S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మ్రోయు తుమ్మెదలు

సమయం ఉదయం 11 గంటలు..
స్టూడియోలో చుట్టూ వాద్య బృందం.. మధ్యలో గాయకుడు మహమ్మద్ రఫీ.. కాస్త దూరంలో.. వాద్యబృందాన్ని మరో గదిలో పర్యవేక్షిస్తూ నిలబడ్డ సంగీత దర్శకుడు నౌషద్ అలీ.. ఆవేళ ఎందుకో రఫీ చాలా ఉదాసీనంగా ఉన్నారు రాగ్ పట్‌దీప్‌లో ఘజల్ శైలిలో..
నౌషాద్ స్వరపరచిన పాటను మహ్మద్ రఫీ తన్మయత్వంలో, నాద మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పాడేశాడు (అది సినిమా పాట కాదు).
కర్ణాటక సంగీత సంప్రదాయంలో గౌరీ మనోహరి రాగమే హిందుస్థానీ రికార్డింగు అయ్యింది. అద్భుతమైన పాట కంపోజ్ చేసిన నౌషాద్‌ను అభినందించారు ఆ మహాగాయకుడు రఫీ. పారితోషికం కూడా తీసుకోకుండానే వెళ్లొస్తానని చేతులూపుతూ ఒకసారి నౌషద్‌ను చూసి భావోద్వేగానికి గురై జాలిగా చూస్తున్నాడు. అశ్రుధారలను గమనించిన నౌషాద్ ‘్భయిసాబ్! ఆజ్ క్యా హోగయా తుమ్హే’ (తమ్ముడూ! ఏమైంది నీకీవేళై) అని రెండు చేతులూ పట్టుకుని సముదాయించే ప్రయత్నం చేశారు.
సౌషాద్ సాబ్! ఈ సంగీత జీవితానికి ఇంతకంటే నేను కోరుకునేదేమీ లేదు. ధన కనక వస్తు వాహనాలు, భార్య, పిల్లలు, బంధాలూ.. యివన్నీ నాద బంధానికంటే ఎక్కువ ఆనందాన్నిస్తాయా? నౌషాద్‌జీ! నాదరూపుడైన పరమేశ్వరుణ్ణి దర్శించగలుగుతున్నాను. నా జన్మ సార్థకమైందన్నాడు. అదే రఫీ ఆఖరి రికార్డింగు.
సుస్వరానికి, నాదానికి అర్థం తెలిసిన వారి అనుభూతులిలాగే ఉంటాయి. మాటల్లో వర్ణించలేని నాదానందాన్ని తనివితీరా అనుభవించిన గాయకులు అమరులు.
‘మొహబ్బత్ కీ రాహోఁమే చల్‌నా సంభవ్‌కే’ ‘ఉరన్ ఖటోలా’లోని పాట వినే ఉంటారు. సంగీతం నౌషద్, గానం రఫీ ‘జిందగీ ఆజ్ మేరే నామ్ సే షర్మ్ ఆతీ హై అప్ నీ హాలాత్ పెముఝే ఖుద్ భి హసీ ఆతీహై అప్‌నీ హాలాత్ పె ముఝే ఖద్ భి హసీఁ ఆతీహై’
చిత్రం- సన్ ఆఫ్ ఇండియా
‘తేరే మేరే సప్‌నే అబ్ ఏక్ రంగ్‌హై/ జహా భిలే జాయే రాహై హమ్ సంగ్ హై’ చిత్రంలోని పాట. దీనికి సంగీతం ఎస్.డి.బర్మన్, గానం మహ్మద్ రఫీ. ‘మన్ మొహనా బడే ఝాతే ‘సీమ’ చిత్రం, సంగీత దర్శకులు శంకర్ జైకిషన్- ఒకదాన్ని మించిన పాట మరొకటి. ఈ పాటలన్నీ జై జయవంతి రాగంలో స్వరపరచబడినవే. మన కర్ణాటక సంగీత సంప్రదాయంలో పిలిచి ‘ద్విజావం’యే హిందూస్తానీ సంప్రదాయంలో ‘జైజయవంతి’. పేరులోనే తేడాగానీ, స్వరాలన్నీ అవే. పదార్థాలన్నీ అవే. కానీ వండి వడ్డించటంలోనే తేడా వున్నట్టుగా ప్రాంతాలను బట్టి బాణీ మారిపోతుంది.
ఉత్తర హిందూస్తాన్‌లో ప్రవహించేది గంగ. దక్షిణాన ప్రవహించేది కావేరి. సంగీత బాణీలు వేరే అయినా రెండింటి ఆత్మ ఒక్కటే. దక్షిణాదిలో వినబడేదంతా కర్ణాటక సంగీతం. ఉత్తరాదిలో వినిపించేది హిందూస్తానీ సంగీతం. రాగభావం కోవసం పాడే స్వరాన్ని హిందూస్తానీ వారు, జారు గమకంతో పాడతారు. కర్ణాటక సంగీతం దీనికి భిన్నం. ఎలా అనడిగితే, పాట పాడుతూ వివరించవలసినదే కానీ మాటల్లో వివరించ చెప్పటం కుదరదు.
ఒకప్పుడు సినిమాల్లో వినబడే పాటలకు ఒక ప్రామాణికత వారికివారే ఏర్పరచుకుని, గౌరవమైన సంగీతాన్ని అందించేవారు.
సంప్రదాయ సంగీతమంటే భయభక్తులుండేవి. హాయిగా ఆనందంగా పాడే పాటైనా విరహమైనా, వైరాగ్యమైనా, వియోగమైనా సన్నివేశాలకు తగినట్లు ఆయా రసాల్ని ఆవిష్కరింపచేయగల రాగాలు. వాటి సంచారాలు క్షుణ్ణంగా తెలిసి సంగీత దర్శకులు ప్రాణమంతా పెట్టి ఒకటికి నాలుగుసార్లు బాగా పాడుకుని ఆ పాటల్లోని సాహిత్యానికి తగిన ట్యూను కుదిరిందనుకున్న తర్వాతే ఖాయం చేసుకునేవారు
చిడతలు, డప్పులు, డోళ్ళు, డోలక్‌లు వాయించే ప్రతివారూ అడ్డంపడి సంగీత దర్శకత్వం చేయటానికి సాహసించేవారు కాదు. వారి పరిధుల్లోనే ఉండేవారు. అనిల్ బిస్వాస్, రోషన్, వసంత దేశాయ్, సవిల్ చౌదరి (రామచంద్ర), నౌషద్ అలీ, ఓంప్రసాద్ నయ్యర్ (ఒ.పి.నయ్యర్), మదన్‌మోహన్, జైకిషన్ దయాభాయ్ ( జైకిషన్), శంకర్ సింగ్ రఘువంశి (శంకర్) మొదలైన ఉన్నత శ్రేణి సంగీత దర్శకులు వెనకటి తరంలో చేసిన పాటలన్నీ సామాన్య శ్రోతల మెప్పుకోలు లక్ష్యంగా తయారైనవి కావు. వినేవారి స్తాయికి తగ్గిపోయి తయారైనవీ కావు. వారికి సంగీతం అంటే భక్తి గౌరవాలుండే సంగీతం అంటే అర్థం తెలిసి విద్వాంసులు సైతం మెచ్చుకుని శహభాష్ అనిపించేలా ఉత్తమ ప్రమాణాలే లక్ష్యంగా వారి సంగీతముండేది. అప్పటి పాటలన్నీ వినగలిగేవారి సంస్కారాన్ని పెంచే స్థాయిలోనే ఉండేవి. దీనికి సాక్ష్యంగా మూగలే ఆజమ్, రోషనార, షాజహాన్, బైజు బావరా, మధుమతి మొదలైన చిత్రాలెనె్నన్నో. ఒక హిందీ భాషా చిత్రాలే కాదు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో గతంలో వచ్చిన చిత్రాల్లో ప్రధానంగా సంగీతమే ఆకర్షణగా నిలిచేది. అందుకోసమే సినిమాలు చూసేవారు. ఎలా పాడించినా చెల్లుతుందనీ, ఎలా పాడినా వింటారనే అతి నమ్మకం వారికి ఉండేది కాదు.
అందుకే అలనాటి పాటలు ఈ వేళ విన్నా లేదా ఎప్పుడు విన్నా మొదటిసారి విన్నట్లు అనిపిస్తుంది. వాటిని నేటి పాటలతో తూకం వేసి చూడండి.
గాయకులలో గానీ, సంగీత దర్శకులుగానీ పాతవారితో ఈవేళ పోటీ పడగలిగినవారిని లెక్కించాలంటే మనకున్న చేతివేళ్ళు ఎక్కువే. చిందర వందరగా ఏద అల్లరి చేసేస్తూ యిదే సంగీతమనుకునేవారికి దివ్యమైన భావనలెలా పుట్టాయి.
సంగీతం ఒక ధ్వని అని భావించేవారికి నాద సుఖం తెలియదు. చెప్పినా అర్థం కాదు. స్వరంలోనుండి నాదం పుడుతోందని, అది రాగవౌతోందనీ, ఎల్లలు దాటి పోతోందనీ, మహాసముద్రమై మానవాళి ఆ ఆనంద తరంగాలలో తన్మయవౌతోందనీ తెలిసి ఆ మూలధార నాదాన్ని పట్టుకున్న గాయకులు చాలా కొందరే ఉంటారు. దివ్యమైన నాదం యొక్క ఉనికిని తెలుసుకున్న వారిలో మహ్మద్ రఫీ ఒకడు.
మళ్లీ అంతటి ఘనుడు
మన తెలుగు చలనచిత్ర రంగంలో ఘంటసాల. వీరిద్దర్నీ తలుచుకోలేని సంగీత రసికులుండరు. రాగం పరిధి పరిమితం అనుకోకండి. అది ఆకాశమంత పెద్దది. పుష్పక విమానం వంటిది! ‘మనసున మనసై..’, ‘హిమగిరి సొగసులు..’ లాంటి పాటల్లో కనిపించే జైజవంతి /ద్విజావంతి రాగ దేవతల రూపాలను ముందుగా దర్శించేది గాయకులే. ఆ తర్వాత ఆ పాటలు విన్న సంగీత రసికులైన శ్రోతలు. ఇద్దరూ ధన్యులే. కానీ ఆశ్చర్యం కలిగించేదేమంటే అదే కంఠంతో కీర్తి లభించిన నేరానికి, అంతరంగంలో అయిష్టంగా ఉన్నా వృత్త్ధిర్మం కోసం పాడిన ‘అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే..’, ‘్భమీద సుఖపడితే తప్పులేదురా, బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా’, ‘లే లే లే లే లే నా రాజా..’ వంటి పాటలు పాడి ఎంతో బాధపడ్డ సందర్భాలు ఘంటసాల జీవితంలో లేకపోలేదని, సినిమా జీవితానికి స్వస్తి చెప్పాలని కూడా అనుకునేవారని సన్నిహితులు చెప్తారు.
ఈ ఘర్షణ ఏ గాయకుడికైనా తప్పదు. వృత్తికీ ప్రవృత్తికీ పొంతన ఉండదు. రసికత్వం లేని చోట కవిత్వం వినిపించే దౌర్భాగ్యం కలిగించకు తల్లీ అని కాళిదాసంతటివాడే మొరపెట్టుకున్నాడు. మూర్ఖుల మనసు రంజిల్ల చేయలేము. యిదీ అంతే. తివిరి యిసుకను తైలంబు తీయవచ్చు. మూర్ఖులలా కాదు. లోకం తీరు చాలా విచిత్రం. అన్యాయాన్ని ఎదిరించలేని నిస్సహాయత్వం, న్యాయమార్గం వదలలేని నిజాయితీగల అధికారుల మానసిక సంఘర్షణ కూడా యిదిగో ఇలాగే వుంటుంది. వారి వృత్తి ధర్మం వేరు. స్థానభ్రంవంతో వారు సరిపెట్టుకోగలరు. కానీ గాయకులు అలా కాదు.
గానమే వృత్తి అయితే మనస్సును తాకట్టు పెట్టిన గాయకులు మనస్ఫూర్తిగా పాడలేరు.
అలవికాని చోట అధికులమనలేరు. అది మార్చలేని స్థితి.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656