S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ కీర్తి పతాకాలు-- సమ్మక్క సారలమ్మ

దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులున్న మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు (తల్లి దేవతలు) స్ఫురణకు రాగానే... వారి శక్తి దేవతల రూపాలు మదిలో సాక్షాత్కరించి వారి దివ్యదర్శన భాగ్యం కలిగినంత మహదానంద భరితులై భక్తకోటి పులకరించిపోతుంది. రెండేళ్లకొకసారి జాతర జరిగినా జాతరలకు ముందు రెండు, మూడు నెలల నుంచే భక్తులు సమ్మక్క, సారలమ్మలు తమపై ఆవహించినట్లుగా దివ్యానుభూతికి గురవుతుంటారు. ఇంతగా ప్రజల హృదయాల్లో పెనవేసుకుపోయి ఇలవేల్పులుగా కొలవబడుతుండడం కేవలం విశ్వాసమే ప్రాతిపదిక.
ఆ తల్లి దేవతలు మహిమాన్విత శక్తి దేవతలుగా, కోరిన వారికి కొంగు బంగారంగా అనాదిగా నమ్మి కొలుస్తూ తరిస్తున్నారు. వారి నమ్మకాలూ, మనోభావాలతో మేడారం జాతర కోట్లాది మంది దివ్యదర్శనాలతో వైభవోపేతమవుతోంది. అయితే మేడారం సమ్మక్క, సారలమ్మలపై ఇప్పటివరకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు.
ప్రజా బాహుళ్యం నుంచి వచ్చిన విస్తృత ప్రచారమే మహా చరిత్ర అయింది. సుమారు 700 ఏళ్లుగా ప్రజల నాలుకల నుంచి తల్లి దేవతల కథనాలు విశేష భక్తి, ఆరాధనలతో వెలువడుతున్నాయి. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ఎంతో కొంత నిజం లేనిదే సమ్మక్క, సారలమ్మలకు అంత శిఖరాగ్ర ఔన్నత్యం రాదు. వారు రాచరికాన్ని ప్రతిఘటించినవారైనందున ఆనాడు చక్రవర్తికి వ్యతిరేకంగా ఏ చరిత్రకారుడూ వారి చరిత్ర రాయలేకపోయారన్న వాదనలు ఉన్నాయి. అయితే చరిత్రకారులూ రాజుల శిక్షలకు భయపడి రాయకపోయినా ప్రజా గొంతును ఎవరూ ఆపలేరు. ఆ నేపథ్యంలోనే అప్పటి నుంచి ప్రజల ద్వారా క్రమంగా సమ్మక్క, సారలమ్మల చరిత్ర వెలువడిందని చెబుతారు.
700 ఏళ్లుగా మేడారం జాతర: చాళుక్యులూ, కాకతీయ చక్రవర్తుల కాలంలో ఖ్యాతి చెందిన మేడారాన్ని ‘‘మేడవరం’’, ‘‘సౌధవరం’’గా పిలిచినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయ రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు) ఇక్కడి ఆలయంలో నిర్మించి నిత్యపూజలు జరిపించాడని అంటున్నారు. అలాగే మేడారంలో ధర్మశాలలూ, భోజన, జల వనరులూ కూడా ఏర్పాటు చేసినట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు. కాకతీయ ప్రతాపరుద్రుడు ప్రజల్లో ఆరాధ్య దేవతలుగా కొలువున్న సమ్మక్క సారలమ్మ స్మృతిగా మేడారం జాతరను బ్రాహ్మణీయ పూజా విధానాలతో కాకుండా కేవలం కోయ గిరిజనుల ప్రాచీన పూజా సంస్కృతి, భక్తి విశ్వాసాల ప్రాతిపదికగా ఆరంభించి కొనసాగించినట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతాపురుద్ర చక్రవర్తి దక్షిణ భారత దండయాత్రలు సాగిస్తున్న సమయంలో మాఘ శుద్ధ పౌర్ణమి సమీపించింది.
మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర నిర్వహణ కాలం వచ్చింది. తాను ఓరుగల్లులో లేకపోవడం వల్ల జాతర నిర్వహణ ఎలాగా? అని ఆవేదన చెందాడు. ఆ సమయంలో తాను కేరళలోని తిరువనంతపురం దాడి యత్నంలో ఉన్నాడు. అక్కడ సమ్మక్క, సారలమ్మల తల్లి దేవతల వలే ‘‘అట్రుకాలదేవి’’ ఆమె కూతురు, ప్రజలచే పూజలందుకుంటున్నారు. దీంతో సమ్మక్క జాతరకు ప్రతిగా తిరువనంతపురంలో ‘మాఘశుద్ధ పౌర్ణమి’ పురస్కరించుకుంది. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతాపరుద్ర చక్రవర్తి అట్రుకాల దేవి జాతరను జరిపించినట్లు చెబుతున్నారు. దీంతో ప్రతాప రుద్ర చక్రవర్తి కాలం నుంచి 700 ఏళ్లకు పై నుంచి జాతర నిర్వహించబడుతున్నట్లు భావిస్తున్నారు.
చారిత్రక నేపథ్యం
క్రీ.శ. 1158-1195 సంవత్సరాల మధ్య కాలంలో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు ఓరుగల్లు కాకతయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఈ క్రమంలో పొలవాస సీమ అనబడు సబ్బిసాయిరం (నేటి కరీంనగర్ జిల్లా)ను కోయరాజు మేడరాజు పాలిస్తుండగా దాడి చేసి రుద్రదేవుడు అతన్ని ఓడించాడు. దీంతో మేడరాజు తాడ్వాయి ప్రాంతంలోని బయ్యక్కపేట అడవులకు పారిపోయి వచ్చాడు. ఈ క్రమంలో అతని సంతానం ఇక్కడ వృద్ధి అయిన నేపథ్యంలో అతని చందా వంశానికి చెందిన శిలాధరాజు బయ్యక్కపేట ఆదివాసి గిరిజన ప్రాంతాన్ని స్వతంత్రించి పాలిస్తున్నాడు. అతనికి ‘చంద్ర వదన’, ‘కనకమహాలక్ష్మి’ అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం లేదు. శిలాధరాజు దంపతులు వనదేవత ఆరాధకులు. వనదేవత ఒకరోజు రాత్రి నిద్రలో (కలలో) వారికి కనిపించి ‘‘పడిగాపురం’’ వన గుట్టలో ‘‘నేను మీకు పాపగా లభిస్తాను.. నన్ను తీసుకువచ్చి పెంచండి.. తదనంతర కాలం నేను ప్రజల ఆరాధ్య దేవతగా కొలువబడతాను’’ అని చెప్పింది.
పడిగాపురం వనగుట్ట
శిలాధరాజు తన అనుచరులతో ఒక రోజు వేటకు వెళ్లిన క్రమంలో పులుల మధ్యన నాగేంద్రుని పడగనీ దనదివ్య తేజస్సుతో మహోజ్వలంగా ప్రకాశిస్తున్న మహిమాన్విత పాప కనిపించింది. మన దేవతను ప్రార్థించగానే పులులు, నాగేంద్రుడు వెళ్లిపోయాయి. పాపను తీసుకొని శిలాధరాజు తన గూడెంకు వెళ్లాడు. పాపకు ‘‘సమ్మక్క’’ అని నామకరణం చేశాడు. పాప లభించిన నాటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. సమ్మక్క క్రమంగా పెరగసాగింది. ఆమె ఎప్పుడూ వనంలోనే గడిపేది. వన్యమృగాలను ఎంతగా ప్రేమిస్తే వాటితో చెలిమి చేసుకొని గడిపింది. దీంతో ఆ క్రూరమృగాలు అడవిలోని సాధుజంతువులపై దాడిచేయకుండా నియంత్రించింది. జింకలూ, దుప్పులూ, కుందేళ్లు లాంటి సాధు జంతువులు అడవిలో నిర్భయంగా, స్వేచ్ఛగా తిరుగాడే పరిస్థితులు కలిగించింది. క్రూరమృగాలు సాధుజంతువులతో చెలిమి చేయించి తాను అహింసామూర్తిగా సంకేతాన్నిచ్చింది.
గుట్టపై ఆవాసం
ఈవిధమైన జీవనశైలి వల్ల సమ్మక్క బయ్యక్క పేట పొలిమేరల్లోని తన గుట్ట వద్ద ఆవాసం ఏర్పర్చుకుంది. దీంతో శిళాదిరాజు ఆమెకు అక్కడ ఆవాసానికి ఒక కుటీరాన్ని నిర్మింపజేశాడు. అలాగే ఆమె నిత్యం పవిత్ర స్నానాలకు ఒక ‘బావిని’ తవ్వించాడు. దాంతో ఆ బావి ‘‘జలకంబావి’’గా రాబోయే కాలంలో ప్రసిద్ధి చెందింది. సమ్మక్క ఆవాసంలో ఆ గుట్టకు ‘సమ్మక్క తల్లి గుట్ట’గా ‘దేవుని గుట్ట’గా పేరు వచ్చింది. అయితే మేడారం జాతర సమయంలో సమ్మక్క తల్లిని ‘‘చిలుకల గుట్ట’’ నుంచి గద్దెకు తీసుకువచ్చే సమయంలో బయ్యక్క పేట సమ్మక్క గుట్ట వద్ద ఒక పెద్ద మెరుపు మెరిసి మేడారం వైపు వెళుతుందనీ, దీంతో సమ్మక్క తల్లి మెరుపు రూపంలో తమకు దర్శనమిచ్చినట్లుగా ఆ ఊరువాళ్లు ఎంతో భక్తివినమ్రతతో చెబుతూ ఆనందిస్తారు.
త్రిశక్తి దేవతల నిలయం
మేడారం, చిలుకలగుట్ట ఎంతో పవిత్రమైనది. మహిమాన్వితమైదని సమ్మక్క తల్లికి వనదేవత ద్వారా తెలిసింది. ఈ గుట్ట త్రిశక్తి దేవతలు ‘‘లక్ష్మి, సరస్వతి, పార్వతి’ తల్లులకు నిలయంగా గుర్తించింది. ప్రతీరోజూ ప్రాతఃకాలమునకు ముందు రాత్రి అమృతఘడియల్లో బ్రాహ్మీ ముహూర్తంలో ఋషులూ, సిద్ధులూ వచ్చి ఆ పుణ్య చిలుకలగుట్ట వద్ద త్రిదేవతా మూర్తులను ఆరాధిస్తారనీ గమనించింది. ఈ క్రమంలో గోదావరి తీర ప్రాంతమైన ఆ పుణ్య ప్రదేశంలో సప్తర్షులూ, కశ్యపుడూ, భరధ్వజుడూ, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు జమదగ్న అత్రిమహర్షుల పవిత్రత పోభూమిగా తెలుసుకుంది.
శక్తిపీఠాల్లో మేడారం ఒకటి
వనదేవత ద్వారా మేడారం యొక్క మరొక గొప్ప విశిష్టతను సమ్మక్క తెలుసుకుంది.
శివుడు ప్రకటించిన 108 శక్తిపీఠాల్లో మేడారం ఒకటి. శక్తిపీఠాల ఆవిర్భావ నేపథ్యాన్ని ‘‘దేవీ భాగవతం’’ వివరిస్తుంది. సతీదేవి శివుడిని పెళ్లాడినందుకు ఆమె తండ్రి ‘‘దక్ష ప్రజాపతి’’ ఆగ్రహించి అవమానించడంలో అభిమానవతియైన ఆమె యోగాగ్ని ప్రవేశంతో ఆత్మాహుతి చేసుకుంది. దీంతో శివుడు దుఃఖితుడై అగ్నిలో దహించుకుపోతున్న తన సతీమణి సతీదేవికి ప్రాణాలు పోయడానికి ఆమె దేహాన్ని బయటకు తీసి తన భుజం మీద వేసుకొని పరుగెత్త సాగాడు. దీంతో ఆమె శరీర భాగాలు పలుచోట్ల ఊడిపడ్డాయి. ఇది గమనించిన శివుడు తన పరుగు ఆపుకొని ‘సతీ’దేవి శరీర భాగం ఎక్కడైతే పడిందో ఆ ప్రదేశం పుణ్యప్రదేశంగా శక్తి ప్రభావిత స్థలంగా సతీదేవి ఆత్మ ఆవాహ్య, ఆవాస కేంద్రాలుగా మార్చాడు. ఈ విధంగా శివుడు సతీదేవి శరీర భాగాలు పడిన 108 ప్రదేశాల్ని శక్తిపీఠాలుగా ఆచంద్రతారార్కం ఆ గాథనీయ క్షేత్రాలుగా శాశ్వతంగా స్థిరపరచారు. ఆ క్రమంలో శక్తిపీఠమైన మేడారం శక్తి అంశితురాళ్లైన ‘‘సమ్మక్క తల్లి’’ సారలమ్మ ‘‘తల్లుల గద్దెలు ఆ ప్రభావం నేపథ్యంలోనే మహిమాన్విత శక్తిపీఠాలుగా వర్ధిల్లుతూ కోట్లాది ప్రజలతో ఆరాధించబడుతున్నట్లు ప్రచారం ఉంది.
మరో విశిష్టత
శ్రీరాముడూ, సీతా, లక్ష్మణ సమేతంగా వనవాసం చేసిన క్రమంలో చిలుకలగుట్ట వద్ద త్రిదేవతలను దర్శించుకున్నాడట. అనంతరం రావణుడు ఆడపడుచు అరణంగా చెల్లెలు శూర్పణఖ ఇచ్చిన దండకారణ్యంలోని భాగమైన మేడారం ప్రాంతం కూడా తాటకి, ఖర, దూషణరాక్షసాదులు మునులను కష్టపెడుతూ వారి యజ్ఞ యాగాదులను భగ్నం చేస్తూండగా శ్రీ రాముడు ఆ రాక్షసాదులను ఈ ప్రాంతంలోనే సంహరించాడట. ఈవిధంగా త్రేతాయుగ కాలం నుంచి కూడా మేడారం ప్రాంతం పవిత్ర ప్రదేశంగా విలసిల్లుతున్నట్లు తెలుసుకుంది. దీంతో ఆ పుణ్య, ధన్య దివ్య చిలుకల గుట్టకు వెళ్లి సమ్మక్క తల్లి ఆవాసం చేసుకుంది.
పగిడిద్దరాజుతో వివాహం
రుద్రదేవుడు చేతిలో ఓడి బయ్యక్క పేట అడవులకు మేడారాజు పారివచ్చి అక్కడ కోయ గిరిజన ఆదివాసిలను ఏకం చేసిన క్రమం, కాకతీయ రాజుల పట్ల విధేయత లేక రాజ్యానికి వేరుగా ఉంటున్న గిరిజనులను తన ఏలుబడిలోకి తెచ్చే క్రమంలో ప్రతాపరుద్ర చక్రవర్తి మేడారంను సామంత రాజ్యంగా ఏర్పాటు చేశాడు. కోయ గిరిజనులకు వారి జాతీయుడినే సామంత ప్రభువును చేసి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనీ తనకు విధేయుడై ఉన్న పొలాససీమను ఏలుతున్న రెండవ మేడరాజు సిఫార్సుతో అతని మేనల్లుడు పగిడిద్దరాజును మేడారం సామంత ప్రభువును నియమిస్తారు. ఈ క్రమంలో సమ్మక్కతో పడిగిద్దరాజు వివాహం జరుగుతుంది. కాగా సమ్మక్క పగిడిద్దరాజులు పూర్వజన్మలో మహాభారత కథానాయకి ద్రౌపది పాండవ వీరుడు భీమశేనులన్న నమ్మకం ఇక్కడి కోయ గిరిజనుల్లో ఉంటున్నందుకు ఉదాహరణగా జాతర సమయంలో సమ్మక్క తల్లిని చిలుకలగుట్ట నుంచి గద్దెకు తీసుకు వచ్చే ముందు పాండవ ధర్మరాజుకు, భీమసేనుని అంశ గల పగిడిద్ద రాజుకు ప్రథమంగా పూజలు చేసే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
సమ్మక్క సంతానం
ఇలా ఉండగా సమ్మక్క పగిడిద్ద రాజులకు నాగులమ్మ, సారలమ్మ జంపన్నలు జన్మిస్తారు. నాగులమ్మ సమీప కొండాయి రాజు, గోవిందరాజును వివాహమాడుతుంది. జంపన్న సోమక్కను వివాహమాడుతాడు. వారికి ఒక కూతురు జన్మిస్తుంది. సారలమ్మ తల్లి స్ఫూర్తితో నిత్యం దైవకార్యాలు, మహిమాన్విత కార్యాలు చేస్తుంటుంది. యుద్ధ విద్యలో ఆరి తేరుతుంది. ఆమె ఈ విధంగా ప్రజాహిత కార్యాలతో ప్రజాదేవతగా ఆరాధింపబడుతుంటుంది. కాగా సారలమ్మ అవివాహిత అని కొందరు, వివాహిత అని కొందరు వాదిస్తుండడంతో అది వివాదాస్పదంగా ఉంది.
కరువుకాటకాలు - అస్తవ్యస్తమైన జనజీవనం
ఈ నేపథ్యంలో మేడారం ప్రాంతలో కరువుకాటకాలు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి గజదొంగలు వచ్చి ఊళ్లపై పడి ప్రజల సంపదను దోచేవారు. దీంతో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. వారికి బతకడమే గగనమైంది. ఈ క్రమంలో పగిడిద్దరాజు, సమ్మక్కలు ప్రజల నుంచి పన్నులు వసూళ్లు చేయలేకపోయారు. దీంతో ప్రతాపరుద్ర చక్రవర్తికి కప్పం కట్టలేకపోయారు.
‘‘స్వతంత్ర రాజ్య ప్రకటనతో ఆగ్రహించిన చక్రవర్తి’’: ఇక ఈ పరిస్థితుల్లో ఎంత మాత్రమూ చక్రవర్తి ఆధిపత్యంలో గిరిజనం ఉండరాదని పగిడిద్ద రాజు, సమ్మక్కలు నిర్ణయించారు. దీంతో వారు మేడారంను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు.
ఆ కాలంలో చక్రవర్తి కొన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినంగా శిక్షిస్తాడు. ఈ నేపథ్యంలో ప్రతాప రుద్ర చక్రవర్తి ప్రధానమంత్రి నాగయ గన్ను ఈ (యుగంధరుడు), సర్వసేనాధిపతి భేతాళ నాయుడులను పగిడిద్దరాజును అణచి వెంటనే బంధించి తీసుకురమ్మని సంకేతంగా పంపిస్తాడు. ములుగు ప్రాంతంలోని లక్నవరం సరస్సు వద్ద సైన్యం విడిది చేసి అనంతరం మేడారంపై దాడి చేస్తారు.
వనవీరుల అమరత్వం
‘‘మేడారం వద్ద కాకతీయ సైన్యాలకు మేడారం తన వీరులకు హోరాహోరి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నాగులమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, జంపన్న భార్య సోమక్క వారి 12 ఏళ్ల కూతురు , సమ్మక్క ఆడపడుచు కోడూరు లక్ష్మక్క, ఆమె భర్త కృష్ణస్వామి, మరిది పోతరాజు, సమ్మక్క తమ్ముళ్లు బాలగోముడు, గండ్రగొడ్డలి అని పిలువబడే బాలకుమార స్వామి, ఆయన భార్య దూళిముత్తి అనే దృషికుమారి, మిగతా తమ్ముళ్లు కోలకాడు అనే సీతారామన్న, కాసాలనాయుడు, ఉయ్యాల బాలుడు, ముసలయ్య (గుట్టమీది ముసలయ్య), సమ్మక్క అంగ రక్షకురాళ్లు ముసలమ్మ గట్టమ్మ మారపిల్ల మారక్క, సూరక్క మొదలైన వనవీరలంతా ఆదివాసి గిరిజనుల సాధికారత, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం కాకతీయ సైన్యాలతో తుది వరకు పోరు సల్పి అమరులైనారు.
‘‘కాకతీయ సైన్యాలతో హోరాహోరీ యుద్ధం చేసి చివరకు ఆ సైన్యాల చేతిలో తీవ్ర క్షతగాత్రుడై యుద్ధ భూమి సమీపంలో ఉన్న సంపెంగ వాగులో పడి వీరమరణం చెందాడు జంపన్న. ఆయన రక్త్ధారలను కలుపుకున్న ప్రశాంత సంపెంగ వాగు గంభీరంగా మారి ‘‘జంపన్న వాగు’’ పేరుతో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.
ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రధానమంత్రి యుగంధరుడు, సర్వసేనాధిపతి భేతాళ నాయుడుల నేతృత్వంలోని కాకతీయ సైన్యాలతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజులు స్వయంగా ధీటైన యుద్ధం చేశారు. వారి శౌర్యప్రతాపాలకు యుగంధరుడు, భేతాళ నాయుడులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఒక దశలో వారి ఖడ్గ్ధారలకు తమ తలలు తెగిపడతాయనే, దేహాలు తుత్తినియలు అవుతాయన్న పరిస్థితికి వచ్చారు. అయితే వారి గొప్ప మారణాయుధాలు, సైన్య సంపత్తి ముందు సమ్మక్క, పగిడిద్దరాజు, సారలమ్మలు ఎంతో సేపు నిలువలేకపోయారు. పగిడిద్దరాజు, సారలమ్మలు యుద్ధంలో వీరమరణం చెందగా సమ్మక్క తీవ్రంగా గాయపడి యుద్ధ భూమిని వీడి చిలుకల గట్టువైపు వెళ్లి, మలుపు వద్ద ఉన్న ఒక నెమలి నారవృక్షం వద్ద కనిపించకుండా పోయింది. యుద్ధ్భూమిని వీడి వెళుతున్న సమ్మక్కను శిలాధరాజు పొరపాటు కొంతమంది కోయ వీరులు అనుసరించుకుంటూ వెళ్లి ఇదంతా చూశారు. నెమలి నారవృక్షం వద్దకు రాగానే వారికి అక్కడ రెండు కుంకుమ భరిణెలు కనిపించాయి. అవి వారికి తల్లి ఇచ్చిన జ్ఞాపక చిహ్నాలుగా వారు భావించారు.
ఆగ్రహించిన ప్రకృతి
ఇలా ఉండగా సమ్మక్క తల్లి పరివార, బంధుగణం యుద్ధంలో అమరులు కాగానే ప్రకృతిలో విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. సూర్యుడు కుంగిపోయాడు. ఆకాశంలో ఉరుములు, మెరుపులు మెరిసి పిడుగులు పడ్డాయి. భూమి కంపించిపోయింది. సమ్మక్క తల్లి, పగిడిద్ద రాజాదులను సంహరించినందుకే ప్రకృతి కోపించిందని యుగంధరామాత్యులు, భేతాళ నాయకులు గ్రహించారు. వారు సామాన్యులు కారని గ్రహించారు. వారు తమ మహిమాన్విత శక్తులను ఉపయోగించుకుంటే తాము, తమ చక్రవర్తి ఈ లోకంలో జీవించి ఉండేవారు కాదని, ప్రకృతి సహజ ధర్మానికి విరుద్ధంగా వారు వ్యవహరించలేదని, భావితరాల కోయగిరిజనానికి పోరాటస్ఫూర్తిని అందించడానికే యోధులుగా యుద్ధం చేసి వీరమరణం చెందారనీ అనుకున్నారు. తల్లి దేవతలను తమను క్షమించమని సాగిలబడి తమ తలల్ని నేలకు ఆన్చి వేడుకున్నారు. యుగంధరుడు, భేతాళ నాయుడులు, సమ్మక్క, సారలమ్మలు మహిమాన్విత శక్తి దేవతలుగా విశ్వసిస్తూ వారి భక్తులయ్యారు.
ఈ క్రమంలో కాకతీయ వంశ ఇలవేల్పు ఏకవీరాదేవి ప్రతాపరుద్ర చక్రవర్తికి కలలో కనిపించింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజులను అమరులను చేసిన అపరాధంపై ఆగ్రహించింది. వారు తన అంశగల శక్తి దేవతలనీ, వెంటనే వెళ్లి మేడారంను సర్వస్వతంత్ర రాజ్యంగా ప్రకటించి తల్లి దేవతలను క్షమాపణలు వేడుకొని వారి దివ్యస్మృతిగా సమ్మక్క, సారలమ్మల జాతర నిర్వహించమని ఆదేశించింది. దీంతో వెంటనే ప్రతాపరుద్ర చక్రవర్తి మేడారంకు ఆగమేఘాల మీద వచ్చాడు. చిలుకలగట్టు వద్ద సాగిలబడి తన వల్ల జరిగిన అమరత్వానికి, దుర్మార్గానికి తనను క్షమించమని సమ్మక్క, సారలమ్మ తల్లులను వేడుకున్నాడు. తల్లి దేవతలకు భక్తుడయ్యాడు. వనవీరుల పోరాట కలను సాకారం చేస్తూ ఆదివాసి కోయగిరిజనులకు శాశ్వత స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించాడు. చిలుకలగట్టు వద్ద లభించిన కుంకుమ బరిణలు సమ్మక్క, సారక్కల స్మృతి చిహ్నాలుగా మొక్కుకున్నాడు. యుద్ధం జరిగిన చోట గద్దెలు నిర్మింపజేసి శక్తి దేవతల పీఠాలుగా ఆరాధించారు. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, జంపన్న మొదలైన వన వీరులంతా అమరత్వం చెందిన మాఘశుద్ధ పౌర్ణమి రోజును పురస్కరించుకుని ప్రతీ రెండేళ్లకొకసారి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో వైభవోపేతంగా మేడారంలో అమ్మవార్ల జాతర నిర్వహించుకోవాలని చక్రవర్తి ప్రజల్ని కోరాడు. ఆ మేరకు ఆ మరణవీరులను స్మరిస్తూ ప్రతాపరుద్ర చక్రవర్తి మొదటిసారిగా జాతరను నిర్వహించాడు. అప్పటి నుంచి ఆరంభమైన ‘మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల జాతర ఏయేటికాయేడు మంచి వైభవోపేతంగా కోట్లాది భక్తజనసందోహంలో కొనసాగుతూ వస్తుంది. కాగా మహిళలు తమ పసుపు, కుంకుమలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని తల్లుల పేర ప్రతీయేడు ‘‘ముతె్తైదువుల పండుగ’’ను జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో ఆస్తికులు భక్తులుగా మారి సమ్మక్క, సారలమ్మలను వరధాయినిలుగా, శక్తిదేవతలుగా ఆరాధిస్తుండగా, దేవుడూ, దయ్యాలను నమ్మని నాస్తికులు వారిని మహా పోరాట వనవీర వనితలుగా ఎంతో గౌరవప్రదంగా మహోన్నతంగా అభిమానిస్తున్నారు. స్వాతంత్రేచ్ఛతో, ధిక్కార స్వరంతో ఆదివాసి కోయగిరిజనుల సాధికారత, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజరిక పాలనపై సమరం సాగించిన సమ్మక్క సారక్క, పగిడిద్ద రాజు జంపన్న, గోవిందరాజు, నాగులమ్మ. సోమక్క, లక్ష్మీ గేవక్క, తదితర వనవీరుల తలలు నరికి జంపన్న వాగులో వారి నెత్తుటి కత్తులు కడిగిన కరడుగట్టిన పచ్చి సామ్రాజ్యవాది ప్రతాపరుద్ర చక్రవర్తి అనీ కమ్యూనిస్టు భావజాలం గల వారు నిప్పులు చెరుగుతారు.
ఇదే క్రమంలో చరిత్రకారులు కాకతీయులు గిరిజనులతో యుద్ధాలు చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. గోదావరి తీరంలో కాకతీయ రాజ్యంపైకి శత్రువులు దాడులకు తెగబడకుండా గిరిజనులు దేశభక్తులుగా ఉంటూ సామ్రాజ్య సరిహద్దుల్ని సంరక్షిస్తూ శత్రువుల దాడులను ప్రతిఘటిస్తూ కాకతీయ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడేవారని అంటున్నారు. అందుకే వారిని కాకతీయ చక్రవర్తులు ఎంతగానో ప్రేమించారనీ చెబుతున్నారు. అందువల్లనే కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గిరిజన కళలను అధ్యయనం చేసి గ్రంథస్తం చేయమనీ నాట్యశాస్త్ర రచయిత, గజసేనాని, తన బావమరిది అయిన జాయపను ఆదేశించినట్లుగా ఉదహరిస్తారు.
కాగా సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, జంపన్నల కలల పంటే, గిరిజనుల సాధికారతకు, వారి సమగ్ర అభివృద్ధికి నేటి ప్రభుత్వం శాశ్వతంగా ఏర్పరచిన ప్రత్యేక పాలనా వ్యవస్థ ఐ.టి.డి.ఏలు అన్నది మనం గ్రహించాలి.

-తాళ్లపల్లి యాదగిరి గౌడ్ 9949789939