S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ తాబేలు ఓ ప్లేబాయ్

ఇదేంటి? తాబేలు ప్లేబాయ్ ఏంటి? అనుకుంటున్నారు కదూ. నిజమేనండీ.. ఎంత ప్లేబాయ్ కాకుంటే 1800 తాబేళ్లతో కలుస్తుంది. దాదాపు 800 తాబేళ్లకు తండ్రి అవుతుంది. ఇప్పుడైనా ఈ తాబేలును ప్లేబాయ్ అని ఎందుకు అన్నారో అర్థమైందా.. వివరాల్లోకి వెళితే.. ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ ద్వీపాల్లో ఉండే డియాగో అనే భారీ తాబేలు తమ జాతిని అంతరించిపోకుండా కాపాడింది. గాలాపాగోస్ ద్వీపాల్లో ఒకటైన శాంటా క్రూజ్ ద్వీపంలోని పార్కులో తాబేళ్ల పెంపకం కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 14 మగ తాబేళ్లలో డియాగో ఒకటి. 1960ల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు విజయవంతమైంది. ఇప్పటివరకూ రెండు వేలకు పైగా భారీ తాబేళ్లు ఇక్కడ పుట్టి, పెరిగాయి. దీనికి ప్రధాన కారణమేంటంటే.. ఒకటి డియాగోని కామోద్దీపనలు మాత్రమేనని కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. వంద సంవత్సరాల వయసు ఉన్న ఈ తాబేలు సుమారు 800 తాబేళ్లకు తండ్రి అయ్యింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ముగిసింది. డియాగో తిరిగి తన ఎస్పన్నోల ద్వీపానికి వెళుతోందని గాలాపాగోస్ నేషనల్ పార్క్స్ (పీఎస్‌జీ) సర్వీస్ తెలిపింది. అక్కడ ఉన్న 1800 తాబేళ్ల జనాభాతో డియాగో కలుస్తుంది. ఈ జనాభాలో కనీసం 40 శాతానికి జన్మనిచ్చిన తండ్రి డియాగోయేనని పార్కు సిబ్బంది నమ్ముతున్నారు. ‘ఎస్పన్నోలాకు తిరిగొస్తున్న తాబేళ్ల వంశంలో అత్యధిక తాబేళ్లు జన్మించడానికి కారణమైంది డియాగోనే’ అని పార్క్ డైరక్టర్ జార్జ్ కరియాస్ ప్రముఖ వార్తా సంస్థతో చెప్పారు. ప్రస్తుతానికి ఈ తాబేలును తిరిగి తన సొంత ప్రాంతానికి, సహజ వాతావరణానికి తీసుకువస్తున్నారు. 80 సంవత్సరాల క్రితం ఒక శాస్ర్తియ యాత్రలో భాగంగా డియాగోను గాలాపాగోస్ నుంచి తీసుకెళ్లారని పార్కు సిబ్బంది భావిస్తున్నారు. ఎస్పన్నోల ద్వీపంలో 50 సంవత్సరాల కిందట రెండు మగ తాబేళ్లు, పనె్నండు ఆడ తాబేళ్లు మాత్రమే ఉండేవట. ఈ జాతి తాబేళ్లను కాపాడేందుకు డియాగోను, చెలొనొయిడిస్ హూడెన్సిస్ అనే మరో తాబేలును కాలిఫోర్నియాలోని శాస్ డియాగో జూకు తీసుకెళ్లారు. ఇప్పుడు డియాగో తన సొంత ద్వీపానికి విజయవంతంగా వెళుతోంది. అందుకే, దీన్ని ఇతర తాబేళ్లతో కలవకుండా
వేరుగా ఉంచుతున్నారు. గాలాపాగోస్ 21 ద్వీపాల్లో ఎస్పన్నోల ఒకటి. మిగతా 20 ద్వీపాల కంటే కూడా అతి పురాతనమైనది. ఈక్వెడార్‌కు పశ్చిమాన ఉన్న గాలాపాగోస్ ద్వీపాలు యునెస్నో ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతం హోదా పొందాయి. ఇక్కడి మొక్కలు, వన్యప్రాణులకి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉష్ణమండల బల్లులు, తాబేళ్ల వంటి చాలా దేశీయ జాతుల్ని గాలాపాగోస్ ద్వీపాల్లో కనుగొన్నారు. ఇక్కడి జీవవైవిధ్యాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.