S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిలుకా.. పదపద..

చలి గిలిగింతలు పెడుతుంటే.. ఆకాశంలో వొయ్యారాలొలుకుతూ పరుగులు పెడుతున్న పతంగులను చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగరేయడంలోని ఆనందం అనిర్వచనీయం. చలికాలం నుంచి వేసవికాలంలోకి వచ్చే ఉత్తరాయణంలో.. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తున్న సమయంలో.. హైదరాబాద్‌లో పతంగుల పండుగ ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగకు సగం నగరం ఖాళీ అయినప్పటికీ, ఉన్న జనం మిద్దెలపై పతంగులు ఎగురవేస్తూ కనిపించే దృశ్యాలు కోకొల్లలు. చూడాలనే అభిరుచి ఉన్నవారికి నెక్లెస్‌రోడ్డులో రమణీయ పతంగులు ఎగురవేసే వేదిక ఉంది. ఔత్సాహికులంతా ఇక్కడకు చేరుకుంటారు. తెలంగాణా రాష్ట్రంలో పతంగులకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దేశంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ తరువాత, హైదరాబాద్ నగరంలో పతంగుల పండుగకు తెరలేచింది. దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది కళాకారులు కన్నులకు ఇంపైన పతంగులను ఎగరేస్తారు.
చరిత్ర
రెండు వేల సంవత్సరాలకు పూర్వమే పతంగులను ఎగురవేసే సంస్కృతి ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించిన తైలవర్ణ చిత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర పతంగితోనే ప్రారంభమైంది. దుర్మార్గుడైన రాజును ఓడించడానికి హేన్ చక్రవర్తికి వచ్చిన ఉపాయమే తొలి పతంగి. రాజు కోటలోకి సొరంగాన్ని తవ్వడానికి హేన్‌కు వచ్చిన ఆలోచన పతంగిగా మారింది. పట్టుగుడ్డను చతురస్రాకారంలా మడిచి దారం కట్టి ఎగురవేశాడు. ఆ దారం ఆధారంతో కొలత తెలుసుకుని, ఆ కొలత ప్రకారం సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశపరచుకున్నాడు. ఆ తర్వాత పతంగి కాస్తా ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడానికి ఉపయోగించాడు. మెల్లిమెల్లిగా సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లో వినియోగించారు. క్రీస్తుపూర్వం 549లో పతంగులు ఆకాశంలో విహరించడం మొదలైంది. జపాన్‌లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల పతంగులను ఎగురవేస్తారట.. నార్వేలో పతంగుల పేరిట పండుగ జరుపుకోవడం సాధారణం. ఆసియా దేశాల్లో పతంగిని ఎగురవేయడం కొన్ని చోట్ల మతాచారంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం మే నెల్లో జపాన్‌లో పతంగుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. పావురాళ్లు, కంచర గాడిదలు మొదలైన వాటి ద్వారానే కాకుండా పతంగుల ద్వారా తపాలా సేవలు కొనసాగినట్టు తపాలా చరిత్ర చెబుతోంది. 1754లో బెంజిమన్ ఫ్రాంక్లిన్ అనే శాస్తజ్ఞ్రుడు ఆకాశంలో విద్యుత్ గురించి తెలుసుకునేందుకు పతంగులను వాడాడట. 1870లో లారెన్స్ హర్‌గ్రీవ్స్ అనే శాస్తజ్ఞ్రుడు ఒక బాక్సైట్‌ను సిద్ధం చేసి అందులో వైజ్ఞానిక పరికరాలను అమర్చి తద్వారా ఎన్నో ఘనకార్యాల్ని సాధించినట్లు తెలుస్తోంది. 19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జతచేసి ఎంతో ఎత్తుకు ఎగురవేసి, పైనుండి భూమి ఫొటోలు తీశారు. థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగరవేయాలంటే 78 రకాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నించి అవతలికి వెళ్లే అవకాశం ఉండటంతో భారీ పతంగులను ఎగరేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని చైనీయుల విశ్వాసం. తల బాగా పైకి ఎత్తినప్పుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తి ఇస్తుందని వారు నమ్ముతారు. ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి వారం ఒక కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. జపాన్‌లో కొన్ని పతంగుల బరువు 200 కిలోల దాకా ఉంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనైతే సంక్రాంతి రోజున ఏకంగా అంతర్జాతీయ పతంగుల పండుగే జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ‘ఉత్తరాయన్’గా పిలిచే ఈ వేడుకలో పాల్గొంటారు. చైనాలోని షాన్టాంగ్ నగరం పతంగుల రాజధానిగా మారగా, 1989లో గుజరాత్ రాష్ట్రం ‘అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్’కు వేదికైంది. అహ్మదాబాద్ నడిబొడ్డున ఉండే ‘పతంగ్ బజార్’ పండుగకు వారం రోజుల ముందు నుంచీ గాలిపటాలు కొనేవాళ్లూ, అమ్మేవాళ్లతో కిటకిటలాడిపోతుంది. అంతేకాదు.. చాలామంది ఇళ్లలోనే రంగురంగుల గాలిపటాలను తయారుచేసి వాటిని ఇంటి ముందే పెట్టి విక్రయిస్తారట. 1989 నుంచీ అక్కడ ఏటా ఈ వేడుక జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని పల్డి ప్రాంతంలో పతంగుల మ్యూజియం కూడా ఉంది. జమ్మూకాశ్మీర్‌లో రాఖీ పౌర్ణమికి గాలిపటాలు ఎగురవేస్తారు.
అంతర్జాతీయస్థాయిలో పతంగుల పండుగకు సీటెల్ కైట్ అసోసియేషన్ (చైనా) శ్రీకారం చుట్టగా ఏప్రిల్ 1, 1984న దీన్ని నిర్వహించారు. 1988లో అంతర్జాతీయ కైట్ ఫెడరేషన్ ఆఫ్ చైనా పనె్నండు
దేశాలతో కలిసి ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి మన దేశం. ఇందులో భాగంగానే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1989 నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. పతంగులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ పతంగుల మ్యూజియంను కూడా ఏర్పాటుచేశారు. 20వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను అహ్మదాబాద్‌లో ఎంతో అట్టహాసంగా జరిపారు. ఇందులో 34 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొని ఆకర్షణీయమైన పతంగులను ఎగురవేశారు. దీంతో గిన్నిస్‌బుక్ రికార్డులో చోటు దక్కించుకుంది పతంగు. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పండుగను నిర్వహిస్తోంది.
కుతుబ్‌షాహీల కాలం నుంచే హైదరాబాద్‌లో పతంగుల ఎగురుతున్న చరిత్ర మనది. తరువాత కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరమైంది. నిజాం సంస్థానంలో కొలువు కోసం వలస వచ్చిన లోథ్ వంశస్తులు పతంగులను తయారుచేయడం ఉపాధిగా మలచుకున్నారు. హైదరాబాద్ ధూల్‌పేట్‌లోని ఇరుకిరుకు సందుగొందుల్లో జీవనం సాగిస్తున్న ఈ వంశస్థులు సీజన్ ఉపాధిలో భాగంగా పతంగులు తయారుచేస్తారు. ఒకప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ పతంగుల కార్ఖానా ఉండేది. కాలక్రమంలో కార్ఖానా కనుమరుగు కాగా, వ్యక్తిగతంగా చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటుచేసుకుని పతంగులను తయారుచేసి విక్రయిస్తున్నారు. సూపర్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్, కార్టూన్స్, ఆక్టోపస్, హీరోహీరోయిన్ బొమ్మలతో పాటు కేసీఆర్, మోడీ బొమ్మలతో ఈ పంతగులు ఉంటున్నాయి. పతంగుల బిజినెస్‌లో చాలా లాభముంటుంది. రెండు, మూడు నెలలు బాగా గిరాకీ ఉండటంతో దాదాపు ముప్ఫై వేల వరకూ వారు లాభాన్ని ఆర్జిస్తుంటారు. ఈ పతంగుల సీజన్‌లో లోథ్‌ల ఉపాధి ఇలా గడిచిపోతుంది. పతంగుల తయారీకి కాగితం, కట్టె పుల్లలు, మాంజాలు ప్రధానమైన ముడి సరుకులు. ఇవి వీటిని ఇక్కడే సమకూర్చుకుంటారు. డిజైనర్ పతంగులకు సంబంధించిన సరుకును మాత్రం కాన్పూర్, ముంబై, ఢిల్లీ నుంచి తెప్పించుకుంటారు. గత కొనే్నళ్లుగా హైదరాబాద్ నగరంలో పతంగుల మధ్య వింత పోటీ అధికమైంది. అత్యంత పైకి ఎగరేయాలని, ఇతరుల పతంగులను తెంపి వేయాలన్న విపరీత ధోరణులు చోటుచేసుకున్నాయి. దీంతో డీల్, లప్టాప్, కీంచ్ కట్, కట్గయా, లూట్ లేరే, సఫా వంటి పదాలు పతంగుల వేడుకలో అనివార్యంగా మారాయి. ఈ పదాలకు ఊతమివ్వడానికి ‘చైనా మంజా’ మార్కెట్లోకి ప్రవేశించింది. గాజుపెంకుల పొడి, నైలాన్ దాంతో చైనా మాంజాను తయారుచేస్తారు. ఈ దారంతో పతంగులను ఎగురవేస్తుండటంతో పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు ముప్పుగా ఏర్పడింది. సమాచార వ్యవస్థ, విద్యుత్తుకు సంబంధించిన తీగలు తెగిపడటం, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఈ దారం భూమిలో కలిసిపోయే గుణం లేకపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. మట్టి, నీటి ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ చైనా మాంజా వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను దృష్టిలోంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. చైనా మాంజా కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, వినియోగించడం 1986 చట్టం సెక్షన్ 5 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.
ప్రపంచంలోనే అతి పొడవైన పతంగి 3,394 అడుగులు. అతి పెద్దది 55 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది గంటకు 193 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. అత్యధిక దూరం అంటే ఎత్తు 3,801 మీటర్లు, ఒకే దారానికి గుచ్చిన వరుస పతంగుల పయనం 9,740 మీటర్లు..
జాగ్రత్తలు
* గాలిపటాలను ఎగురవేయడానికి విశాలమైన మైదానాలను ఎన్నుకుంటే మంచిది.
* ఇరుకుగా ఉండే డాబాలపై ఎట్టి పరిస్థితిలోనూ పతంగులను ఎగురవేయకూడదు.
* గాలిపటం దారాన్ని బిగుతుగా పట్టుకుంటే చేతివేళ్లు తెగే ప్రమాదం ఉంది.
* తెగిన గాలిపటాల కోసం చిన్నారులు పరుగెత్తకుండా జాగ్రత్తపడాలి.
* విద్యుత్ తీగలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గాలిపటాలు చెట్లకు, తీగలకు చుట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనే వాటిని తీసే సాహసం చేయకూడదు. విద్యుత్ వాహక దారాలను గాలిపటాలకు ఎట్టి పరిస్థితిలోనూ కట్టకూడదు.