S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (19.1.2020 నుంచి 25.1.2020 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో అనవసరమైన ప్రయాణాలుంటాయి. ధార్మికమైన దానాలవల్ల మేలు కలుగుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగం, కీర్తిప్రతిష్ఠలు మొదలైన విషయాల్లో అప్రమత్తంగా మెలగాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులకు అవకాశం. లాభాలు కోల్పోవచ్చు. వ్యాపారాదుల్లో నష్టాలకు అవకాశం. సంప్రదింపులు, సమాచారంలో లోపాలుంటాయి. వ్యితిరేకతలు, ఋణాలు ఇబ్బంది పెట్టవచ్చు. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాల నిర్వహణలో నిరాశ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యాత్రలకు అనుకూలం. దానధర్మాలవల్ల మేలు. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. పోటీలు కూడదు. పార్ట్‌నర్‌షిప్స్‌లో నష్టాలు, తేడాలు వచ్చే అవకాశం. లేదా లాభాలు కోల్పోయే అవకాశం వుంటుంది. కుటుంబ ఆర్థికాంశాలలో అనుకూలత. సంతానంతో సంతోషం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వారం మధ్యమంలో నిరాశ వుంటుంది. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనారోగ్య భావనలు. కొత్త పనుల నిర్వహణ కూడదు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ వుంటుంది. కాంట్రాక్టు వ్యవహారాల్లో ఇబ్బందులు. నిర్ణయాదుల్లో లోపాలు. ఋణ రోగాదులవల్ల సమస్యలుంటాయి. అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు ప్రాధాన్యం వహిస్తాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. పరిచయాలు స్నేహానుబంధాలవల్ల చికాకులుంటాయి. అనుకోని ఇబ్బందులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి వుంటుంది. వ్యాపారాదుల్లో నష్టాలకు అవకాశం. నిర్ణయాదుల్లో ఇబ్బందులు. సౌకర్య లోపాలుంటాయి. శ్రమాధిక్యం. అనవసరమైన పోటీలకు దూరంగా మెలగాలి. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో నైరాశ్యం. అపోహలకు అవకాశం ఉంటుంది. నిర్ణయాలకు దూరంగా మెలగాలి. క్రమంగా ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. సుదూర ప్రయాణాలు. విందులు, వినోదాలు, విహారాలకు అనుకూలం.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీ రంగంలో గుర్తింపు వున్నా శ్రమ అధికంగా వుంటుంది. ఋణాదుల ఒత్తిడులున్నా అధిగమిస్తారు. భాగస్వామ్యాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సంప్రదింపుల్లో అనుకూలత. ఖర్చులు, పెట్టుబడుల్లో ప్రయోజనాలుంటాయి. వారం మధ్యమంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. అన్ని పనుల్లో అధిక శ్రమతో ఫలితాలుంటాయి. కొంత నిరాశ కూడా తప్పకపోవచ్చు. లాభాలు కోల్పోయే అవకాశం. సౌకర్య లోపాలుంటాయి. కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం వుంది. కాంట్రాక్టు వ్యవహారాల్లో జాగ్రత్త.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలకోసం రూపకల్పన చేస్తారు. కాని ఆశించిన పూర్తి సౌఖ్యం అందకపోవచ్చు. గృహ వాహనాదుల కోసం ప్రయత్నం కొనసాగుతుంది. ఊహించని కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. వ్యాపారాదుల్లో పోటీ బాగా వుంటుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు పూర్తిచేస్తారు. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గ విషయంలో కొంత నిరాశ అనిపిస్తుంది. క్రమంగా సంప్రదింపులు పెరుగుతాయి. వృత్తిలో అనుకూలత. భాగస్వామ్యాల్లో సంతోషం. స్ర్తి వర్గ సహకారం లభిస్తుంది. అధికారిక కార్యక్రమాలను ఆనందంగా నిర్వర్తిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనకూలం. సంతాన వర్గ సంబంధమైన అంశాల్లో ముఖ్య సమాచారం అందుతుంది. సౌకర్యాలు సమకూర్చుకోవడంలో శ్రమతో ఫలితాలు. ప్రయాణాల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదులకు సంబంధించి కమ్యూనికేషన్స్ ఉంటాయి. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వారం మధ్యమంలో ఆహార విహారాలు, సౌఖ్యం, విద్యాది విషయాలు ప్రభావితం చేస్తాయి. ఆశించిన ఫలితాలు ముందుగా అందకపోవచ్చు. తర్వాత సంతోషం. సంతృప్తి పెరుగుతుంది. కుటుంబంతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొంత శ్రమ వున్నా సంతోషంగా గడిపే ప్రయత్నం.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాలకు అనుకూలం. బ్యాంకు వ్యవహారాలు పూర్తిచేసుకునే ప్రయత్నం. సోదరవర్గ వ్యవహారాలుంటాయి. పోటీల్లో విజయం. సేవక వర్గ సహకారం. సంప్రదింపులకు అవకాశం వుంటుంది. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ఖర్చులు అధికం. విందులు వినోదాలు వివరాలపై ప్రత్యేక దృష్టి వుంటుంది. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ పెంచుకునే ప్రయత్నంలో కొంత నిరాశ. వార్తలు, సమాచారంలో కొంత అస్పష్టత, లోపాలకు అవకాశం. దగ్గరి ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. క్రమంగా సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. విద్యారంగంలోనివారికి అనుకూలం. మాతృవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. ఆలోచనలకు రూపకల్పన. సౌకర్యాలకు సంబంధించిన నిర్ణయాలుంటాయి. ఇతరుల సహకారం. కుటుంబంలో ఒత్తిడులు. మాట విలువ తగ్గకుండా చూసుకోవాలి. కమ్యూనికేషన్స్ వృద్ధి చెందుతాయి. అనుకోని ప్రయోజనాలు. వారం మధ్యమంలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఆచితూచి మెలగాలి. బ్యాంకు కార్యకలాపాలు ఇబ్బంది పెట్టవచ్చు. క్రమంగా సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. విందులు వినోదాలుంటాయి. భాగస్వామితో సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. ఖర్చులు పెట్టుబడులకు కూడా అవకాశం అధికం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు విశ్రాంతి ప్రధానంగా ఆలోచనీయాంశాలవుతాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. నిర్ణయాదులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. మాట విలువ పెరుగుతుంది. కొంత బద్ధకంగా కూడా వ్యవహరిస్తారు. మాట విలువ పెంచుకుంటారు. భాగస్వామితో అనుకూలత. వృత్తిలో గుర్తింపు కోసం ప్రయత్నం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక మానసిక ఒత్తిడులకు అవకాశం. సంప్రదింపులు విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు. లాభాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో మాట్లాడటంలో అధికారిక ధోరణి ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఖర్చులవల్ల కూడా మరింత మేలు కలుగుతుంది. సంప్రదింపులవల్ల మేలు కలుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. వ్యతిరేకతలపై విజయం. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు విశ్రాంతిపై దృష్టి పెరుగుతుంది. పరామర్శలుంటాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. కొంత ఒత్తిడి వుంటుంది. కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలుంటాయి. అధికారిక కార్యకలాపాలు ప్రభావితం చేస్తాయి. వారాంతంలో శారీరక మానసిక ఒత్తిడులుంటాయి.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబ ఆర్థికాంశాల వల్ల సంతోషం. నిర్ణయాదుల్లో కొన్ని లోపాలుంటాయి. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ప్రయోజనాల విషయంలో జాగ్రత్త. వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. నిర్ణయాదులు సమస్యలకు గురిచేస్తాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలు, లక్ష్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో ఇబ్బందులుంటాయి. విందులు, వినోదాలు, విహారాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో కొంత శ్రమ, నిర్ణయాదుల్లో జాగ్రత్త. శ్రమతో కార్యక్రమాలుంటాయి. కార్యనిర్వహణ దక్షత. లాభాలు సంతోషాన్నిస్తాయి. సౌకర్యాలు పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో అనుకూలత. వారం మధ్యమంలో పనుల నిర్వహణలో కొంత నైరాశ్యం వుంటుంది. శ్రమ అధికం అవుతుంది. జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు, వినోదాలు, విలాసాలు ప్రాధాన్యం వహిస్తాయి. ప్రయాణాలకు అవకాశం. విహార యాత్రలకు అవకాశం. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలకు అవకాశం వుంది.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ