S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉషోదయం

కదులుతున్న మేఘాలలో
ఆకాశం తేలిపోతూ వుంటుంది
దూరంగా సముద్రం
ప్రశాంతంగా కనబడుతుంది
హిమశిఖరాలు
సూర్య కిరణాల పరావర్తనంలో
మెరిసిపోతుంటాయి
కీకరారణ్యాలు
పచ్చని వలువలు కప్పుకుని
సేదతీరుతుంటాయి
సెలయేరుల గలగలల్లో
వీనులవిందైన
సంగీతం వినబడుతూ వుంటుందిః
తెల్లని కొంగల గుంపొకటి
గగనాన సాగిపోతూ వుంటుంది
ఆలోచనలు ముసురుకున్న
మనసులో
ఉషోదయాలు వెలుగు చూస్తుంటాయి

-యాదగిరిరావు జి