాలి?
ప్రతి విషయం మీద స్పష్టత ఉండాలి.
లక్ష్యం ఎంత ముఖ్యమో
అది నిర్దిష్టంగా వుండటం అంతకన్నా ముఖ్యం.
**

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001