S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవతల ఆగమనం..అద్వితీయం..!

మేడారం జాతరలో ప్రధాన ఘట్టాలైన సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం ఓ అద్వితీయమైన అనుభూతి. ఆ అనుభూతిని వర్ణించలేం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కుబడులు చెల్లించే దృశ్యాన్ని కళ్లారా చూడాలి తప్పా వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను (వడ్డెలు) ఒప్పించి అమ్మవారి గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి ప్రతిసారి ప్రయాసే. ఇంటి ఆడకూతురును వివాహానంతరం అత్తవారింటికి పంపించేందుకు మనసొప్పని విధంగానే తమ కుల దైవం సమ్మక్క, సారలమ్మలను తమ ఆధీనం నుంచి గద్దెలపైకి తీసుకెళ్లి ప్రతిష్ఠించేందుకు వడ్డెలు పడే బాధ వ్యథాభరితంగా ఉంటుంది. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే భక్తుల లక్షలాది మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను బతిమాలి ఒప్పించి తీసుకురావాల్సిందే. గిరిజన సాంప్రదాయక వాయిద్యాలతో సమ్మక్క, సారక్కలను తీసుకొచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది. ఈ ఘట్టం వెనకనున్న కథనాన్ని స్పృశిస్తే అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. సమ్మక్క, సారమ్మలు కుంకుమ భరిణె రూపంలో కొలువుదీరారని గిరిజనుల నమ్మకం. ఈ కుంకుమ భరిణెలను వెదురు బుట్టల్లో భద్రంగా దాచి చిలకలగుట్టపై ఉండే ఆలయంలో పెడతారు. చిలకలగుట్టకు నలువైపులా ఈటెలు ధరించిన వడ్డెలు కాపలాగా ఉంటారు. ముందుగా సారలమ్మ, మరుసటి రోజు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్లు గద్దెపైకి చేరగానే లక్షలాది మంది భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు. వరంగల్‌కు నగరానికి 110 కిలోమీటర్ల దూరం దట్టమైన దండకారణ్యంలో ఉన్న మేడారంకు ఎన్నో ప్రయాసలుపడి పిల్లా, పాపలతో తరలివచ్చేది మూడు రోజుల జాతరలో ఈ ప్రధాన ఘట్టాన్ని చూడటం కోసమే. ఒక విధంగా చెప్పాలంటే శబరిలో అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం లాంటిదే ఈ ఘట్టం. వన దేవతలు గద్దెలపై కొలువు తీరగానే భక్తులు తమ పిల్ల పాపలకు తల వెంట్రుకలు తీయడం, బంగారంతో (బెల్లం) తులాభారాలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటారు.

-జాల రాధాకృష్ణ