S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వామి వివేకానంద

సీ॥ తలపాగటే అద్ది? ధర వెలార్చిన స్వీయ
దేశ ప్రతిష్ఠైక దీప్తిగాని,
నుదురౌనటే అద్ది? విదిత హైందవ సమ
భ్యుదిత విజ్ఞానంపుకుదురుగాని;
కళ్లౌనటే అవ్వి? ఘనతత్త్వ భరత తా
ర్కిక నవ ప్రభల లోగిళ్లుగాని,
గళరవమ్మటె అద్ది? గంభీర గతిగల్గు
‘నయగరా’ జలపాత లయలుగాని;
సద్గురువు రామకృష్ణుని ఛాత్రుడట్టె
అతడు? సంస్కృతి ఛత్రమై అలరుగాని;
ఉన్నతుడు వివేకానంద యోగి వరుడు
నరుడె? శుభకీర్తుల అజరామరుడుగాని!

-రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287