S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలక్ట్రిక్ హింట్

నిజానికి భూమి, ఈథర్‌లు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలలో తిరుగుతుంటాయి. పడమర నుండి తూర్పునకు ఎర్త్ రొటేట్ అవుతుంటే తూర్పు నుండి పడమరకు ఈథర్ తిరుగుతుంటుంది. మొత్తానికి ఈ రెండూ వ్యతిరేక దిశలలో తిరుగుతుండటం వల్ల జనించే ప్రెషర్ కారణంగా మనం స్థిరంగా మనుగడ సాగించ గలుగుతున్నాం. దీనే్న మాస్టర్ యోగ సాధనలో ‘ఈథర్ వర్కవుట్’ అంటున్నాం.
* * *
ఇక ‘ఎలక్ట్రికల్ యూనివర్స్ థియరీ’ - శూన్యం అనుకుంటున్న స్పేస్‌లో విద్యుచ్ఛక్తి నిండుకుని ఉంటుందన్నది ఈ సిద్ధాంతం. అంటే మనం వినీలాకాశం అనుకుంటున్న స్పేస్‌లో ఈథర్‌తోపాటు విద్యుచ్ఛక్తి కూడా ఉంది. ఈ గాలి, ఈ నేల, నీరు, నిప్పు, ఆకాశం, రంగులు, రాళ్లు, ఖనిజాలు - ఇవన్నీ ఆ విద్యుచ్ఛక్తి వల్ల రూపొందినవే. మనలో కానీ, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కానీ చైతన్యం వెల్లివిరియటానికి కారణం ఈ విద్యుచ్ఛక్తే. ఇలా జరిగే క్రియ లోపరహితంగా జరగటానికి మాస్టర్ సి.వి.వి. ‘ఎలక్ట్రిక్ హింట్’ అనే శబ్ద సముదాయాన్ని సాధనలో నిక్షిప్తం చేశారు.
మొత్తానికి సూర్య చంద్రుల ప్రభావం మన మానవ మనుగడపై చెప్పలేనంత ఉంటే గురు, శుక్ర, శని, బుధ, కుజ వంటి ప్రధాన గ్రహాలతో పాటు ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్‌ల ప్రభావమూ, రాహు కేతు గ్రహాల ప్రభావమూ మన దైనందిన మానవ పరిణామంపై ఉంటోంది.
ఇక నక్షత్రాల ప్రభావాల విషయానికి వస్తే - కనువిందు చేసే నక్షత్రాలన్నీ చలన రహితాలుగా కనిపిస్తుంటాయి. వీటిలో అయిదు నక్షత్రాలు మాత్రం సదా చలనశీలాలే. అతి స్వల్ప పరిధిలో - నారో లైన్‌లో - ఈ అయిదు నక్షత్రాలూ భూమిలా తిరుగుతూనే ఉంటాయి. ఈ రేఖనే ‘ఎక్లిప్టిక్’ అంటుంటాం. సూర్యుడు, చంద్రుడు, ఈ అయిదు నక్షత్రాలు ఒకే రేఖపై ఉంటాయి. ఈ ఎక్లిప్టిక్ రేఖనే పనె్నండు విభాగాలు చేసి - పనె్నండు రాశులుగా - లక్షణాలను బట్టి పనె్నండు జంతువుల పేర్లతో వ్యవహరిస్తున్నాం.
ఒక రాశిలో ఒక గ్రహం ప్రయాణించే సమయంలో జన్మించటాన్ని బట్టి లెక్కకట్టి భవిష్య జీవితాన్ని అంచనా వేయటం జరుగుతోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి ఒక సంవత్సర కాలం పడుతుంటే, భూమి చుట్టూ చంద్రుడు తిరగటానికి ఒక నెల, తన కక్ష్యలో భూమి తిరగటానికి ఒకరోజు పడుతోంది. మాస్ అండ్ డిస్టెన్స్‌లను బట్టే విశ్వగర్భంలో మండలాల మధ్య ఆకర్షణలు, ప్రభావాలు చోటు చేసుకుంటున్నాయి.
కుజుడి కంటే బృహస్పతిపైనా, భూమి కంటే శుక్రుడి పైనా, బుధుడి కంటే కుజుడిపైనా, యురేనస్ కంటే శని పైనా సూర్య ప్రభావం అధికం కావటంలో డిస్టెన్స్ అండ్ మాస్‌లే భూమిక అవుతున్నాయి. ఈ గ్రహాలు చెందే మార్పుల్ని బట్టి వాటి శక్తి తరంగాలలోను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ శక్తి తరంగాల ప్రభావమే మానవ మనుగడపైనా ఉంటోంది. మనలోని శారీరక, మానసిక భావోద్వేగాల తీవ్రతల కన్నిటికీ కారణాలు ఈ ఖగోళ మార్పులే.
ఆరిజన్ ఒన్
మన ఆలోచనలను ప్రభావితం చేసేది గురుగ్రహం. ఆలోచన లేనిదే మానవ మనుగడ లేదు కాబట్టి మనల్ని గాఢంగా ప్రభావితం చేస్తున్న గురువును ‘వింగ్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్’ అంటున్నాం. సంయోగంలోను, సహృదయతలోను శుక్రుడి పాత్ర అధికం కాబట్టి శుక్రుడ్ని ‘గాడెన్ ఆఫ్ లవ్’ అంటున్నాం. మొత్తానికి సూర్యుడి సప్త కిరణాలకు ప్రధాన సప్తగ్రహాలు ప్రతిబింబాలవుతున్నాయి. ఈ గ్రహ మండలాల సామూహిక శక్తే కాస్మిక్ ఎనర్జీ.
ఈ కాస్మిక్ ఎనర్జీ పోనీ యూనివర్సల్ ఎనర్జీకి ఉత్పత్తి స్థానం ఏ ఒక్క గ్రహమో, ఏ ఒక్క నక్షత్రమో లేదా ఏ ఇతర ఖగోళ పదార్థమో కాదు.. మన జ్ఞాన విజ్ఞానాలకే కాదు ప్రజ్ఞానానికి సైతం అందీ అందని మూలాంశ ఒకటుంది. దానే్న మాస్టర్ యోగంలో ‘ఆరిజన్ ఒన్’నే. ఈ ఆరిజన్ ఒన్‌లో ఎటువంటి మార్పు చోటు చేసుకోదు కానీ ఈ ఆది నుండి సృష్టిలోకి వచ్చిన ప్రతీ అంశలోను మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంటే ప్రతిక్షణమూ పరిణామం కొత్తనే.. క్షణక్షణమూ నూతన పరిణామమే. ఇదే విశ్వ పరిణామం.. మానవ పరిణామ రహస్యం.
.*

-విశ్వర్షి 93939 33946